కోదారి శ్రీను

తెలంగాణ ఉద్యమ గీత రచయిత మరియు గాయకుడు

కోదారి శ్రీను తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యమ గీత రచయిత, గాయకుడు. అస్సోయ్ దూలా హారతి...కాళ్ల గజ్జెల గమ్మతి, ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ ఇల్లు పైలంజూడు తల్లి మాయమ్మ వంటి పాటలను రచించాడు.[1] ప్రస్తుతం తెలంగాణ జాగృతి రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్‌గా పనిచేస్తున్నాడు.[2]

కోదారి శ్రీను
జననంఆగష్టు 30, 1978
గంగాపురం, గుండాల మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
వృత్తితెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం
ప్రసిద్ధిఉద్యమగీత రచయిత, గాయకులు
భార్య / భర్తవిజయ లక్ష్మీ
పిల్లలుసాకేత్, యశశ్విని
తండ్రిచంద్రగిరి అంజయ్య గౌడ్
తల్లియాదమ్మ

జననం - విద్యాభ్యాసం మార్చు

శ్రీను 1978, ఆగష్టు 30న చంద్రగిరి అంజయ్య గౌడ్ , యాదమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలంలోని గంగాపురంలో జన్మించాడు.[3] 10వ తరగతి వరకు గుండాలలో చదివిన శ్రీను, మోత్కూరులో ఇంటర్ విద్యను, హైదరాబాదులో డిగ్రీ చదివాడు.

రచనా ప్రస్థానం మార్చు

చిన్న వయసునుండే ఉద్యమ పాటలను వింటూ పెరిగిన శ్రీను సాహిత్యంపై ఆసక్తిని పెంచుకున్నాడు. 1998 నుంచి పాటలు రాయడం ప్రారంభించిన శ్రీను, మలిదశ ఉద్యమంలో కీలకమైన పాటలు రాశాడు. 1999లో పైలం సీడీ ఆల్బమ్ లో వచ్చిన బొంబాయి వోతున్న అమ్మ మా యమ్మ పాట గీత రచయితగా నిలబెట్టింది. మొదట్లో తెలంగాణ తల్లి అస్తిత్వాన్ని తెలియజెప్పే కవిత్వం రాసిన శ్రీను, ఆ ఆస్తిత్వం నుంచి పోరు బాట పట్టిన విధానం కూడా రాశాడు. నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ గురించి ఇలా తెలంగాణలోని ప్రతి సమస్యను, ప్రతి అంశాన్ని తన పాటల్లో చొప్పించాడు.

తెలంగాణ పాటలోకి దళిత బహుజన మైనారిటీ పారిభాషికా పదాలను, వారి సాంస్కతిక చిహ్నాలను తెచ్చి పాటను పరిపుష్టం చేశాడు. తన కవిత్వం ద్వారా హిందూ ముస్లింల సమైక్య జీవనాన్ని, ఊరుమ్మడి సాంస్కతిక అస్తిత్వాన్ని బలంగా ముందుకు తెచ్చాడు.

పాటల జాబితా మార్చు

  1. అస్సోయ్ దూలా హారతి...కాళ్ల గజ్జెల గమ్మతి
  2. ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ ఇల్లు పైలంజూడు తల్లి మాయమ్మ
  3. ముద్దుల రాజాలో కొడుకా ఉత్తరమేస్తున్నో బిడ్డ ...సల్లగుండు రాజాలు నువ్ సక్కగుండు రాజాలు
  4. మస్కట్ పోయిన నాయి మామ తిరిగిరావో సేందురయ్య
  5. తెలంగాణ గడప గడప
  6. మా తెలంగాణ ధీరుడా
  7. తెలంగాణ కంటతడిలో
  8. అమరవీరులు మీరయ్య
  9. ఏడు గడిసేపాయే దినము గడిసిపాయే
  10. మాబిడ్డలేడున్నారయ్య... మీరు తెచిస్తారా లీడరయ్య..
  11. రాలిన మోదుగు పువ్వుల రాశులు మీరో...
  12. సూడు సూడు నల్ల గొండ ..గుండెనిండా ఫ్రొరైడ్ బండా...
  13. జమగుడి జాతరెల్లి పొందాం తెలంగాణా...
  14. స్వేచ్ఛ స్వతంత్ర్యంకై రణ రంగ సమరంలో....
  15. తెలంగాణా పోలీకేకల పోరు మల్లెషో....
  16. పల్లెలో పండుగలు ఎంతముద్దు గుండొ..

అవార్డులు మార్చు

  1. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం, 2017, జూన్ 2 కెసీఆర్ చేతులమీదుగా పురస్కారం అందుకున్నాడు.[4][5]

మూలాలు మార్చు

  1. నా తెలంగాణ పాట. "కోదారి శ్రీను". naatelanganapaata.blogspot.in. Archived from the original on 26 November 2017. Retrieved 8 January 2018.
  2. నమస్తే తెలంగాణ (14 August 2016). "తెలంగాణ జాగృతి రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్‌". Retrieved 8 January 2018.
  3. సాక్షి, జిల్లాలు (2 June 2017). "ఉద్యమ పాటకు గుర్తింపు". Sakshi. Archived from the original on 4 June 2017. Retrieved 25 September 2019.
  4. సాక్షి, తెలంగాణ (31 May 2017). "ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు". Sakshi. Archived from the original on 6 August 2017. Retrieved 27 September 2021.
  5. టీన్యూస్ (31 May 2017). "రాష్ట్ర ప్రభుత్వ పురస్కారానికి 52 మంది ఎంపిక". Retrieved 8 January 2018.[permanent dead link]