ప్రధాన మెనూను తెరువు

చత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని 27 జిల్లాలలో కోర్బా జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా కోర్బాపట్టణం ఉంది.

Korba జిల్లా

कोरबा जिला
Chhatisgarh లో Korba జిల్లా స్థానము
Chhatisgarh లో Korba జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంChhatisgarh
ముఖ్య పట్టణంKorba, Chhattisgarh
విస్తీర్ణం
 • మొత్తం6 కి.మీ2 (2,548 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం12,06,640
 • సాంద్రత180/కి.మీ2 (470/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత84.36 per cent
జాలస్థలిఅధికారిక జాలస్థలి

భౌగోళికంసవరించు

కోర్బా జిల్లా రాష్ట్రంలోని ఉత్తర రాతినేలలలో ఉంటుంది. జిల్లాలో అత్యధిక ప్రాంతం సాత్పురా కొండలలోని మైకల్ పర్వతశ్రేణులలోని పీఠభూములలో ఉంది. జిల్లాలో ఎగువ, దిగువ మరియు బహిరంగ మైదానాలు అధికంగా ఉన్నాయి. బహిరంగ మైదానాలలో అతి పెద్ద ప్రాంతం పాసన్ సమీపంలో ఉంది. హాస్డియో నది 3 ఉపనదులతో ( గజెచొరై, టాన్ మరియు అహిరం) జిల్లాలో ప్రవహిస్తుంది. నదీతీరాలలో అక్కడక్కడా అరణ్యాలు ఉన్నాయి. పర్వతాలలో ప్రధానమైనది కరేలా కొండలు ఎత్తు సముద్రమట్టానికి 3253 మీ. కత్ఘోరా ఉత్తరంలో హస్డియో మరియు గాజ్ లోయలు క్రమంగా ఉత్తరాన ఉన్న సుర్గుజా జిల్లాలో కలుస్తుంది. టాన్ మరియు చొరై నదులు తూర్పు మరియు పడమరలుగా ఎదురెదురు దిశలలో హస్డియో నదితో సంగమిస్తున్నాయి. ఉత్తర నదీతీరంలో గురుద్వారీ కొండలు, జంటా కొండలు, మాతిన్ కొండలు మరియు ఢజగ్ కొండలు ఉన్నాయి. జిల్లాలో కోర్బా జిల్లాలో గెవ్రా ప్రాంతం (ఆసియాలో ఇది అతిపెద్ద బొగ్గుగని), కుస్ముండ ప్రాంతం మరియు దిప్క ప్రాంతంలో బొగ్గుగనులు ఉన్నాయి. ఎన్.టి.పి.సి, సి.ఎస్.ఇ.బి ఈస్ట్-వెస్ట్ మరియు బాల్కో అల్యూమినియం ప్లాంట్లు కూడా ఈ జిల్లాలో ఉన్నాయి.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,206,563,[1]
ఇది దాదాపు. బహరియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. న్యూ హాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 395వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 183 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.25%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 971:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 73.22%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Bahrain 1,214,705 July 2011 est. line feed character in |quote= at position 8 (help); Cite web requires |website= (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470 line feed character in |quote= at position 14 (help); Cite web requires |website= (help)

వెలుపలి లింకులుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కోర్బా&oldid=1971239" నుండి వెలికితీశారు