తెలంగాణ సాంస్కృతిక సారథి

తెలంగాణ సాంస్కృతిక సారథి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్ధ

తెలంగాణ సాంస్కృతిక సారథి
సంస్థ అవలోకనం
స్థాపనం సెప్టెంబర్ 30, 2014
అధికార పరిధి తెలంగాణ, భారతదేశం
ప్రధాన కార్యాలయం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
ఏజెన్సీ కార్యనిర్వాహకుడు/ రసమయి బాలకిషన్, ఛైర్మన్
మాతృ శాఖ తెలంగాణ ప్రభుత్వం
వెబ్‌సైటు
https://www.tssts.org/

స్థాపన మార్చు

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక కళాకారులకు గుర్తింపును ఉపాధిని కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అందులోభాగంగా 550 మంది కళాకారులతో తెలంగాణ సాంస్కృతిక సారథిని 2014 సెప్టెంబర్ 30న ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 550 మంది కళాకారులకు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది.వారిలో 319 మంది ఎస్సీలు, 38 మంది ఎస్టీలున్నారు. ఇందులో పనిచేసే కళాకారులకు ప్రభుత్వ ఖజానా ద్వారా జీతాలు అందజేయబడుతాయి.

బాధ్యతలు మార్చు

ఇందులోని కళాకారులు కళాబృందాలుగా ఏర్పడి సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కళా ప్రదర్శనలకు అనువైన శిక్షణనివ్వడానికి, వర్క్ షాపులు నిర్వహించడానికి సాంస్కృతిక సారథి సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్నది. సాంస్కృతిక సారథికి క్యాబినెట్ హోదా కల్పించారు.ప్రజాహిత కార్యక్రమాలను అట్టడుగుస్థాయి వరకు, గ్రామ గ్రామానికి చేరవేసేలా ఈ పథకం పనిచేస్తున్నది.

ఛైర్మన్ మార్చు

తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా మానకొండూర్ ఎమ్మెల్యే, ప్రముఖ కళాకారుడు ఏర్పుల (రసమయి) బాలకిషన్ ను ప్రభుత్వం నియమించింది. రసమయి బాలకిషన్‌ను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా నియమిస్తూ 13 జులై 2021న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]ఆయన హైదరాబాద్‌లోని సాంస్కృతిక సారథిభవన్‌లో 19 జులై 2021న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.[2]

 
తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యాలయం

కార్యాలయం మార్చు

జూబ్లిహిల్స్ లోని సాంస్కృతిక శాఖ భవనాన్ని తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యక్రమాల నిర్వహణకు వినియోగిస్తున్నారు.

సాంస్కృతిక సారథి కళాకారులు మార్చు

మూలాలు మార్చు

 1. Sakshi (13 July 2021). "మరో మూడేళ్లు సాంస్కృతిక సారథిగా రసమయి". Sakshi. Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
 2. T News (19 July 2021). "సాంస్కృతిక సార‌థి చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ర‌స‌మ‌యి - TNews Telugu". Archived from the original on 19 July 2021. Retrieved 20 July 2021.
 3. Namasthe Telangana (26 August 2021). "ఒడ్డుమీదా రేడియవెట్టి.. గడ్డిగోస్తే గమ్మతిరెడ్డి!". Archived from the original on 28 August 2021. Retrieved 28 August 2021.
 4. Namasthe Telangana, Zindagi (14 July 2021). "పోచారం పోరుపాట!". Archived from the original on 25 July 2021. Retrieved 25 July 2021.
 5. Namasthe Telangana, Zindagi (21 July 2021). "పూతపూత మావిళ్లు.. పూతా మావిళ్ల కింద." Archived from the original on 25 July 2021. Retrieved 25 July 2021.
 6. Namasthe Telangana, Zindagi (30 June 2021). "భువనగిరి ఖిల్లాపై.. సంధ్యా రాగం!". Archived from the original on 25 July 2021. Retrieved 25 July 2021.
 7. Namasthe Telangana (19 May 2021). "ప్రాణం పోసిన పాట!". Archived from the original on 25 July 2021. Retrieved 25 July 2021.
 8. Namasthe Telangana (17 March 2021). "నా కథే మారెరో రాములా!". Archived from the original on 25 July 2021. Retrieved 25 July 2021.
 9. Namasthe Telangana (15 September 2021). "Folk Singer Veena | పచ్చని సెట్టూమీద.. పతిరామ సిలకా!". Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.
 10. Namasthe Telangana (20 October 2021). "పల్లె పాటల.. హృదయ స్పందన!". Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.
 • నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనం [1]