కోలిన్ బ్లాండ్

రోడేసియన్ మాజీ క్రికెటర్

కెన్నెత్ కోలిన్ బ్లాండ్ (1938, ఏప్రిల్ 5 – 2018, ఏప్రిల్ 14) రోడేసియన్ మాజీ క్రికెటర్. 1960లలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[1] టెస్ట్ క్రికెట్ చరిత్రలో గొప్ప ఫీల్డర్‌లలో ఒకరిగా పరిగణించబడ్డాడు.[2]

కెన్నెత్ బ్లాండ్
దస్త్రం:Colin Bland of South Africa.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కెన్నెత్ కోలిన్ బ్లాండ్
పుట్టిన తేదీ(1938-04-05)1938 ఏప్రిల్ 5
బులవాయో, సదరన్ రోడేషియా
మరణించిన తేదీ2018 ఏప్రిల్ 14(2018-04-14) (వయసు 80)
లండన్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1961 8 December - New Zealand తో
చివరి టెస్టు1966 23 December - Australia తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 21 131
చేసిన పరుగులు 1,669 7,249
బ్యాటింగు సగటు 49.08 37.95
100లు/50లు 3/9 13/34
అత్యధిక స్కోరు 144* 197
వేసిన బంతులు 394 3,508
వికెట్లు 2 43
బౌలింగు సగటు 62.50 35.27
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/16 4/40
క్యాచ్‌లు/స్టంపింగులు 10/– 51/–
మూలం: CricInfo, 2020 3 December

క్రికెట్ కెరీర్

మార్చు

కోలిన్ బ్లాండ్ బులవాయోలోని మిల్టన్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. 1956-57లో పీటర్ మే టీమ్‌పై స్కూల్‌బాయ్‌గా రోడేషియా కోసం ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. 1956 నుండి 1968 వరకు 55 సార్లు వారికి ప్రాతినిధ్యం వహించాడు.[3] తరువాత దక్షిణాఫ్రికా ప్రావిన్షియల్ జట్ల కోసం ఈస్టర్న్ ప్రావిన్స్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్ కోసం ఆడాడు.[4]

కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా రాణించాడు. బ్లాండ్ 1961లో దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టులోకి ప్రవేశించాడు. 1966-67 వరకు సాధారణ ఆటగాడిగా ఉన్నాడు. వర్ణవివక్ష యుగంలో దక్షిణాఫ్రికా కేవలం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో మాత్రమే టెస్ట్ క్రికెట్ ఆడింది, ఇతని కెరీర్ కేవలం 21 టెస్టులకే పరిమితమైంది, అందులో మూడు సెంచరీలతో సహా 1,669 పరుగులు చేశాడు. 1964-65లో జోహన్నెస్‌బర్గ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో 144 పరుగుల అత్యధిక టెస్ట్ స్కోరు చేశాడు.[5]

1966-67లో మొదటి టెస్ట్ తర్వాత గాయం కారణంగా జట్టు నుండి తప్పించిన తర్వాత బ్లాండ్ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. 1973-74 సీజన్ వరకు దక్షిణాఫ్రికాలో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడటం కొనసాగించాడు.

బ్లాండ్ పెద్దప్రేగు క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత 2018, ఏప్రిల్ 14న లండన్‌లోని తన ఇంటిలో మరణించాడు.[6]

మూలాలు

మార్చు
  1. "Former SA allrounder Colin Bland dies aged 80". ESPN Cricinfo. Retrieved 16 April 2018.
  2. "Tony's Trini heroics". ESPN Cricinfo. 31 March 2008. Retrieved 9 April 2019.
  3. Glen Byrom, ed. (1980), Rhodesian Sports Profiles 1907–1979, Bulawayo: Books of Zimbabwe, pp. 55–59.
  4. "Colin Bland". www.cricketarchive.com. Retrieved 2010-01-24.
  5. Wisden 1966, p. 807.
  6. "South Africa cricket hero Colin Bland passes away, aged 80". Cricbuzz. 16 April 2018. Retrieved 23 May 2018.

బాహ్య లింకులు

మార్చు