గచ్చిబౌలి, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలంలోని గ్రామం.[1]

గచ్చిబౌలి
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి జిల్లా
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు
Government
 • Bodyహైదరాబాదు మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
500 032
లోక్‌సభ నియోజకవర్గంచేవెళ్ళ
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి
పట్టణ ప్రణాళిక సంస్థజిహెచ్ఎంసీ

ఇది హైటెక్ సిటీ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు సబర్బ్స్ కూడా హైదరాబాదు నగరానికి పూర్వోత్తర ప్రాంతంలో ఉంది.[2] తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ప్రధాన ఐ.టి కేంద్రం.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

 
ICICI బ్యాంక్ టవర్ల నుండి గచ్చిబౌలి స్కై లైన్

ప్రయాణ సౌకర్యాలు మార్చు

గచ్చిబౌలి నుండి- హైటెక్ నగరం, హైదరాబాద్ మహానగరంలోని ముఖ్య ప్రాంతాలకు రహదారుల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణాసంస్థ బస్సులు – నెం.216,217 గచ్చిబౌలి నుండి మెహిదీపట్నం, కోటి, ప్రధాన నగర కేంద్రాలను కలుపుతుంది. యం.యం.టి.ఎస్. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది. సమీరంలోని ఔటర్-రింగ్ రోడ్ శంషాబాద్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి కలుపుతుంది. హైదరాబాదు మెట్రో రైలు సర్వీసు కూడా సమీపంలోని మియాపూర్ నుండి అమీర్ పేట, నాగోలు వరకు ప్రయాణించుటకు అందుబాటులో ఉంది. హైదరాబాద్ మహానగరంలోని మరికొన్ని ముఖ్య ప్రాంతాలకు మెట్రో రైలు నిర్మాణం ప్రణాళికలో ఉండి శరవేగంగా పనులు జరుగుతున్నాయి.

విద్యా సంస్థలు మార్చు

 • యూనివర్శిటీ ఆప్ హైదరాబాదు,
 • ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్,
 • ఇంటర్నేషనల్ ఇనిష్ఠిట్యూట్ ఆప్ ఇన్పర్మేషన్,హైదరాబాదు,
 • నేషనల్ ఇనిష్ఠిట్యూట్ ఆప్ టూర్జిమ్ & హాస్పటాలిటీ మెనేజ్మెంట్
 • ఇండియన్ ఇమ్యులాజికల్స్ లిమిటెడ్,
 • కేంద్రీయ విద్యాలయ,
 • యన్.ఎ.యస్.ఆర్. స్కూల్
 • సి.యచ్.ఆర్.ఐ.సి.ఇంటర్నేషనల్ స్కూల్

అభివృద్ధి కార్యక్రమాలు మార్చు

గచ్చిబౌలి ఐటీ శివారు

ఐటీ పరిశ్రమతో పాటు, గచ్చిబౌలి క్రీడల కేంద్రం, స్వర్ణ తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, జిఎంసి బాలయోగి స్టేడియం, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, హాకీ స్టేడియం, ఆక్వాటిక్స్ కాంప్లెక్స్ ఉత్తమ స్టేడియంల వంటి వాటికి దీటుగా గచ్చిబౌలీలో ఉన్నాయి. మిచిల్ వరల్డ్ గేమ్స్, ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గచ్చిబౌలిలో నిర్వహించబడ్డాయి. సహజరాక్ నిర్మాణాలతో ఒక గోల్ఫ్ కోర్సు ఇటీవల అక్కడే వచ్చింది. పుల్లెల గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీ కూడా గచ్చిబౌలిలో ఉంది. 2012లో ఇక్కడ బయోడైవర్సిటీ పార్కు నిర్మించబడింది.

గచ్చిబౌలీలోని హాస్పటల్స్ మార్చు

 • మ్యాక్స్ క్యుార్ హాస్పటల్
 • హిమగిరి హాస్పటల్
 • కాంటినెంటల్ హాస్పటల్
 • రాజిత హాస్పటల్

అభివృద్ధి పనులు మార్చు

 • గచ్చిబౌలి డివిజన్‌ టీఎన్జీవోస్‌ కాలనీలో కోటి 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, గోపన్‌పల్లి గోసాయికుంట చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో భాగంగా అంచనా వ్యయం 178.54 లక్షల రూపాయలతో చేపట్టనున్న పనులకు 2022, జూలై 30న తెలంగాణ ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి శంకుస్థాపన చేశాడు. స్థానిక కార్పొరేటర్‌ గంగాధర్‌ రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ కొమిరిశెట్టి సాయిబాబా, బేవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవిప్రసాద్‌, ఇరిగేషన్‌ డీఈ నళిని, ఏఈ పావని, ఏఈ మహేందర్‌లతోపాటు పలువురు స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.[4]
 • ఈ ప్రాంతంలో పురాతన కాలం నాటి మెట్ల బావి ఉంది. రెయిన్ వాట‌ర్ ప్రాజెక్టు వ్యవస్థాపకురాలు కల్పనా రమేష్ నేతృత్వంలో చిరాగ్ స్కూల్ యజమాన్యం సహాయంతో ఈ బావి పున‌రుద్ధ‌ర‌ఇంచబడింది. మెట్ల బావి పున‌రుద్ధ‌ర‌ణకు ముందుగా దాంట్లోని సున్నం గాఢ‌త‌ను ప‌రీక్షించి, అనంత‌రం రెడీ మిక్స్‌లో సున్నాన్ని క‌లిపి పున‌రుద్ధ‌ర‌ణ పనులు చేప‌ట్టారు.[5]

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

 1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-07.
 2. "The Hindu : Property Plus Hyderabad : Grab a slice of Gachibowli pie". hindu.com. Archived from the original on 2012-10-26. Retrieved 2016-04-08.
 3. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-01. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
 4. telugu, NT News (2022-07-31). "శేరిలింగంపల్లిని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతా". Namasthe Telangana. Archived from the original on 2022-07-31. Retrieved 2022-07-31.
 5. "గ‌చ్చిబౌలి మెట్ల బావి ప్రారంభం.. కేటీఆర్ అభినంద‌న‌లు". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-24. Archived from the original on 2021-11-25. Retrieved 2021-12-23.

ఇతర లింకులు మార్చు