కోరిపల్లి ముత్యంరెడ్డి
కోరిపల్లి ముత్యంరెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. 1957 నుండి 1962 వరకు నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2]
కోరిపల్లి ముత్యంరెడ్డి | |
---|---|
మాజీ శాసనసభ్యుడు (ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ) | |
In office మార్చి 1957 – ఫిబ్రవరి 1962 | |
నియోజకవర్గం | నిర్మల్ శాసనసభ నియోజకవర్గం |
తరువాత వారు | పి.నర్సారెడ్డి |
వ్యక్తిగత వివరాలు | |
జననం | నిర్మల్, నిర్మల్ జిల్లా, తెలంగాణ |
మరణం | 3 సెప్టెంబరు 1982 |
పౌరసత్వం | భారతదేశం |
రాజకీయ పార్టీ | స్వతంత్ర |
నైపుణ్యం | రాజకీయ నాయకుడు |
జననం
మార్చుముత్యంరెడ్డి నిర్మల్ జిల్లా, నిర్మల్ పట్టణంలో జన్మించాడు.
రాజకీయ జీవితం
మార్చుముత్యంరెడ్డి 1957-1962 మధ్యకాలంలో నిర్మల్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ముత్యంరెడ్డి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్. దేశ్ పాండేపై 734 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[3]
నియోజకవర్గ సంఖ్య | అసెంబ్లీ నియోజకవర్గం పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|
44 | నిర్మల్ | జనరల్ | కోరిపల్లి ముత్యంరెడ్డి | స్వతంత్ర | 9493 | ఆర్.దేశ్‌పాండే | భారత జాతీయ కాంగ్రెస్ | 8700 |
మరణం
మార్చుముత్యంరెడ్డి 1982, సెప్టెంబరు 3న మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ "Election Results 1957" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved February 24, 2015.
- ↑ "🗳️ Muthiam Reddy winner in Nirmal, Andhra Pradesh Assembly Elections 1957". LatestLY (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-24. Retrieved 2022-02-24.
- ↑ "Nirmal Election Result 2018 Live Updates: Candidate List, Winner, Runner-up MLA List". Elections in India. Archived from the original on 2021-01-15. Retrieved 2022-02-24.