కొల్లూరి చిరంజీవి
కొల్లూరి చిరంజీవి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్యుడు, తెలంగాణ ఉద్యమకారుడు.[1][2]
కొల్లూరి చిరంజీవి | |
---|---|
జననం | కొల్లూరి చిరంజీవి 1947 వరంగల్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం |
వృత్తి | వైద్యుడు & తెలంగాణ ఉద్యమకారుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1947 - 2021 |
జీవిత భాగస్వామి | చంద్రావతి |
పిల్లలు | అజిత |
ఉద్యమ నేపథ్యం
మార్చుకొల్లూరి చిరంజీవి 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి నాయకుడిగా ఉద్యమకారుల సమాఖ్య ఏర్పాటు చేసి సమస్యలపై పోరాటం చేశాడు. ఆయన పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరి కొండపల్లి సీతారామయ్యకు ప్రధాన అనుచరుడిగా పనిచేశాడు. చిరంజీవి 1977లో పీపుల్స్ వార్‌ను బయటకు వచ్చాడు. ఆయన పీపుల్స్ వార్‌ను బయటకు వచ్చిన అనంతరం బహుజన సమాజ్ పార్టీలో చేరాడు. చిరంజీవి మాలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్ని ఎంతో మంది విద్యార్థులకు, ఉద్యమకారులకు దిశానిర్దేశం చేశాడు.ఆయన కొన్నాళ్లపాటు బహుజన పత్రికకు ఎడిటర్ గా పనిచేశాడు.[3][4]
మరణం
మార్చుకొల్లూరి చిరంజీవి అనారోగ్యంతో బాధపడుతూ 2021 ఫిబ్రవరి 19న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చేరాడు. ఆయన చికిత్స నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఆయన చికిత్స పొందుతూ 2021 మార్చి 8న మరణించాడు.[5]
మూలాలు
మార్చు- ↑ Sakshi (9 March 2021). "డాక్టర్ కొల్లూరి చిరంజీవి కన్నుమూత". Sakshi. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
- ↑ Andhrajyothy (11 March 2021). "ఉద్యమాలే ఆయన ఊపిరి". andhrajyothy. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
- ↑ IB Times (8 March 2021). "Who was Dr Kolluri Chiranjeevi: Telangana movement activist at forefront of four-decade struggle passes away". www.ibtimes.co.in (in ఇంగ్లీష్). Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
- ↑ The Hans India (8 March 2021). "Telangana activist Dr Kolluri Chiranjeevi no more". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
- ↑ Namasthe Telangana (8 March 2021). "సెలవన్న ఉద్యమకారుడు కొల్లూరి చిరంజీవి కన్నుమూత". Namasthe Telangana. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.