కోటంరాజు సత్యనారాయణ శర్మ

కోటంరాజు సత్యనారాయణ శర్మ గారు బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రసిద్ధులు. ఆయన తెలుగు రచయిత.

జీవిత విశేషాలు మార్చు

ఆయన 1926 జనవరి 4 వ తేదీన జన్మించారు.ఆయన తల్లి పేరు కోటరాజు సుబ్బరాయమ్మ. ఆయన ఇరవయ్యవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులు భద్రిరాజు కృష్ణమూర్తి గారికి సహధ్యాయ. అతను ఉద్యమశీలి, సంస్కృతభాషా ప్రచారిణీసభకు కార్యదర్శిగా చాలా ఏళ్ళుండి ఆ భాషా వ్యాప్తికి ఎంతో కృషి చేశాడు. అతని వ్యాసాలు తెలుగు సాహిత్యాభిలాషను, సంస్కృతభాష, సమకాలీన విద్యా విధానంలోనిలోపాల గురించిన వ్యాసాలు అతని స్వతంత్రా లోచనా విధానాన్ని ఆవిష్కరిస్తాయి.[1] ఆయన భద్రిరాజు కృష్ణమూర్తి మరికొందరు సహాధ్యాయులతో కలిసి ”ఆంధ్రసాహిత్య మండలి” అనే రచయితల సంస్థను స్థాపించారు.

ఇంటర్మీడియేట్‌ ప్యాస్‌ అయింతర్వాత ఆయన ఉద్యోగంలో చేరారు. అతను కాకినాడ, చిత్తూరు మొదలైన చోట్ల పనిచేసి 1948కి మళ్ళీ గుంటూరు చేరాడు.

శర్మగారు ఆధాయం పన్ను శాఖలో స్టెనోగా జీవితం ప్రారంభించి, ఆం.ప్ర. హైకోర్టులో మాస్టర్‌గా, లాయర్‌గా ఎన్నో శిఖరా లు అధిరోహించినా, తమ సాహిత్య జీవితానికి ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు. అనేక రచనలు చేశారు. పద్యాలు, వ్యాసాలు, ఆధ్యాత్మిక రచనలూ పాఠకులకు అందిం చారు. గాయత్రి బ్రహ్మవిద్య, శ్రీరామ నామవైభవం, భగవాన్‌ శ్రీ రమణ మహర్షి వీరి ముద్రిత రచనలు భక్తకల్పద్రుమ శతకం, కల్యాణి నాటకం, భగవద్గీతపై ఆధ్యా త్మిక విశ్లేషణా వ్యాస పరంపర అముద్రిత రచనలు. అతని సహస్రపూర్ణచంద్రదర్శనోత్సవ సందర్భంగా అతని రెండో కూతురు, ప్రసిద్ధ కవయిత్రి డా. చిల్లర భవానీదేవి అతను రాసిన వ్యాసాలన్నిటినీ సేకరించి చిన్న పుస్తకంగా అచ్చు వేయించారు.[2] ఆయన చిత్తూరులో "చిత్తురు-సంస్కృత భాష ప్రచారిణీ" సభ కు కార్యదర్శిగా కూడా పనిచేసారు.[3]

మూలాలు మార్చు

  1. చిల్లర భవానీదేవి సాహిత్య జగతి[permanent dead link]
  2. "మిత్రవాక్యం ("నాన్నగారి వ్యాసాలు" నుంచి)". Archived from the original on 2016-03-04. Retrieved 2015-12-31.
  3. "నాన్న గారు వ్యాసాలు పుస్తకంలో ఆయన సోదరుని సందేశం నుండి" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2015-12-31.

ఇతర లింకులు మార్చు