శరణ్య (నటి)

భారతీయ సినీ నటి

శరణ్య (ఆంగ్లం: Saranya Ponvannan; జననం 1970 ఏప్రిల్ 26) ఒక భారతీయ భాషా చలనచిత్ర నటి.[1] ఈమె తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చలనచిత్రాలలో నటించింది.

శరణ్య
జననం
షీలా

(1970-04-26) 1970 ఏప్రిల్ 26 (వయసు 54)
వృత్తిభారతీయ చలనచిత్ర నటి, మోడల్, ఫ్యాషన్ డిజైనర్, నేపథ్య గాయని
క్రియాశీల సంవత్సరాలు1987-1996
2003 నుండి ప్రస్తుతం వరకు
జీవిత భాగస్వామిపొన్‌వణ్ణన్
తల్లిదండ్రులు
  • కె.బి.రాజ్ (తండ్రి)

విశేషాలు

మార్చు

ఈమె ప్రముఖ మలయాళ దర్శకుడు కె.బి.రాజ్ కుమార్తె. ఈమె 1970, ఏప్రిల్ 26న కేరళ రాష్ట్రంలోని అలప్పుళాలో జన్మించింది. ఈమె అసలు పేరు షీలా. ఈమె చెన్నైలోని మహిళా క్రిస్టియన్ కళాశాలలో డైటీషియన్ డిగ్రీ చేసింది. ఈమె నటిగానే కాకుండా మోడల్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా, నేపథ్య గాయనిగా కూడా పేరు సంపాదించింది. ఈమె 1995లో రచయిత, నటుడు, దర్శకుడు అయిన పొన్‌వన్నన్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

సినిమా జీవితం

మార్చు

శరణ్య మణిరత్నం సినిమా నాయకుడు (తమిళంలో నాయగన్)తో సినిమా రంగంలోనికి అడుగు పెట్టింది.[2][3] మొదటి సినిమాలోనే కథానాయికగా అవకాశం దొరకడం, ఆ సినిమాలో ఈమె నటన బాగుండడంతో ఈమెకు 1980 దశకం చివరి నుండి పలు సినిమాలలో కథానాయికగా వరుసగా అవకాశాలు లభించాయి. 1995లో వివాహం తరువాత కొన్ని సంవత్సరాలు నటనకు విరామమిచ్చి 2003 నుండి తిరిగి క్యారెక్టర్ నటిగా సినిమాలలో నటిస్తున్నది. ఈమె నటనకు నాలుగు ఫిలింఫేర్ అవార్డులు, ఒక జాతీయ చలనచిత్ర అవార్డ్ లభించింది. ఈమె 2014లో ఒక తమిళ సినిమాలో ఒక పాట కూడా పాడింది.

సినిమాల జాబితా

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
1987 నాయకన్ \ నాయకుడు నీలా తమిళం తొలిచిత్రం
1988 మనసుక్కుల్ మత్తప్పు డా.గీత తమిళం
ఎన్ జీవన్ పాడుతు నర్మద తమిళం
మేళం కొట్టు తాళి కట్టు ముత్తమ్మ తమిళం
శివప్పుతాళి కీర్తన తమిళం
ధాయమ్ ఒన్ను ప్రీత తమిళం
1989 ఆండ్రు పెయ్య మజాయియిల్ ప్రీతి తమిళం
సకలకల సమ్మంధి ఉమా తమిళం
కరుంగుయిల్ కుండ్రం తమిళం
నీరాజనం జయ తెలుగు
అర్థమ్ మానస మలయాళం
1990 అంజలి డా. షీలా తమిళం
ఉలగం పిరంధడు ఎనక్కగా మీనా తమిళం
1991 వనక్కం వాటియారే సుందరి తమిళం
నాన్ పుడిచా మాప్పిళ్ళై లక్ష్మి తమిళం
అశ్విని తెలుగు
గంగ తెలుగు
ఆకాశ కొట్టాయిలే సుల్తాన్ మల్లిక మలయాళం
చెప్పుకిలుక్కన చంగాతి మణికుట్టి మలయాళం
ఆనవల్ మోతీరం అన్నీ మలయాళం
ఎన్నుమ్ నన్మకల్ ఇందు మలయాళం
1992 అగ్ని పార్వై సీత తమిళం
కొట్టై వాసల్ రేఖ తమిళం
సాహసం రేఖ తెలుగు
1993 దశరథన్ వాసంతి తమిళం
మాగ్రిబ్ ఆరిఫా మలయాళం
జర్నలిస్ట్ రంజిని మలయాళం
ఎంటే శ్రీకుట్టిక్కు నందిని మలయాళం
ఇంజక్కడన్ మథాయ్ & సన్స్ బీనా మలయాళం
1994 డాలర్ లూసీ మలయాళం
కరుత్తమ్మ పొన్నత తమిళం
సీవలపేరి పాండి వేలమ్మాళ్ తమిళం
1995 పసుంపోన్ మలార్ తమిళం
1996 అప్పాజి రేఖ కన్నడ
మీందం సావిత్రి ఉమా తమిళం
నేతి సావిత్రి తెలుగు
బాస్ కన్నడ
ఈశ్వరమూర్తి IN లతిక మలయాళం
సమయంకొందు సుల్లు రుక్మిణి కన్నడ
2003 అలా నిర్మల తమిళం పెళ్లి తర్వాత కమ్ బ్యాక్ సినిమా
చంటిగాడు సావత్రియమ్మ తెలుగు
2004 వర్ణజాలం కార్తిగ తమిళం
అరుల్ అరుల్ సోదరి తమిళం
అధు మీరా తల్లి తమిళం
చత్రపతి శరవణన్ సోదరి తమిళం
రామకృష్ణ రామకృష్ణ తల్లి తమిళం
మీసాయి మాధవన్ దేవి తమిళం
గోమతి నాయకం తమిళం
2005 అయోధ్య జమీలా తమిళం
రామ్ శారద తమిళం
శివకాశి కయల్విజి తమిళం
తవమై తవమిరుండు శారద ముత్తయ్య తమిళం ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళం
2006 ఎంటాన్ మగన్ సెల్వి తమిళం ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళనాడు

రాష్ట్ర చలనచిత్ర ఉత్తమ సహాయ నటి అవార్డు

తిరువిళైయాడల్ ప్రారంభం తిరు తల్లి తమిళం
రాఖీ గౌరీ తల్లి తెలుగు
అడైకలం కస్తూరి తమిళం
2007 తిరుమగన్ జయకోడి తమిళం
జగడం శీను తల్లి తెలుగు
కిరీడం రాజేశ్వరి తమిళం
పిరప్పు కాళియమ్మన్ తమిళం
వెల్ శారద (వేలు & వాసు తల్లి) తమిళం
పులి వరుడు రమేష్ తల్లి తమిళం
2008 పిడిచిరుక్కు స్టెల్లా తమిళం
నెంజదై కిల్లాధే వసంత్ తప్పుడు తల్లి తమిళం
సింగకుట్టి కతీర్ తల్లి తమిళం
విలయట్టు తమిళం
కురువి దేవి కోడలు /కొచ్చా భార్య తమిళం
పాండి శివగామి తమిళం
రెడీ పూజ తల్లి తెలుగు
తేనవట్టు వజువంతల్ తమిళం
దిండిగల్ సారథి శారద తమిళం
ఇని వారు కాలం అరవింద్ తల్లి తమిళం
2009 యవరుం నలం శాంతి, మనోహర్ తల్లి తమిళం
రంగులు డాక్టర్ రాజలక్ష్మి మలయాళం
వనం పార్థ సీమయిలే తమిళం
2010 పోలీస్ క్వార్టర్స్ జయమ్మ కన్నడ
బయం అరియన్ సరస్వతి తమిళం
పుల్లిమాన్ యశోదా పనికర్ మలయాళం
కలవాణి లక్ష్మీ రామసామి తమిళం ఉత్తమ సహాయ నటిగా ఆనంద వికటన్ అవార్డులు

తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర ఉత్తమ సహాయ నటి అవార్డు

గురు శిష్యన్ మహాలక్ష్మి తమిళం
మగనే ఎన్ మరుమగానే పొన్నరసి తల్లి తమిళం
తంబిక్కు ఇంధ ఊరు శ్రీమతి కుమారస్వామి తమిళం
వేదం పద్మ తెలుగు
కొమరం పులి పులి తల్లి తెలుగు నామినేట్ చేయబడింది, ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తెలుగు
నానే ఎన్నోల్ ఇల్లై జానకి తమిళం
యక్షుడు యక్షుని తల్లి కన్నడ
తెన్మెర్కు పరువుకాట్రు వీరాయి తమిళం ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం

విజయ్ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు ఉత్తమ సహాయ నటిగా - తమిళ నార్వే ఉత్తమ సహాయ నటిగా తమిళ చలనచిత్రోత్సవ అవార్డు ఉత్తమ సహాయ నటిగా ఎడిసన్ అవార్డు

2011 ముత్తుక్కు ముత్తగా పేచీ తమిళం
వనం లక్ష్మి తమిళం
సాధురంగం అనలార్ భార్య తమిళం
మహారాజా సీత తమిళం
2012 ఓరు కల్ ఓరు కన్నది శెంబగం తమిళం ఉత్తమ సహాయ నటిగా నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు

నామినేట్ చేయబడింది, ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళ్ నామినేట్ చేయబడింది, ఉత్తమ సహాయ నటిగా విజయ్ అవార్డు

చారులత చారు & లత తల్లి తమిళం
కన్నడ
తాండవం శివకుమార్ తల్లి తమిళం
నీర్పరవై మేరీ తమిళం ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళ

SIIMA సహాయ పాత్రలో ఉత్తమ నటిగా

2013 వట్టికూచి శక్తి తల్లి తమిళం
కుట్టి పులి దేవనై తమిళం నామినేట్ చేయబడింది, సహాయక పాత్రలో ఉత్తమ నటిగా SIIMA
ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా మీనాక్షి తమిళం
సువడుగల్ తమిళం
2014 ఇదు కతిర్వేలన్ కాదల్ యశోతమ్మాళ్ తమిళం
నాన్ సిగప్పు మనితాన్ సుమతి తమిళం
ఎన్నమో నడకదు విజయ్ తల్లి తమిళం ఉత్తమ సహాయ నటిగా ఆనంద వికటన్ అవార్డులు
మనం సీతారాముడు తల్లి తెలుగు
పప్పాలి తమిళం
వేలైయిల్లా పట్టతారి భువన తమిళం ఉత్తమ సహాయ నటిగా SIIMA ఉత్తమ సహాయ నటిగా తమిళ

ఆనంద వికటన్ అవార్డులు , ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు - తమిళం నామినేట్, ఉత్తమ సహాయ నటిగా విజయ్ అవార్డు నామినేట్, ఉత్తమ సహాయ నటిగా నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు

అమ్మా అమ్మమ్మా లక్ష్మి తమిళం
2016 బెంగళూరు నాట్కల్ కన్నన్ తల్లి తమిళం
24 సత్యభామ తమిళం
బ్రహ్మోత్సవం బాబు అత్త తెలుగు
రెమో శివ & రెమో తల్లి తమిళం
కోడి కోడి & అన్బు తల్లి తమిళం నామినేట్ చేయబడింది, ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళం
ఆచమింద్రీ రాజలక్ష్మి తమిళం
2017 వేలైయిల్లా పట్టతారి 2 భువన తమిళం
కథా నాయకన్ తంబిదురై తల్లి తమిళం
మగలిర్ మట్టుం సుబ్బులక్ష్మి తమిళం మ‌గువ‌లు మాత్ర‌మే తెలుగులో
2018 మన్నార్ వగయ్యార కలైయరసి తమిళం
ఇట్లీ ఇంబా తమిళం ప్రధాన పాత్ర
జుంగా జుంగా తల్లి/ డాన్ అమ్మ తమిళం
మరైన్తిరున్తు పార్కుమ్ మర్మమ్ ఎన్నా జపాన్ తల్లి తమిళం
కొలమావు కోకిల కోకిల తల్లి తమిళం ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళం

నామినేట్ చేయబడింది - తమిళంలో ఉత్తమ సహాయ నటిగా SIIMA

కోకోకోకిల (తెలుగు)

ది విలన్ విశాలవ్వ కన్నడ
ఓరు కుప్రసిద పయ్యన్ చెంబకామల్ మలయాళం
2019 కలవాణి 2 లక్ష్మి తమిళం
గ్యాంగ్ లీడర్ వరలక్ష్మి తెలుగు
2021 భూమి భూమినాథన్ తల్లి తమిళం
మహా సముద్రం అర్జున్ తల్లి తెలుగు
ఎంజీఆర్ మగన్ రాసతి తమిళం
2022 ఈతర్క్కుమ్ తునింధవన్ కోసలై తమిళం
విరుమాన్ ముత్తులక్ష్మి తమిళం
చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ నీల తల్లి హిందీ హిందీ సినిమా రంగప్రవేశం
వరలారు ముక్కియం కార్తీక్ తల్లి తమిళం
ముసలోడికి దసరా పండుగ
అరువా సంద వల్లి తమిళం
2023 కుషీ రాజలక్ష్మి తెలుగు
కన్నపన్‌ని మాయాజాలం చేయడం లక్ష్మి తమిళం
2024 ఇడి ముజక్కం TBA తమిళం చిత్రీకరణ
గ్యాంగ్‌స్టర్ గ్రానీ TBA తమిళం చిత్రీకరణ
సోదరుడు TBA తమిళం చిత్రీకరణ
మజై పిడిక్కత మనితన్ TBA తమిళం తెలుగులో తుఫాన్
కల్లపార్ట్ తమిళం ఆలస్యమైంది

మూలాలు

మార్చు
  1. "Distinguished Alumnae". Women's Christian College (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 3 December 2018.
  2. "Back into form with a bang". The Hindu. Chennai, India. 25 November 2006. Archived from the original on 5 November 2012. Retrieved 30 October 2009.
  3. Ashok Kumar, S.R. (15 December 2005). "An actress who plays her roles with aplomb". The Hindu. Chennai, India. Archived from the original on 13 May 2006. Retrieved 3 December 2018.

బయటిలింకులు

మార్చు