కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004 నుండి 2008 వరకు చేర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశాడు.[1]

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 నుండి 2009
నియోజకవర్గం చేర్యాల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 2 జనవరి 1958
నరసాయిపల్లి గ్రామం, మద్దూరు మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు నారాయణ రెడ్డి
జీవిత భాగస్వామి అరుణ
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
నివాసం హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం మార్చు

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి 2 జనవరి 1958లో తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, మద్దూరు మండలం, నరసాయిపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన ఎంఏ..,ఎల్.ఎల్.బి పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి జడ్పీటీసీగా ఎన్నికయ్యాడు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేర్యాల నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మండల శ్రీరాములుపై 25250 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో చేర్యాల నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల వైశాలిపై 14464 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

చేర్యాల నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనగామ నియోజకవర్గంలో విలీనమైన తరువాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగామ నుండి పోటీ చేసి కేవలం 236 ఓట్లతో ఓడిపోయాడు. ఆయన 2011లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి సస్పెండ్ అయ్యాడు. ప్రతాప్ రెడ్డి 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరి పార్టీలో కేంద్ర పాలక మండలి సభ్యుడిగా పని చేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా తీర్మానం చేయడంతో ఆయన పార్టీ నుండి బయటకు వచ్చాడు.

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి 6 జనవరి 2014న భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన 2014లో జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిజెపి తరఫున పోటీ చేసి ఓడిపోయాడు.[2] ప్రతాప్ రెడ్డి భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి 9 జనవరి 2018న రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.[3] ఆయన జూన్ 2019లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో రంగారెడ్డి స్థానిక సంస్థల ఎంఎల్‌సి స్థానానికి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి 244 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4] ఈ ఎన్నికల్లో పోలైన 797 ఓట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పి.మహేందర్ రెడ్డి కి 510 ఓట్లు దక్కగా, ప్రతాప్‌రెడ్డికి 266 ఓట్లు లభించాయి.

ఆయనను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన రెండో జాబితాలో జనగామ అభ్యర్థిగా ప్రకటించింది.[5][6]

మూలాలు మార్చు

  1. Eenadu (28 October 2023). "కాంగ్రెస్‌ కార్యకర్తల్లో జోష్‌". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  2. Sakshi (6 January 2014). "అప్పుడు మోడీ బర్తరఫ్ కోరి ఇప్పుడు పొత్తా". Archived from the original on 15 December 2021. Retrieved 15 December 2021.
  3. Sakshi (9 January 2018). "బీజేపీకి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి రాజీనామా". Archived from the original on 15 December 2021. Retrieved 15 December 2021.
  4. Hmtv (14 May 2019). "ఎమ్మెల్సీ అభ్యర్థిని మార్చిన టి.కాంగ్రెస్". Archived from the original on 15 December 2021. Retrieved 15 December 2021.
  5. Andhrajyothy (28 October 2023). "కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  6. Eenadu (28 October 2023). "హస్తం.. అభ్యర్థులు ఖరారు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.