మద్దూరు మండలం (సిద్ధిపేట జిల్లా)

తెలంగాణ, సిద్దిపేట జిల్లా లోని మండలం

మద్దూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన ఒక మండలం.[1] 2020లో మద్దూర్ మండలం నుండి దూల్‌మిట్ట గ్రామాన్ని మండల కేంద్రంగా చేసి మద్దూర్ మండలం లోని 8 గ్రామాలను దూలిమిట్ట మండలంలో కలిపారు. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం హుస్నాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది జనగామ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మద్దూరు ఈ మడలానికి కేంద్రం.

మద్దూరు మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్ధిపేట, మద్దూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్ధిపేట, మద్దూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్ధిపేట, మద్దూరు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°55′49″N 79°02′37″E / 17.930396°N 79.043655°E / 17.930396; 79.043655
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్ధిపేట
మండల కేంద్రం మద్దూరు (సిద్ధిపేట జిల్లా)
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 181 km² (69.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 38,731
 - పురుషులు 19,255
 - స్త్రీలు 19,476
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.91%
 - పురుషులు 69.06%
 - స్త్రీలు 40.85%
పిన్‌కోడ్ 506367

మండల జనాభా

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 38,731, పురుషులు 19,255, స్త్రీలు 19,476. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 181 చ.కి.మీ. కాగా, జనాభా 38,731. జనాభాలో పురుషులు 19,255 కాగా, స్త్రీల సంఖ్య 19,476. మండలంలో 9,143 గృహాలున్నాయి.[3]

వరంగల్ జిల్లా నుండి సిద్ధిపేట జిల్లాకు మార్పు

మార్చు

లోగడ మద్దూర్ గ్రామం/ మండలం వరంగల్ జిల్లా, జనగాం రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మద్దూరు మండలాన్ని (1+18) పందొమ్మిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లా, హుస్నాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. [1]

చేర్యాల మండలంలో చేరిన గ్రామాలు

మార్చు

ఈ మండలంలో లోగడ 13 గ్రామాలు ఉన్నాయి. తరువాత ప్రభుత్వం ఈ మండలం నుండి కమలాయపల్లి, అర్జునపట్ల అనే రెండు గ్రామాలను చేర్యాల మండలంలో విలీనం చేసింది. దానితో ఈ మండలంలోని గ్రామాల సంఖ్య 11కు చేరుకుంది.[4][5]

మండలంలోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. వల్లంపట్ల
  2. గాగిళ్ళపూర్
  3. నరసాయిపల్లి
  4. మద్దూర్
  5. సాలక్‌పూర్
  6. మర్మాముల
  7. ధర్మారం
  8. లక్కపల్లి
  9. రేబర్తి
  10. వంగపల్లి
  11. లద్నూర్
  12. మర్మముల

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "సిద్ధిపేట జిల్లాలో కొత్త మండలం... ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్". Samayam Telugu. Retrieved 2021-11-06.
  5. "New mandal formed in Husnabad revenue division". The New Indian Express. Retrieved 2023-08-19.

బయటి లింకులు

మార్చు