కోలిన్ కౌడ్రీ (Colin Cowdrey) ఇంగ్లాండుకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. 1954 నుంచి 1975 వరకు ఇంగ్లాండు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కౌడ్రీ 114 టెస్టులు, ఒక వన్డే ఆడాడు. 692 ఫస్ట్ క్లాస్ క్రికెట్ పోటిలు ఆడి 107 సెంచరీలతో 42,719 పరుగులు చేశాడు. తన క్రీడాజీవిత కాలంలో 6 సార్లు ఆస్ట్రేలియా పర్యటించి ఆ ఘనత సాధించిన రెండో ఇంగ్లాండు క్రికెటర్‌గా అవతరించాడు.[1] 1932, డిసెంబరు 24న భారత్ లోని ఉదగమండలంలో జన్మించిన కౌడ్రీ, 67 సంవత్సరాల వయస్సులో 2000, డిసెంబర్ 4న గుండెపోటుతో ఇంగ్లాండులో మరణించాడు.

కోలిన్ కౌడ్రీ
1980 లో ఓవల్‌లో కోలిన్ కౌడ్రీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మైకెల్ కోలిన్ కౌడ్రీ, బారన్ కౌడ్రీ ఆఫ్ టన్‌బ్రిడ్జ్
పుట్టిన తేదీ(1932-12-24)1932 డిసెంబరు 24
ఉదకమండలం, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిషు భారతదేసం
మరణించిన తేదీ2000 డిసెంబరు 4(2000-12-04) (వయసు 67)
లిటిల్‌హ్యాంఫ్టన్, వెస్ట్ ససెక్స్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం లెగ్ స్పిన్
పాత్రటాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 379)1954 నవంబరు 26 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1975 ఫిబ్రవరి 13 - ఆస్ట్రేలియా తో
ఏకైక వన్‌డే (క్యాప్ 2)1971 జనవరి 5 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1950–1976కెంట్ కౌంటీ క్రికెట్ క్లబ్
1952–1975మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎమ్‌సిసి)
1952–1954ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ క్రికెట్ క్లబ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 114 1 692 87
చేసిన పరుగులు 7624 1 42719 1978
బ్యాటింగు సగటు 44.06 1.00 42.89 29.52
100లు/50లు 22/38 0/0 107/231 3/12
అత్యుత్తమ స్కోరు 182 1 307 116
వేసిన బంతులు 119 4876 59
వికెట్లు 0 65 3
బౌలింగు సగటు 51.21 14.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగు 4/22 1/0
క్యాచ్‌లు/స్టంపింగులు 120/– 0/– 638/– 38/–
మూలం: Cricinfo, 2000 డిసెంబరు 4

టెస్ట్ క్రికెట్ గణాంకాలు మార్చు

1954 నవంబర్లో తొలిసారిగా ఆస్ట్రేలియాపై టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేసిన కోలిన్ కౌడ్రీ, 1975 ఫిబ్రవరి వరకు 114 టెస్టులు ఆడి 44.06 సగటుతో 7,624 పరుగులు చేశాడు. అందులో 22 సెంచరీలు, 38 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 182 పరుగులు. ఫీల్డర్‌గా 120 క్యాచ్‌లు పట్టుకున్నాడు.

వన్డే క్రికెట్ గణాంకాలు మార్చు

కౌడ్రీ తన క్రీడాజీవిత కాలంలో ఒకే ఒక్క వన్డే పోటీ ఆడాడు. 1971, జనవరి 5 న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు చేశాడు.

ఫస్ట్ క్లాస్ పోటీలు మార్చు

692 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కోలిన్ కౌడ్రీ 42.89 సగటుతో 42,719 పరుగులు చేశాడు. అందులో 107 సెంచరీలు, 231 అర్థసెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో అతని అత్యధిక స్కోరు 307 పరుగులు. ఫస్ట్ క్లాస్‌లో 65 వికెట్లను కూడా సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 22 పరుగులకు 4 వికెట్లు.

అవార్డులు, గుర్తింపులు మార్చు

  • 1972: CBE అవార్డు లభించింది.
  • 1992: నైట్‌హుడ్ అవార్డు లభించింది.
  • 1997: బ్రిటన్ పెద్దల సభకు (హౌస్ ఆఫ్ లార్డ్స్) నియమించబడ్డాడు.

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. http://content-uk.cricinfo.com/wisdenalmanack/content/story/154334.html Cricinfo