అంబికాపూర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుర్గుజా జిల్లా లోని నగరం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఇది రాష్ట్రంలోని పురాతన నగరాలలో ఒకటి. అంబికాపూర్ సుర్గుజా, కొరియా, బలరాంపూర్, సూరజ్‌పూర్, జాష్‌పూర్ జిల్లాలతో కూడిన సర్గుజా డివిజన్‌కు ప్రధాన కార్యాలయం.

అంబికాపూర్
అంబికాపూర్ is located in Chhattisgarh
అంబికాపూర్
అంబికాపూర్
చత్తీస్‌గఢ్ పటంలో నగర స్థానం
Coordinates: 23°07′N 83°12′E / 23.12°N 83.2°E / 23.12; 83.2
దేశం India
రాష్ట్రంచత్తీస్‌గడ్ః
జిల్లాసుర్గూజా
Named forMahamaya Temple
విస్తీర్ణం
 • నగరం35.36 కి.మీ2 (13.65 చ. మై)
Elevation
623 మీ (2,044 అ.)
జనాభా
 (2011)[1]
 • నగరం1,14,575
 • Rank8 (ఛత్తీస్‌గఢ్‌లో) • 192 (దేశంలో)
 • జనసాంద్రత3,200/కి.మీ2 (8,400/చ. మై.)
 • Metro3,43,173
భాషలు
 • అధికారికహిందీ ఛత్తీస్‌గఢీ
Time zoneUTC+5:30 (IST)
PIN
497001
ప్రాంతపు కోడ్7774
Vehicle registrationCG-15

భారత స్వాతంత్ర్యానికి ముందు అంబికాపూర్ సుర్గుజా సంస్థానానికి రాజధానిగా ఉండేది. [3]  నగరానికి ఈ పేరు హిందూ దేవత అంబిక (మహామాయ) దేవి నుండి వచ్చింది. [4] అంబికాపూర్ మునిసిపల్ కార్పొరేషను 35.360 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. [5]

2019 స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రకారం, అంబికాపూర్ భారతదేశంలో రెండవ పరిశుభ్రమైన నగరం. [6] 2020 స్వచ్ఛ సర్వేక్షణ్ నాటికి, అంబికాపూర్ ఛత్తీస్‌గఢ్‌లో కెల్లా అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందింది. అలాగే భారతదేశంలో 10 లక్షల లోపు జనాభా కలిగిన నగరాలలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. [7]

భౌగోళికం

మార్చు

అంబికపూర్ 23°12′N 83°2′E / 23.200°N 83.033°E / 23.200; 83.033 నిర్దేశాంకాల వద్ద ఉంది. [8] ఇది సముద్రమట్టంనుండి సగటున 623 మీటర్ల ఎత్తున ఉంది.

శీతోష్ణస్థితి

మార్చు
శీతోష్ణస్థితి డేటా - Ambikapur, Chhattisgarh (1981–2010, extremes 1951–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 30.5
(86.9)
34.8
(94.6)
39.7
(103.5)
43.8
(110.8)
44.8
(112.6)
44.9
(112.8)
38.4
(101.1)
36.1
(97.0)
35.7
(96.3)
34.5
(94.1)
32.4
(90.3)
29.5
(85.1)
44.9
(112.8)
సగటు అధిక °C (°F) 23.2
(73.8)
26.7
(80.1)
32.2
(90.0)
37.3
(99.1)
39.4
(102.9)
35.5
(95.9)
29.8
(85.6)
29.4
(84.9)
29.8
(85.6)
29.3
(84.7)
26.2
(79.2)
23.5
(74.3)
30.2
(86.4)
సగటు అల్ప °C (°F) 9.1
(48.4)
11.8
(53.2)
16.1
(61.0)
21.2
(70.2)
24.8
(76.6)
24.8
(76.6)
23.2
(73.8)
23.0
(73.4)
22.2
(72.0)
18.1
(64.6)
12.9
(55.2)
9.0
(48.2)
18.0
(64.4)
అత్యల్ప రికార్డు °C (°F) 0.9
(33.6)
2.5
(36.5)
7.8
(46.0)
10.6
(51.1)
16.1
(61.0)
17.2
(63.0)
16.4
(61.5)
19.8
(67.6)
15.7
(60.3)
9.4
(48.9)
4.2
(39.6)
1.7
(35.1)
0.9
(33.6)
సగటు వర్షపాతం mm (inches) 25.8
(1.02)
20.1
(0.79)
19.5
(0.77)
13.6
(0.54)
21.3
(0.84)
235.0
(9.25)
411.2
(16.19)
352.2
(13.87)
227.0
(8.94)
48.4
(1.91)
14.0
(0.55)
11.2
(0.44)
1,399.2
(55.09)
సగటు వర్షపాతపు రోజులు 2.1 1.9 1.8 1.3 2.6 10.0 17.5 15.7 11.2 3.4 1.0 0.8 69.4
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 50 40 29 23 28 55 81 83 79 64 57 54 54
Source: India Meteorological Department[9][10]

జనాభా వివరాలు

మార్చు

2011 జనగణన ప్రకారం, అంబికాపూర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో జనాభా 2,64,575. పట్టణ సముదాయంలో జనాభా 3,43,173. పట్టణంలో 1,000 మంది పురుషులకు 920 మంది స్త్రీలు ఉన్నారు. జనాభాలో 11.3% మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు. అక్షరాస్యత 88.20%. పురుషుల అక్షరాస్యత 92.73% కాగా, స్త్రీల అక్షరాస్యత 83.29%.,

అంబికాపూర్‌లో భారతదేశపు అన్నిఒప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు నివసిస్తున్నారు. మితమైన వాతావరణం వలన ఇది ఆకర్షణీయమైన ప్రదేశంగా మారింది.

1959 లో టిబెట్‌ను చైనా స్వాధీనం చేసుకున్న తర్వాత, గణనీయమైన సంఖ్యలో టిబెటన్ వలసదారులు అంబికాపూర్‌లో తలదాచుకున్నారు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ నగరానికి విద్యుత్ సరఫరా చేస్తుంది. [11] అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నగరానికి రోజుకు 1.06 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తుంది.[12] తాగునీరు మొదట్లో బంకీ డ్యామ్ నుండి తీసుకునేవారు. కానీ అమృత్ పథకం కింద కట్కలో పైప్‌లైన్ విస్తరణ, ఆటోమేటిక్ ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణం జరగడంతో, 2020 లో నవగఢ్‌లోని ఘుగుట్ట ఆనకట్ట నుండి కూడా తీసుకుంటున్నారు. [13] ఇందుకోసం నగరంలో మొత్తం 16 జలాశయాలున్నాయి. [13]

నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణ విషయంలో మునిసిపల్ కార్పొరేషన్ బాధ్యత వహిస్తుంది. [14] అంబికాపూర్ ప్రతిరోజూ 45 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది, వీటిలో 90% వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ చేస్తుంది. [15] [16] 48 వార్డులలో 447 స్వయం సహాయక సమూహాల మహిళలు ఇంటింటికీ వెళ్ళి చెత్తను సేకరిస్తారు. [14] నగరంలో గృహ స్థాయిలో వ్యర్థాలను వేరు చేసే పని 100% సాధించింది. [17] నగరంలో చెత్తను పారవేసేందుకు డంపుయార్డుల్లేవు. గతంలో చెత్త వేసే పల్లపు ప్రాంతాన్ని 2016 లో 15-ఎకరాల ఉద్యానవనంగా మార్చినప్పటి నుండి జీరో-వేస్ట్ నగరంగా పేరుపొందింది. [15] మున్సిపల్ ఘన వ్యర్థాలను పారవేయడం కోసం అంబికాపూర్ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (SLRM) పద్ధతిని అమలు చేసింది. [18] నగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మరుగుదొడ్లకు వేటికి వాటికే సెప్టిక్ ట్యాంకులున్నాయి. [19]

రవాణా

మార్చు
 
అంబికపూర్ రైల్వే స్టేషన్ ఫ్రంట్

అంబికాపూర్ నుండి మధ్యప్రదేశ్ సరిహద్దు పట్టణమైన అనుపూర్ రైల్వే జంక్షన్‌కు బ్రాడ్ గేజ్ రైలు మార్గం ఉంది. కాట్ని, సత్నా, జబల్‌పూర్, దుర్గ్, భోపాల్, రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ నుండి అంబికాపూర్‌కు రైళ్ళు నడుస్తున్నాయి. న్యూఢిల్లీ వంటి ఇతర గమ్యస్థానాలకు అనుపూర్ రైల్వే జంక్షన్ నుండి చేరుకోవచ్చు.

రోడ్లు

మార్చు

అంబికాపూర్ నుండి ఛత్తీస్‌గఢ్‌లోని ఇతర ప్రధాన నగరాలైన రాయపూర్, బిలాస్‌పూర్, దుర్గ్, భిలాయ్, కోర్బా, రాయ్‌ఘర్‌లకు చక్కటి రోడ్డు సౌకర్యం ఉంది. యూపీలోని వారణాసి, రేణుకూట్ (170కిమీ) లకూ, రాయపూర్ (345కిమీ), జార్ఖండ్‌లోని గర్హ్వా (160కిమీ) లకూ రోజువారీ బస్సు సర్వీసులు నడుస్తాయి. అనుపూర్ నుండి అంబికాపూర్ వరకు బస్ సర్వీసులు మనేంద్రగఢ్, సూరజ్‌పూర్ మీదుగా నడుస్తాయి.

వైమానిక

మార్చు

అంబికాపూర్ విమానాశ్రయం నగరం నుండి దక్షిణంగా 12 కి.మీ. దూరంలో దరిమా వద్ద ఉంది. ఈ ఎయిర్ స్ట్రిప్ ఎక్కువగా చిన్న విమానాలకు, హెలికాప్టర్లకూ ఉపయోగిస్తారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు ఇక్కడినుండి షెడ్యూల్డ్ విమానాలుంటాయి. [20]

రాయల్ ప్యాలెస్

మార్చు

సర్గుజా ప్యాలెస్ అంబికాపూర్‌లో ఉన్న రాజభవనం. దీన్ని రఘునాథ్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఇది తెల్లని, రెండు అంతస్థుల రాజభవనం. సుర్గుజా ప్యాలెస్ పట్టణ, గ్రామీణ ప్రజలకు అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ రాజభవనాన్ని ప్రతి సంవత్సరం దసరా రోజున మాత్రమే ప్రజల కోసం తెరిచి ఉంచుతారు. సుర్గుజా రాజ కుటుంబ వారసుడు దసరా రోజున సందర్శకులను కలుసుకుని పలకరించడం పాత సంప్రదాయం.

మూలాలు

మార్చు
  1. "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 27 March 2012.
  2. "Provisional Population Totals, Census of India 2011; Urban Agglomerations/Cities having population 3 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 27 March 2012.
  3. "Surguja State - Wikipedia". en.m.wikipedia.org (in ఇంగ్లీష్). Retrieved 2020-08-20.
  4. "Surguja". Archived from the original on 7 January 2013. Retrieved 28 January 2013.
  5. "Brickwork Ratings withdraws issuer ratings of Ambikapur Municipal Corporation" (PDF). Brickwork Ratings. Retrieved 9 December 2020.
  6. "Swacch Ambikapur Executive Summary" (PDF). Raipur Nagar Nigam. Retrieved 9 December 2020.[permanent dead link]
  7. "1 से 10 लाख तक जनसंख्या वाले शहर में अपना अंबिकापुर स्वच्छता सर्वेक्षण में फिर नंबर-1". Patrika News (in హిందీ). Retrieved 2020-09-15.
  8. Falling Rain Genomics, Inc – Ambikapur
  9. "Station: Ambikapur Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 37–38. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 19 February 2020.
  10. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M39. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 19 February 2020.
  11. "Chhattisgarh State Power Distribution Company Limited". Archived from the original on 16 సెప్టెంబరు 2021. Retrieved 18 September 2020.
  12. "STATUS OF WATER SUPPLY, WASTEWATER GENERATION AND TREATMENT IN CLASS-I CITIES & CLASS-II TOWNS OF INDIA" (PDF). 2017-11-04. Archived from the original (PDF) on 4 November 2017. Retrieved 2020-12-09.
  13. 13.0 13.1 "मिशन अमृत से शहर के इस इलाके की 3 हजार आबादी को मिलने लगा पानी, 1 माह में पूरे शहर को होगी सप्लाई". Patrika News (in హిందీ). Retrieved 2020-09-18.
  14. 14.0 14.1 "Waste away, Ambikapur shows way | India Water Portal". www.indiawaterportal.org. Retrieved 2020-12-09.
  15. 15.0 15.1 "Smart Cities Council India | This small town in Chhattisgarh leads the way in waste management". india.smartcitiescouncil.com. Archived from the original on 2021-09-16. Retrieved 2020-09-18.
  16. "How Chhattisgarh's Ambikapur Is Turning Its Trash Into Treasure | Features". NDTV-Dettol Banega Swasth Swachh India (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-05-16. Retrieved 2020-09-18.
  17. "Swachh Survekshan 2020: Chhattisgarh Awarded As India's Cleanest State, Here's What It Did Right | News". NDTV-Dettol Banega Swasth Swachh India (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-08-20. Retrieved 2020-12-09.
  18. "Swachh Bharat Mission: We may be ODF, but not garbage free". www.downtoearth.org.in (in ఇంగ్లీష్). Retrieved 2020-12-09.
  19. "MUNICIPAL CORPORATION, AMBIKAPUR, SURGUJA (C.G.)" (PDF). webcache.googleusercontent.com. Archived from the original (PDF) on 2017-03-21. Retrieved 2020-12-09.
  20. "NRW ASSESSMENT AND REDUCTION STRATEGY FOR AMBIKAPUR, INCEPTION REPORT" (PDF). Nagar Nigam Ambikapur. Archived from the original (PDF) on 2021-09-16. Retrieved 2021-09-16.