కోఠి మహిళా కళాశాల

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కోఠిలో ఉంది

కోఠి మహిళా కళాశాల తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కోఠిలో ఉన్న కళాశాల. బ్రిటీషు రెసిడెంట్ కోసం 1798లో నిర్మించబడిన ఈ బ్రిటీషు రెసిడెన్సీ భవనం, 1949లో మహిళా కళాశాలగా మార్చబడింది.[1][2]

కోఠి మహిళా కళాశాల
రకంప్రభుత్వ
స్థాపితం1924 (గోల్డెన్ త్రెషోల్డ్, 1949 (కోఠి కళాశాల)
స్థానంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం India
కాంపస్పట్టణ
జాలగూడుwww.oucwkoti.ac.in

తెలంగాణ రాష్ట్రంలో మ‌హిళా యూనివ‌ర్సిటీ అవ‌స‌ర‌మ‌న్న దిశ‌గా ఆలోచించిన రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ కళాశాలను తెలంగాణ మ‌హిళా విశ్వ‌విద్యాల‌యంగా అప్ గ్రేడ్ చేస్తూ 2022 ఏప్రిల్ 25న ఉత్త‌ర్వులు జారీ చేసింది.[3]

చరిత్ర మార్చు

5వ బ్రిటీషు రెసిడెంట్ గా ఉన్న జేమ్స్ ఆచిల్లెస్ కిర్క్ పాట్రిక్ కోసం 1798లో నిజాం ప్రభువు తన సొంత ఖర్చుతో బ్రిటీషు రాయల్ ఇంజనీర్ లెఫ్టినెంట్ శామ్యూల్ రసెల్ రూపకల్పనలో ఈ భవనాన్ని నిర్మించాడు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1949లో ఉస్మానియా విశ్వవిద్యాలయము మహిళా కళాశాల తరగతులు ప్రారంభించింది.[4][5]

కళాశాల వివరాలు మార్చు

 
కోఠి మహిళా కళాశాల
 
బ్రిటీష్ రెసిడెన్సీ
  1. ఈ కళాశాలలో 29 శాఖలకు సంబంధించి 44 (22 యూజీ, 20 పీజీ) కోర్సులలో 4516 మంది విద్యార్థినులు చదువుకుంటుండగా, 253మంది బోధనా సిబ్బంది, 191మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు.
  2. ఇందులో 49 సైన్స్‌ ల్యాబులు, ఆరు కంప్యూటర్‌ ల్యాబ్‌లు, ఒక గ్రంథాలయం, సైబర్‌ కేఫ్, గ్రీన్‌హౌస్, 110 తరగతిగదులు, ఫార్మస్యూటికల్‌ ల్యాబ్, సైకాలాజీ కౌన్సిలింగ్‌ ల్యాబ్, ఇంగ్లీష్‌ లాగ్వేజ్‌ ల్యాబ్, హెల్త్‌ సెంటర్లతో పాటు రెండు వసతి గృహాలు, నాలుగు సెమినార్‌ హాల్స్, దర్బార్‌హాల్, ఎగ్జామినేషన్‌ బ్రాంచ్, పరిపాలన భవనాలు ఉన్నాయి.[6]

కోర్సుల వివరాలు మార్చు

క్రమసంఖ్య విభాగం శాఖ
1 ఫ్యాకల్టీ ఆఫ్‌ లైఫ్‌సైన్స్‌ రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, జెనెటిక్స్, న్యూట్రీషియన్‌, కామర్స్, బిజినెస్‌ మెనేజ్‌మెంట్, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, యూజీ, పీజీ, ఎంఎస్సీ, ఎంబీఎ, ఎంసీఎ, డిప్లొమా శాఖలు
2 ఫ్యాకల్టీ ఆఫ్‌ ఫిజికల్‌ సైన్సెస్‌ భౌతికశాస్త్రం, మ్యాథమేటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌
3 ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అరబిక్, హింది, ఇంగ్లీష్, పర్షియన్, ఉర్దూ, మరాఠి, ఫ్రెంచ్, తెలుగు, సంస్కృతం
4 ఫ్యాకల్టీ ఆఫ్‌ సోషల్‌ స్టడీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, పొల్టికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, సోషియాలాజీ, సైకాలాజీ, మాస్‌ కమ్యూనికేషన్స్, జియోగ్రఫీ, ఫిలాసఫీ[7]

ఇవీ చదవండి మార్చు

మూలాలు మార్చు

  1. Deccan Chronicle (2 March 2018). "Telangana : Proposal to name Koti varsity 'Khairunnisa'". Mahesh Avadhutha. Retrieved 23 September 2019.
  2. Sakshi (24 February 2018). "'కోఠి' వర్సిటీ". Archived from the original on 7 అక్టోబరు 2021. Retrieved 7 October 2021.
  3. "తెలంగాణలో తొలి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-04-25. Retrieved 2022-04-25.
  4. బ్రిటీషు రెసిడెన్సీ, ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 49
  5. వెబ్ ఆర్కైవ్, సాక్షి ఎడ్యూకేషన్. "అసఫ్ జాహీల నిర్మాణాలు". Archived from the original on 21 April 2018. Retrieved 23 September 2019.
  6. సాక్షి, తెలంగాణ-హైదరాబాదు (24 February 2018). "కోఠి వర్సిటీ". Sakshi. Archived from the original on 23 September 2019. Retrieved 23 September 2019.
  7. telugu (30 May 2022). "కొత్త కోర్సులు.. కొత్త పోస్టులు." Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.

ఇతర లంకెలు మార్చు