కొర్లపాటివారి పాలెం
కొర్లపాటివారి పాలెం, తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ప్రముఖులు
మార్చుకొర్లపాటి శ్రీరామమూర్తి: (అక్టోబర్ 17, 1929 - జూలై 26, 2011) కొర్లపాటివారి పాలెం గ్రామంలో కొర్లపాటి మణ్యం, రత్నమణి దంపతులకు మూడో సంతానంగా 1929 అక్టోబర్ 17 న శ్రీరామమూర్తి జన్మించాడు. కవి, విమర్శకుడు, సాహితీ పరిశోధకుడు, నాటకకర్త, దర్శకుడు, ప్రయోక్త, కథకుడు, ఉత్తమ అధ్యాపకుడు. బహువిధప్రతిభా సామర్థ్యాల్ని ప్రదర్శించిన విజ్ఞానఖని ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి. వేయి వసంతాలు మించి చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యం లో శోధించి, సాధించిన మహత్తర ఇతివృత్తాలతో ప్రచురించిన రచనల సంఖ్య స్వల్పమే. తనలోని సృజనశీలతను అధ్యయన దిశగా కొత్త దారులు పట్టించిన పరిశోధక మేధావి ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి[1].