కోకోకోకిల
కోకోకోకిల 2017లో విడుదలైన తెలుగు సినిమా. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తమిళంలో ‘కొలమావు కోకిల’ పేరుతో నిర్మించిన ఈ సినిమాకు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించగా తెలుగులో ‘కోకో కోకిల’ పేరుతో డబ్బింగ్ చేశారు. నయనతార, యోగి బాబు, శరణ్య, శరవణన్, రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2018 ఆగస్ట్ 31న విడుదలైంది.[1]
కోకోకోకిల | |
---|---|
దర్శకత్వం | నెల్సన్ దిలీప్‌కుమార్ |
రచన | నెల్సన్ దిలీప్‌కుమార్ |
దీనిపై ఆధారితం | తమిళ సినిమా ‘కొలమావు కోకిల’ |
నిర్మాత | అల్లిరాజా సుభాస్కరన్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | శివకుమార్ విజయన్ |
కూర్పు | ఆర్. నిర్మల్ |
సంగీతం | అనిరుధ్ రవిచందర్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | జీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 31 ఆగస్టు 2018 |
సినిమా నిడివి | 140 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుకోకిల (నయనతార) మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తన తల్లి (శరణ్య)కు కాన్సర్ రావడంతో ఆపరేషన్ కు 15 లక్షలు కావాలి. మసాజ్ పార్లర్ లో ఉద్యోగం ద్వారా వచ్చే సొమ్ము సరిపోక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కోకిల, డ్రగ్స్ సరఫరా చేసే ఓ గ్యాంగ్ లో ట్రాన్స్ పోర్టర్ గా చేరుతుంది. ఈ క్రమంలో ఆమె అనుకోని కష్టాల్లో పడుతుంది. ఈ కష్టాల్లోంచి ఆమె బయట పడడానికి ఆమె ఎదుర్కొన్న సమస్యలేమిటి ? చివరికి తన తల్లి ని కాపాడుకుందా ?? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
మార్చు- నయనతార
- యోగి బాబు
- శరణ్య
- హరీశ్ పేరడీ
- శరవణన్
- రాజేంద్రన్
- జాక్వెలిన్
- రెడిన్ కింగ్స్లీ
- ఆర్.ఎస్.శివాజీ
- చార్లెస్ వినోత్
- చీను మోహన్
- అన్బు తాసన్
- అరంతాంగి నిషా
- వడివేలు బాలాజీ
- అరుణ్ అలెగ్జాండర్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
- నిర్మాత: లైకా ప్రొడక్షన్స్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నెల్సన్ దిలీప్‌కుమార్
- సంగీతం: అనిరుధ్ రవిచందర్
- సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్
- ఎడిటర్: నిర్మల్
మూలాలు
మార్చు- ↑ Zee Cinemalu (21 August 2018). "కోకోకోకిల" (in ఇంగ్లీష్). Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
- ↑ Zee News Telugu (31 August 2018). "కోకోకోకిల మూవీ రివ్యూ". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.