నంద్యాల
నంద్యాల ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో గల పట్టణం, అదేపేరుగల మండలం కేంద్రం. కుందూ నదీ తీరాన ఉన్న ఈ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలకు ఒక పెద్ద వాణిజ్య కేంద్రం. పి.వి.నరసింహారావు నంద్యాల నియోజకవర్గము నుండి లోక్‌సభకు అత్యంత భారీ మెజారిటీ వోట్లతో ఎన్నికై ప్రపంచ రికార్డు సృష్టించాడు. నంద్యాల దగ్గరలో మహానంది అనే ప్రముఖ పుణ్యక్షేత్రం, యాత్రా స్థలం ఉంది.
నంద్యాల | |
---|---|
నగరం | |
![]() నంద్యాల రైలు కూడలి ప్రధాన ప్రవేశద్వారం | |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానం | |
నిర్దేశాంకాలు: 15°29′N 78°29′E / 15.48°N 78.48°ECoordinates: 15°29′N 78°29′E / 15.48°N 78.48°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల |
ప్రభుత్వం | |
• ప్రభుత్వ రకం | పురపాలకసంఘం |
విస్తీర్ణం | |
• మొత్తం | 19.00 కి.మీ2 (7.34 చ. మై) |
సముద్రమట్టం నుండి ఎత్తు | 203 మీ (666 అ.) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 2,11,424 |
• సాంద్రత | 11,000/కి.మీ2 (29,000/చ. మై.) |
అక్షరాస్యత వివరాలు | |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 518501,518502 |
వాహనాల నమోదు కోడ్ | AP–21 |
జాలస్థలి | Nandyal Municipality |
చరిత్రసవరించు
పూర్వము నంద్యాలకు నందియాల అని పిలిచేవారు. నంద్యాల చుట్టూవున్న నవ నందులు విజయనగర సామ్రాజ్యంలో ముఖ్యమైన పుణ్యక్ష్యేత్రాలుగా వర్దిల్లాయి.
భౌగోళికంసవరించు
ఉష్ణోగ్రత శ్రేణి:వేసవికాలం: 30 °C. - 44 °C. (దాదాపు 81.56F - 119.6F),శీతాకాలం: 21 °C. - 30 °C. (దాదాపు 57F - 81.56F)
వర్షపాతం: 695 మి.మీ (Seasonal)
నదులు: చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు నంద్యాలలో ప్రవహించే ప్రధాన నదులు.
కొండలు: నల్లమల కొండలు ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి.
నీటి పారుదలసవరించు
తుంగభద్ర నది మీద సుంకేశుల డ్యామ్ వద్ద మొదలై కడప-కర్నూలు (కె.సి) కెనాల్ కర్నూలు జిల్లాల ద్వారా ప్రవహిస్తూ 4000 నాలుగు వేలు హెక్టార్ల సాగుభూమికి నీటిని సమకూరుస్తున్నది. సాగునీటి పారుదల కొరకు హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు, పులివెందల కాలువ నిర్మాణములో ఉన్నాయి. నది మీద వేలుగోడ్ గ్రామం వద్ద తెలుగుగంగ జలాశ్రయము నిర్మించబడింది. వెలుగోడు ప్రాజెక్టు త్రాగునీటికి ముఖ్య ఆధారం
జనాభా గణాంకాలుసవరించు
- జనాభా (2011) - మొత్తం 2,69,368 - పురుషులు 1,35,267 - స్త్రీలు 1,34,101
- అక్షరాస్యత (2011) - మొత్తం 67.18% - పురుషులు 77.68% - స్త్రీలు 56.46%
రవాణా సౌకర్యాలుసవరించు
కర్నూలు-కడప-చిత్తూరు పట్టణాలను కలిపే 18వ నంబరు జాతీయ రహదారి, కర్నూలు-చెన్నై, కర్నూలు-బెంగుళూరు స్టేట్ హైవేలు. కర్నూలు -నెల్లూరు లను కలిపే మరో ముఖ్యమైన రహదారి ఆళ్ళగడ్డ మీదుగా వెళ్తుంది. కర్నూలు వైపు నుండి నంద్యాల పట్టణములో ప్రవేశించేవారికి బొమ్మలసత్రం ముఖద్వారం. బొమ్మల సత్రము పక్కనే కుందు నది ప్రవహిస్తూ ఉంది. ప్రతి రోజూ నంద్యాల నుండి హైదరాబాద్ కు రాత్రి ప్రైవేటు రవాణా సంస్థలు బస్సులను నడుపుతాయి.
భువనేశ్వర్-బెంగుళూరు మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్ ప్రెస్, అమరావతి ఎక్స్ ప్రెస్ రైళ్ళు నంద్యాల మీదుగా ప్రయాణిస్తాయి. నంద్యాల పట్టణములో కూడళ్ళలో గాంధీచౌకు, నూనెపళ్ళి, బొమ్మలసత్రం ముఖ్యమైనవి.
నంద్యాలకు సమీపమైన అంతర్జాతీయ విమానాశ్రయం రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయం ఇది 270 కిలోమిటర్ల దూరములో ఉన్న హైదరాబాదులో ఉంది.
విద్యా సంస్థలుసవరించు
- ప్రభుత్వ వ్యవసాయ కళాశాల, మహానంది
- రాజీవ్ గాంధీ స్మారక వైజ్ఞానిక సంస్థ, నంద్యాల
- ఈ.యస్.సి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
- శాంతిరాం మెడికల్ కళాశాల
వ్యవసాయంసవరించు
ఇక్కడ వ్యవసాయమే ప్రధాన వృత్తి, ఆదాయ వనరు. ఎక్కువ భాగం వ్యవసాయం వర్షాధారితమే అయినా కె.సి.కెనాల్, తెలుగుగంగ కింద చాలా ప్రాంతం సాగుబడికి వస్తుంది. వీటి పరీవాహక ప్రాంతాల్లో వరి పండిస్తారు. ఇవి కాకుండా వెలుగోడు ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు, కింద చాలా ప్రాంతం సాగుబడికి వస్తుంది. ఈ ప్రాంతంలో పండించే పంటలలో ముఖ్యమైనవి పత్తి, చెఱకు, పొగాకు, పసుపు, వరి, శనగ, జొన్నలు, కూరగాయలు.
పరిశ్రమలుసవరించు
నంద్యాల పట్టణం మండలంలోని గ్రామాలకు, దగ్గరలో గల పలు మండలాలకు వాణిజ్య, వర్తక కేంద్రం. చక్కెర కర్మాగారం, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, గెలివి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చెప్పుకోదగిన వ్యాపార సంస్థలు. పత్తి జిన్నింగ్ ఇక్కడ మరొక ప్రధాన వృత్తి, 100 కు మించి జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి
పర్యాటక ఆకర్షణలుసవరించు
- పుణ్య క్షేత్రాలు - అహొబిలం, యాగంటి, బెలూం గుహలు, మహానంది
ప్రముఖులుసవరించు
- ఎస్.పి.వై.రెడ్డి (మాజీ ఎంపీ)
- భూమా నాగిరెడ్డి (మాజీ ఎంఎల్యే)
- భూమా శోభా నాగిరెడ్డి
- బొజ్జా వెంకటరెడ్డి (మాజీ ఎంపీ)
- గంగుల ప్రతాప రెడ్డి (మాజీ ఎంపీ)
- శిల్పా మోహన రెడ్డ్ రెడ్డి మాజీ ఎంఎల్యే)
- మహామ్మద్ ఎన్ ఫరూక్ (మాజీ మంత్రి)
- రామనాథ రెడ్డి (మాజీ ఎంఎల్యే)
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ "Basic Information of Municipality". Municipal Administration & Urban Development Department. Government of Telangana. Archived from the original on 14 October 2015. Retrieved 24 September 2015.
- ↑ "District Census Handbook – Kurnool" (PDF). Census of India. pp. 12–13, 38, 50. Retrieved 28 August 2015.