కోడూరి విష్ణునందన్

కోడూరి విష్ణునందన్

జననము

మార్చు

రౌద్రి అధిక జ్యేష్ట బహుళ అష్టమి శుక్రవారం జూన్6, 1980

జననీ జనకులు

మార్చు

కోడూరి శేషఫణి శర్మ, శ్రీమతి విజయలక్ష్మి జన్మస్థలం: నంద్యాల, కర్నూలు జిల్లా సతీమణి: డా.యజమానం కాత్యాయని యం.బి.బియస్.ఎం.డి

వైద్య విద్య

మార్చు

కర్నూలు మెడికల్ కాలేజి కర్నూలు, కేర్ హాస్పిటల్ హైదరాబాదు, మెడిసిటీ మెడికల్ కాలేజ్, మేడ్చల్.

అభిమాన కవిద్వయము: శ్రీ విశ్వనాధ సత్యనారాయణ, కరుణశ్రీ

బిరుదము : కవితా రోచిష్ణు (2003)

సత్కారములు

మార్చు

గరికిపాటి సాహిత్య పురస్కారము (2005) కీ.శే.వెంకటరావు పంతులు ధార్మిక సాహితీ పురస్కారం (2006) మహాకవి గడియారం వేంకట శేషశాస్త్రి స్మారక పురస్కారం (2014) శ్రీ నన్నయభట్టారక పీఠం, తణుకు వారి శ్రీ తంగిరాల వేంకటకృష్ణ సోమయాజి పద్యగ్రంధ పురస్కారం (ధర్మదండము -పద్యకావ్యానికి-మార్చి14-2016)

వ్యాసంగము

మార్చు

ప్రాచీన సాహిత్య పఠనము, పద్య రచన, చదరంగము, సంగీత శ్రవణము. అభిలాష: విస్తృత పద్యకవితా వ్యాప్తి. ఆశయము: సామాజిక సాహితీ సేవ.

అముద్రిత గ్రంధములు

మార్చు

జగన్నాధ పండిత రాయల భామినీ విలాసము-ఆంధ్రానువాదము, "శ్రీనివాస ప్రభూ" శతకము, కవితావిలాసము (పద్య సంకలనము)

ధర్మదండము పద్యకావ్యము

మార్చు

డా.కోడూరి విష్ణునందన్ గారు 'ధర్మదండమనే' పేరిట 1001 తెలుగు పద్యాలు, సంస్కృత శ్లోకాలతో జగద్గురు ఆదిశంకరాచార్య జీవిత చరిత్రను సమగ్రంగా నిర్వచన కావ్యంగా రచించి తమ కావ్యాన్ని ఆదిశంకరులకే అంకితమొనర్చారు.ఈ కావ్యం సముద్భవ కాండము, సన్న్యాస కాండము, సంవాద కాండము, సంస్కార కాండము, సర్వజ్ఞ కాండము అని అయిదు కాండములుగా విభజింపబడింది. వీరు తమ 18వ యేటనే కావ్యరచనకు పూనుకొని శంకరుల జననం నుండి, శంకర మండనమిశ్రుల సంవాదం వరకు రెండు కాండములు రచించి ప్రథమభాగంగా 2003లో ముద్రించారు.తిరిగి 2013లో శంకర మండనమిశ్రుల సంవాదం మొదలుకొని ఆదిశంకర అవతార పరిసమాప్తి వరకు ద్వితీయభాగంగా రచించి రెండు భాగాలనూ కలిపి సంపూర్ణ పద్యకావ్యంగా ముద్రించారు.రచనా శైలి పరంగా, ఛందో వైవిధ్య పరంగా ఉన్నత స్థాయికి చెందినదిగా ఈ కావ్యం గుర్తింపు పొందినది. పలువురు కవిపండితుల ప్రశంసలను అందుకొన్నది.

అంకితము

మార్చు
  • నీకై వ్రాసిన ధర్మదండమిది అందింతున్ ప్రభూ నీకు ని
  • న్నేకొండాడుదు స్వామి మత్కవితలో నీకన్న నర్హుండెవం
  • డీ కావ్యమ్ము గ్రహింప?నీ కరుణచే నీ గాథ నిన్ గూర్చితిన్
  • జేకోవయ్య ప్రియమ్ముగా యతివరా! చేమోడ్పులో శంకరా!

ధర్మదండ కావ్యముపై ప్రముఖుల అభిప్రాయాలు

మార్చు

శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం-శృంగేరి.

మార్చు

డా.కోడూరి విష్ణునందన్ గారికి నమస్కారములు తమరు రచించిన 'ధర్మదండమును శ్రీ చరణులవలోకించారు.పరమేశ్వరావతార స్వరూపులగు శ్రీ మచ్ఛంకర భగవత్పాదులవారి పవిత్ర చరిత్రమును తమరు ఈ కావ్యమునందు పొందుపరచి తమ వాణిని పావనమొనర్చుకొనినారు.మాధవీయ శంకరదిగ్విజయముననుసరించిన ఈ కావ్యము శిష్టజనోపాదేయముగనున్నది.విశేషించి శంకరులు ఈశ్వరుని స్తుతించిన దండకము, మండనమిశ్రులు శంకరులను స్తుతించిన దండకము రమణీయముగనున్నవి.

డా.సి.నారాయణ రెడ్డి: అభినందన

మార్చు

ధార్మిక ప్రవచనాలద్వారా అసాధారణ వ్యక్తిత్వ విశేషాలద్వారా ఆసేతు శీతాచలం సుప్రతిష్ఠులైన జగద్గురువులు ఆదిశంకరాచార్యులు.వైద్య విద్యాపట్టభద్రులైన డా.కోడూరి విష్ణునందన్ గారు ఆదిశంకరుల జీవిత చరిత్రను 'ధర్మదండము' పేరిట పద్యకావ్యంగా రచించారు.ఆదిశంకరుల జీవన యానంలోని ముఖ్యఘట్టాలను పద్యాకృతిలో ప్రచురించారు డా.విష్ణునందన్ గారు. విష్ణునందన్ గారికి ప్రౌఢ పద్యరచన పట్టుబడింది. పద్యాలతో పాటు ఈ కావ్యంలో ధారాధురీణంగా సాగే దండకం పొందుపరచడం విశేషం.ఆదిశంకరుల జీవన రేఖలతో పాటు వారి సంస్కృతశ్లోకాలను మూలసమ్మితంగా అనువదించడం గణనీయ విషయం. ప్రాచీన పరిణత పద్యకవుల రచనలను తలపించే ఈ 'ధర్మదండము' కావ్యం రచించిన డా.కోడూరి.విష్ణునందన్ గారికి నా హార్దికాభినందన.

మహా సహస్రావధాని డా.గరికిపాటి నరసింహారావు

మార్చు

ఛాందసం లేని ఛందస్సులు

ఛందోమయమైన కవిత్వం రాస్తూ కూడా ' నేను ఛాందసం లేని వాడిని ' అనే ఈ కవి పేర్కొన్నారు.ఇవ్వేళ కవితా ప్రపంచానికి కావలసిందదే. అది ఈ డాక్టరు గారిలో పుష్కలంగా ఉంది. ఆదిశంకరుల జీవిత చరిత్రే రచించినా దాన్ని అత్యాధునిక పాఠకులకు అందిస్తున్నామనే విషయం మరిచిపోలేదు. ప్రౌఢమైన కథావస్తువు ఆధారంగా సాగిన ఈ రచన ఆధునికులు అందుకొనేంత సరళంగానూ, రస స్ఫూర్తికి అన్యాయం జరగనంత ప్రౌఢంగానూ సాగింది. ఈ యువకవిలోని ఈ ప్రజ్ఞ ఏడెనిమిదేళ్ల క్రితమే మా కంట్లో పడి ధర్మదండం మొదటి భాగానికి 'గరికిపాటి సాహిత్య పురస్కారం' ప్రదానం చేసి సంతోషపడ్డాం. ఒక అల్లోపతి వైద్యుడు చేసిన ఈ పద్య వైద్యం ఆధునిక సాహిత్య సమాజానికి పట్టిన భావ దారిద్య్ర, భాషా దైన్య రోగాలకి తగిన చికిత్స చేస్తుందని నా విశ్వాసం.

ఇతర లింకులు

మార్చు

www.dharmadandam.blogspot.com