ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు

(Australia క్రికెట్ జట్టు నుండి దారిమార్పు చెందింది)


ఆస్ట్రేలియా పురుషుల జాతీయ క్రికెట్ జట్టు పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో, ఇంగ్లాండుతో కలిసి ఇది అయ్తంత పురాతన జట్టు. 1877లో ఇంగ్లాండుతో మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది.[9] ఆస్ట్రేలియా జట్టు వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే), ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (టి20) క్రికెట్‌ కూడా ఆడుతుంది. 1970-71 సీజన్‌లో ఇంగ్లాండ్తో జరిగిన మొట్టమొదటి వన్‌డే లోను, [10] 2004-05 సీజన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మొట్టమొదటి టి20 లోనూ ఆడి [11] ఆ రెంటినీ గెలుచుకుంది. ఆస్ట్రేలియా దేశీయ పోటీలు - షెఫీల్డ్ షీల్డ్, ఆస్ట్రేలియన్ దేశీయ పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్, బిగ్ బాష్ లీగ్‌లలో ఆడే జట్ల నుండి ఆటగాళ్లను తీసుకుంటుంది.

ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియన్ క్రికెట్ కోట్ ఆఫ్ ఆర్మ్స్
అసోసియేషన్క్రికెట్ ఆస్ట్రేలియా
వ్యక్తిగత సమాచారం
టెస్టు కెప్టెన్పాట్ కమిన్స్
ఒన్ డే కెప్టెన్పాట్ కమిన్స్
Tట్వంటీ I కెప్టెన్మాథ్యూ వాడే (మధ్యంతర)
కోచ్ఆండ్రూ మెక్‌డొనాల్డ్
చరిత్ర
టెస్టు హోదా పొందినది1877
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
ICC హోదాపూర్తి సభ్యుడు (1909)
ICC ప్రాంతంతూర్పు ఆసియా-పసిఫిక్
ఐసిసి ర్యాంకులు ప్రస్తుత[2] అత్యుత్తమ
టెస్టులు 2వ 1వ (1 January 1952)
వన్‌డే 2వ 1వ (1 January 1990)
టి20ఐ 4వ 1వ (1 May 2020)[1]
టెస్టులు
మొదటి టెస్టుv.  ఇంగ్లాండు at the Melbourne Cricket Ground, Melbourne; 15–19 March 1877
చివరి టెస్టుv.  ఇంగ్లాండు at The Oval, London; 27–31 July 2023
టెస్టులు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[3] 859 408/231
(218 డ్రాలు, 2 టైలు)
ఈ ఏడు[4] 11 4/4
(3 డ్రాలు)
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో పోటీ2 (first in 2019–2021)
అత్యుత్తమ ఫలితంఛాంపియన్స్ (2021–2023)
వన్‌డేలు
తొలి వన్‌డేv.  ఇంగ్లాండు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్; 5 జనవరి 1971
చివరి వన్‌డేv.  భారతదేశం నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్; 19 నవంబర్ 2023
వన్‌డేలు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[5] 997 606/348
(9 ties, 34 no results)
ఈ ఏడు[6] 22 14/8
(0 ties, 0 no results)
పాల్గొన్న ప్రపంచ కప్‌లు13 (first in 1975)
అత్యుత్తమ ఫలితం ఛాంపియన్స్ (1987, 1999, 2003, 2007, 2015, 2023)
ట్వంటీ20లు
తొలి టి20ఐv.  న్యూజీలాండ్ ఈడెన్ పార్క్, ఆక్లాండ్ వద్ద; 17 ఫిబ్రవరి 2005
చివరి టి20ఐv.  దక్షిణాఫ్రికా కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్; 3 సెప్టెంబర్ 2023
టి20ఐలు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[7] 177 94/76
(3 టైలు, 4 ఫలితం తేలలేదు)
ఈ ఏడు[8] 3 3/0
(0 టైలు, 0 ఫలితం తేలలేదు)
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ7 (first in 2007)
అత్యుత్తమ ఫలితం ఛాంపియన్స్ (2021)

Test kit

ODI kit

T20I kit

As of 19 November 2023

జాతీయ జట్టు 858 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 408 గెలిచి, 230 లలో ఓడిపోయింది. 218 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.[12] 2022 మే నాటికి ఆస్ట్రేలియా ఐసిసి టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 128 రేటింగ్ పాయింట్‌లతో మొదటి స్థానంలో ఉంది.[13] మొత్తం విజయాలు, గెలుపోటముల నిష్పత్తి, విజయాల శాతం పరంగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్టు.

టెస్ట్ పోటీలలో యాషెస్ (ఇంగ్లండ్‌తో), బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (భారత్‌తో), ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీ (వెస్టిండీస్‌తో), ట్రాన్స్-టాస్మాన్ ట్రోఫీ (న్యూజిలాండ్‌తో), దక్షిణాఫ్రికాతో ఉన్నాయి.

జట్టు 978 వన్‌డే మ్యాచ్‌లు ఆడి, 594 గెలిచి, 341 మ్యాచిల్లో ఓడిపోయింది, 9 టై అయ్యాయి, 34 ఫలితం లేకుండా ముగిసాయి.[14] 2002 మే నాటికి ఆస్ట్రేలియా, ఐసిసి వన్‌డే ఛాంపియన్‌షిప్‌లో 107 రేటింగ్ పాయింట్‌లతో మూడవ స్థానంలో ఉంది.[15] అయితే 2002లో ప్రవేశపెట్టినప్పటి నుండి 185 నెలలకు గాను, 141 నెలల్లో మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా వన్‌డే క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు - ఆడిన మ్యాచ్‌లలో 60 శాతానికి పైగా గెలిచింది.[14] ఏడు ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లు (1975, 1987, 1996, 1999, 2003, 2007, 2015) ఆడి, ఐదు సార్లు గెలిచింది: 1987, 1999, 2003, 2007, 2015. వరుసగా 3 ప్రపంచ కప్‌లను గెలుచుకున్న ఏకైక జట్టు (1999, 2003, 2007). 2011 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆప్ దశలో పాకిస్తాన్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడేవరకు ఆస్ట్రేలియా వరుసగా 34 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో అజేయంగా ఉంది.[16] భారత్ ( 2011) తర్వాత సొంతగడ్డపై ప్రపంచకప్ (2015) గెలిచిన రెండో జట్టు ఇది. ఆస్ట్రేలియా ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని రెండుసార్లు ( 2006, 2009) గెలుచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లలో వరుసగా రెండుసార్లు విజేతలుగా నిలిచిన ఏకైక జట్టుగా నిలిచింది.

చరిత్ర

మార్చు
 
1878లో ఇంగ్లండ్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టు

ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు 1877లో MCG లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌ ఆడి, 45 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించింది. ఆ మ్యాచ్‌లో చార్లెస్ బానర్‌మాన్ మొదటి టెస్ట్ సెంచరీ చేసి, 165 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.[17] ఆ సమయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య మాత్రమే టెస్టు క్రికెట్ పోటీ జరిగేది. రెండు దేశాల మధ్య ఉన్న చాలా దూరం కారణంగా, సముద్ర మార్గంలో ప్రయాణం చాలా నెలలు పడుతుంది కాబట్టి, పోటీలు ఎక్కువగా జరిగేవి కావు. ఆస్ట్రేలియాలో జనాభా చాలా తక్కువ అయినప్పటికీ, జట్టు ప్రారంభ ఆటలలో గట్టి పోటీ ఇచ్చింది. జాక్ బ్లాక్‌హామ్, బిల్లీ మర్డోక్, ఫ్రెడ్ "ది డెమన్" స్పోఫోర్త్, జార్జ్ బోనోర్, పెర్సీ మెక్‌డొన్నెల్, జార్జ్ గిఫెన్, చార్లెస్ "ది టెర్రర్" టర్నర్ వంటి స్టార్‌ ఆటగాళ్ళు ఉద్భవించారు. ఆ సమయంలో చాలా మంది క్రికెటర్లు న్యూ సౌత్ వేల్స్ లేదా విక్టోరియాకు చెందినవారు. సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన ఆల్-రౌండర్ జార్జ్ గిఫెన్ మినహా ఇతర ప్రాంతాల నుండి చెప్పుకోదగ్గ ఆటగాళ్ళు లేరు.

1882లో ఇంగ్లండ్‌తో ఓవల్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా క్రికెట్ ప్రారంభ చరిత్రలో ఒక ముఖ్యాంశం. ఈ మ్యాచ్‌లో, ఫ్రెడ్ స్పోఫోర్త్ ఆట నాల్గవ ఇన్నింగ్స్‌లో 44 పరుగులిచ్చి 7 వికెట్లు తీసుకున్నాడు, ఇంగ్లండ్ చెయ్యాల్సిన 85 పరుగుల లక్ష్యాన్ని అడ్డుకుని మ్యాచ్‌ను కాపాడాడు. ఈ మ్యాచ్ తర్వాత, ఆ సమయంలో లండన్‌లోని ఒక ప్రధాన వార్తాపత్రిక ది స్పోర్టింగ్ టైమ్స్, ఇంగ్లీషు క్రికెట్ మరణించిందని ప్రకటిస్తూ ఒక సంస్మరణను ముద్రించింది. "శరీరాన్ని దహనం చేసి, బూడిదను ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లారు" అని ఆ వార్తలో రాసింది. ఆ భస్మం కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లు ఆడిన టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌నే సుప్రసిద్ధమైన యాషెస్ సిరీస్. ఈ నాటికీ యాషెస్ పోటీ, క్రికెట్ క్రీడలో అత్యంత తీవ్రమైన పోటీలలో ఒకటి.

బ్రాడ్‌మన్ యుగం

మార్చు

1930 ఇంగ్లండ్ పర్యటన ఆస్ట్రేలియన్ జట్టుకు కొత్త గెలుపు యుగానికి నాంది పలికింది. బిల్ వుడ్‌ఫుల్ నేతృత్వంలోని జట్టు - "గ్రేట్ అన్-బౌలబుల్" - బిల్ పోన్స్‌ఫోర్డ్, స్టాన్ మెక్‌కేబ్, క్లారీ గ్రిమ్మెట్ వంటి ప్రసిద్ధులతో పాటు, కుర్రాళ్ళు ఆర్చీ జాక్సన్, డాన్ బ్రాడ్‌మాన్‌లతో కూడి ఉంది. బ్రాడ్‌మాన్ ఒక సెంచరీ, రెండు డబుల్ సెంచరీలు, ఒక ట్రిపుల్ సెంచరీతో సహా రికార్డు స్థాయిలో 974 పరుగులు సాధించాడు. లీడ్స్‌లో ఒకే రోజులో 309 పరుగులతో సహా 334 పరుగుల భారీ స్కోరును సాధించి, సిరీస్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. మూడేళ్ల తర్వాత 23 ఏళ్ల వయసులో జాక్సన్ క్షయవ్యాధితో మరణించాడు. ఆ జట్టు తన తదుపరి పది టెస్టుల్లో తొమ్మిదింటిని గెలిచి తిరుగులేనిదిగా పేరు తెచ్చుకుంది.

1932–33 ఆస్ట్రేలియా పర్యటన క్రికెట్‌లో అత్యంత అపఖ్యాతి పాలైన ఎపిసోడ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సీరీస్‌లో ఇంగ్లండ్ జట్టు, బాడీలైన్‌ను ఉపయోగించిన సీరీస్ అది. కెప్టెన్ డగ్లస్ జార్డైన్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ల శరీరాలే లక్ష్యంగా షార్ట్ పిచ్ డెలివరీలను బౌలింగ్ చేయమని తన బౌలర్లు బిల్ వోస్, హెరాల్డ్ లార్‌వుడ్‌లను ఆదేశించాడు. ఈ వ్యూహం ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా ప్రజలు అది దుర్మార్గంగాను క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగానూ ఉందని పరిగణించారు. గుండెపై గాయపడిన బిల్ వుడ్‌ఫుల్, బెర్ట్ ఓల్డ్‌ఫీల్డ్‌కు తల పగలడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి. మూడో టెస్టు జరిగిన అడిలైడ్‌లో 50 000 మంది అభిమానుల అల్లర్లకు కారణమైంది. దక్షిణ ఆస్ట్రేలియా గవర్నర్ అలెగ్జాండర్ హోర్-రుత్వెన్‌తో సహా ప్రముఖ ఆస్ట్రేలియన్ రాజకీయ ప్రముఖులు తమ ఆంగ్ల సహచరులకు నిరసన వ్యక్తం చేయడంతో వివాదం దాదాపు రెండు దేశాల మధ్య దౌత్య సంఘటనగా మారింది. సిరీస్ ఇంగ్లాండ్‌కు 4-1 విజయంతో ముగిసింది, అయితే ఉపయోగించిన బాడీలైన్ వ్యూహాలను తర్వాతి సంవత్సరం నిషేధించారు

సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్‌ను సార్వకాలిక అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా విస్తృతంగా పరిగణిస్తారు.[18][19] అతను 1930 నుండి 1948లో రిటైర్మెంట్ వరకు క్రీడలో ఆధిపత్యం చెలాయించాడు. ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు (334 vs ఇంగ్లండ్ 1930లో హెడింగ్లీలో ), అత్యధిక పరుగులు (6996), అత్యధిక సెంచరీలు (29), అత్యధిక డబుల్‌లు. సెంచరీలు, అత్యధిక టెస్టు, ఫస్ట్-క్లాస్ బ్యాటింగ్ సగటులు అతని పేరిట ఉన్నాయి. అతని అత్యధిక టెస్ట్ బ్యాటింగ్ సగటు రికార్డు - 99.94 - ఇంతవరకూ ఛేదన కాలేదు. అతని తరువాతి అత్యధిక సగటు కంటే ఇది దాదాపు 40 పరుగులు అధికం. తన చివరి టెస్టులో డకౌట్‌ కాకపోయి ఉంటే, అతని సగటు ఇన్నింగ్స్‌కు 100 పరుగులు ఉండేది. క్రికెట్‌కు అతను చేసిన సేవలకు గాను 1949లో నైట్‌ బిరుదు పొందాడు. అతన్ని ఆస్ట్రేలియాలో ఆల్-టైమ్ గ్రేటెస్ట్ స్పోర్టింగ్ హీరోలలో ఒకరిగా పరిగణిస్తారు.

అంతర్జాతీయ మైదానాలు

మార్చు
 
 
MCG/ఈస్టర్న్ ఓవల్
 
 
గాబా/ఎగ్జిబిషన్
 
డాక్‌లాండ్స్
 
కర్రారా
 
వాకా
 
ఆప్టస్
 
మానుకా
 
కజాలి
 
కార్డీనియా
 
బెర్రి
 
TIO
 
డెవన్‌పోర్ట్
 
హారప్
 
NTCA
 
ANZ
 
TCA
 
టోనీ
కనీసం ఒక్కటైనా అంతర్జాతీయ మ్యాచ్ జరిగిన స్టేడియంలు - ఆస్ట్రేలియా మ్యాపులో

ఆస్ట్రేలియా ప్రస్తుతం కింది మైదానాల్లో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోంది:

వేదిక నగరం కెపాసిటీ
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ మెల్బోర్న్ 1,00,024
పెర్త్ స్టేడియం పెర్త్ 60,000
అడిలైడ్ ఓవల్ అడిలైడ్ 53,500
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ సిడ్నీ 48,000
బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్ బ్రిస్బేన్ 36,000
కరారా ఓవల్ గోల్డ్ కోస్ట్ 21,000
బెల్లెరివ్ ఓవల్ హోబర్ట్ 20,000
మనుకా ఓవల్ కాన్బెర్రా 12,000

జట్టు

మార్చు

క్రికెట్ ఆస్ట్రేలియా వారి 2023–2024 జాతీయ ఒప్పందాల జాబితాను 2023 ఏప్రిల్ 6 న విడుదల చేసింది.[20] సంవత్సరంలో 12 అప్‌గ్రేడ్ పాయింట్‌లను పొందిన ఆటగాళ్ళు జాతీయ ఒప్పందాలకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఒక టెస్టుకు ఐదు పాయింట్లు, ప్రతి వన్డేకి, T20 కీ విలువ రెండు పాయింట్లు.

ఇది క్రికెట్ ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదుర్చుకున్న, 2022 జూన్ నుండి ఆస్ట్రేలియా తరపున ఆడిన లేదా ఇటీవలి టెస్ట్, వన్‌డే లేదా టి20 స్క్వాడ్‌లలో ఆడిన ప్రతి క్రియాశీల ఆటగాడి జాబితా. ఆడని ఆటగాళ్ళను ఇటాలిక్‌లలో జాబితా చేసాం.

ఆరోన్ ఫించ్ ఈ కాలంలో వన్‌డేలు, టి20 లకు ఆడాడు, కెప్టెన్‌గా వ్యవహరించాడు. అనంతరం, అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.[21]

చివరిగా నవీకరించబడింది: 2023 ఆగస్టు 1

  • రకాలు – ఇది వారి మొత్తం ఆస్ట్రేలియా కెరీర్‌లో కాకుండా గత సంవత్సరంలో ఆస్ట్రేలియా తరపున ఆడిన క్రికెట్ రకాలను సూచిస్తుంది
  • S/N - షర్ట్ నంబర్
  • సి – క్రికెట్ ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదుర్చుకుంది (Y = ఒప్పందం అమల్లో ఉంది)
పేరు వయసు బ్యాటింగు శైలి బౌలింగు శైలి |దేశీయ జట్టు BBL జట్టు Forms S/N C Captain Last టెస్టులు Last వన్‌డే Last టి20
Batters
టిమ్ డేవిడ్ 28 కుడిచేతి వాటం హోబార్ట్ హరికేన్స్ టి20 85   2022
పీటర్ హ్యాండ్‌కాంబ్ 33 కుడిచేతి వాటం విక్టోరియా మెల్‌బోర్న్ రెనెగేడ్స్ టెస్టులు 54   2023   2019   2019
మార్కస్ హారిస్ 32 ఎడమచేతి వాటం విక్టోరియా మెల్‌బోర్న్ రెనెగేడ్స్ టెస్టులు 14 Y   2022
ట్రావిస్ హెడ్ 30 ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ సౌత్ ఆస్ట్రేలియా అడిలైడ్ స్ట్రైకర్స్ టెస్టులు, వన్‌డే 62 Y   2023   2023   2022
ఉస్మాన్ ఖవాజా 38 ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం పేస్ క్వీన్స్‌లాండ్ బ్రిస్‌బేన్ హీట్ టెస్టులు 1 Y   2023   2019   2016
మాట్ రెన్షా 28 ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ క్వీన్స్‌లాండ్ బ్రిస్‌బేన్ హీట్ టెస్టులు 72   2023
స్టీవ్ స్మిత్ 35 కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ న్యూ సౌత్ వేల్స్ సిడ్నీ సిక్సర్స్ టెస్టులు, వన్‌డే, టి20 49 Y టెస్టులు, వన్‌డే (VC)   2023   2023   2022
డేవిడ్ వార్నర్ 38 ఎడమచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ న్యూ సౌత్ వేల్స్ సిడ్నీ థండర్ టెస్టులు, వన్‌డే, టి20 31 Y   2023   2023   2022
ఆల్ రౌండర్లు
సీన్ అబాట్ 32 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం న్యూ సౌత్ వేల్స్ సిడ్నీ సిక్సర్స్ వన్‌డే, టి20 77 Y   2023   2022
కామెరాన్ గ్రీన్ 25 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం వెస్టర్న్ ఆస్ట్రేలియా పెర్త్ స్కార్చర్స్ టెస్టులు, వన్‌డే, టి20 42 Y   2023   2023   2022
మార్నస్ లాబుస్చాగ్నే 30 కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ క్వీన్స్‌లాండ్ బ్రిస్‌బేన్ హీట్ టెస్టులు, వన్‌డే 33 Y   2023   2023   2022
మిచ్ మార్ష్ 33 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం పేస్ వెస్టర్న్ ఆస్ట్రేలియా పెర్త్ స్కార్చర్స్ టెస్టులు, వన్‌డే, టి20 8 Y   2023   2023   2022
గ్లెన్ మాక్స్‌వెల్ 36 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ విక్టోరియా మెల్‌బోర్న్ స్టార్స్ వన్‌డే, టి20 32 Y   2017   2023   2022
మైఖేల్ నెసర్ 34 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం పేస్-fast క్వీన్స్‌లాండ్ బ్రిస్‌బేన్ హీట్ టెస్టులు 18 Y   2022   2018
డేనియల్ సామ్స్ 32 కుడిచేతి వాటం ఎడమచేతి ఫాస్ట్-medium సిడ్నీ థండర్ టి20 95   2022
మార్కస్ స్టోయినిస్ 35 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం పేస్ వెస్టర్న్ ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ స్టార్స్ వన్‌డే, టి20 17 Y   2023   2022
వికెట్ కీపర్లు
అలెక్స్ కారీ 33 ఎడమచేతి వాటం సౌత్ ఆస్ట్రేలియా అడిలైడ్ స్ట్రైకర్స్ టెస్టులు, వన్‌డే 4 Y   2023   2023   2021
జోష్ ఇంగ్లిస్ 29 కుడిచేతి వాటం వెస్టర్న్ ఆస్ట్రేలియా పెర్త్ స్కార్చర్స్ వన్‌డే, టి20 48 Y   2023   2022
మాథ్యూ వాడే 37 ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం పేస్ టాస్మేనియా హోబార్ట్ హరికేన్స్ టి20 13 టి20 (C)   2021   2021   2022
పేస్ బౌలర్లు
స్కాట్ బోలాండ్ 35 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం విక్టోరియా మెల్‌బోర్న్ స్టార్స్ టెస్టులు 19 Y   2023   2016   2016
పాట్ కమిన్స్ 31 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ న్యూ సౌత్ వేల్స్ టెస్టులు, వన్‌డే, టి20 30 Y టెస్టులు, వన్‌డే (C)   2023   2022   2022
నాథన్ ఎల్లిస్ 30 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం టాస్మేనియా హోబార్ట్ హరికేన్స్ వన్‌డే, టి20 12   2023   2022
జోష్ హాజిల్‌వుడ్ 33 ఎడమచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం న్యూ సౌత్ వేల్స్ టెస్టులు, వన్‌డే, టి20 38 Y   2023   2022   2022
లాన్స్ మోరిస్ 26 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ వెస్టర్న్ ఆస్ట్రేలియా పెర్త్ స్కార్చర్స్ టెస్టులు 28 Y
ఝే రిచర్డ్‌సన్ 28 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ వెస్టర్న్ ఆస్ట్రేలియా పెర్త్ స్కార్చర్స్ వన్‌డే 60 Y   2021   2022   2022
కేన్ రిచర్డ్సన్ 33 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం మెల్‌బోర్న్ రెనెగేడ్స్ టి20 55   2020   2022
మిచెల్ స్టార్క్ 34 ఎడమచేతి వాటం ఎడమచేతి ఫాస్ట్ న్యూ సౌత్ వేల్స్ టెస్టులు, వన్‌డే, టి20 56 Y   2023   2023   2022
స్పిన్ బౌలర్లు
అష్టన్ అగర్ 31 ఎడమచేతి వాటం Slow left-arm orthodox వెస్టర్న్ ఆస్ట్రేలియా పెర్త్ స్కార్చర్స్ టెస్టులు, వన్‌డే, టి20 46 Y   2023   2023   2022
మాట్ కుహ్నెమాన్ 28 ఎడమచేతి వాటం Slow left-arm orthodox క్వీన్స్‌లాండ్ బ్రిస్‌బేన్ హీట్ టెస్టులు 50   2023   2022
నాథన్ లియోన్ 37 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ న్యూ సౌత్ వేల్స్ సిడ్నీ సిక్సర్స్ టెస్టులు 67 Y   2023   2019   2018
టాడ్ మర్ఫీ 24 ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ విక్టోరియా సిడ్నీ సిక్సర్స్ టెస్టులు 36 Y   2023
మిచ్ స్వెప్సన్ 31 కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ క్వీన్స్‌లాండ్ బ్రిస్‌బేన్ హీట్ టి20 22   2022   2022   2022
ఆడమ్ జాంపా 32 కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ న్యూ సౌత్ వేల్స్ మెల్‌బోర్న్ రెనెగేడ్స్ వన్‌డే, టి20 88 Y   2023   2022

కోచింగ్ సిబ్బంది

మార్చు
స్థానం పేరు
ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ [22]
అసిస్టెంట్ కోచ్ ఆండ్రీ బోరోవెక్
అసిస్టెంట్ కోచ్ డేనియల్ వెట్టోరి
బ్యాటింగ్ కోచ్ మైఖేల్ డి వెనుటో [23]
ఫిజియోథెరపిస్ట్ నిక్ జోన్స్
మనస్తత్వవేత్త మేరీ స్పిల్లేన్

జాతీయ ఎంపిక ప్యానెల్

మార్చు
స్థానం పేరు
జాతీయ సెలెక్టర్ (ఛైర్మన్) జార్జ్ బెయిలీ
ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్
జాతీయ సెలెక్టర్ టోనీ డోడెమైడ్

కోచింగ్ చరిత్ర

మార్చు
  • 1986–1996:  బాబ్ సింప్సన్
  • 1996–1999:  జియోఫ్ మార్ష్
  • 1999–2007:  జాన్ బుకానన్
  • 2007–2011:  టిమ్ నీల్సన్
  • 2010–2013:  మిక్కీ ఆర్థర్
  • 2013–2018:  డారెన్ లెమాన్
  • 2018–2022:  జస్టిన్ లాంగర్
  • 2022–ప్రస్తుతం:  ఆండ్రూ మెక్‌డొనాల్డ్

టెస్ట్ మ్యాచ్ రికార్డులు

మార్చు

జట్టు

మార్చు
  • క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన టెస్టు జట్టు. దాదాపు 47% గెలుపు శాతంతో 350కి పైగా టెస్ట్ మ్యాచ్‌లు గెలిచింది. తర్వాతి అత్యుత్తమ ప్రదర్శన దక్షిణాఫ్రికా 37%.[24]
  • టెస్టు క్రికెట్ చరిత్రలో జరిగిన రెండే రెండు టై మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా ఆడింది. మొదటిది 1960 డిసెంబరులో వెస్టిండీస్‌తో బ్రిస్బేన్‌లో జరిగింది.[25] రెండవది 1986 సెప్టెంబరులో భారతదేశంతో మద్రాస్ (చెన్నై) లో జరిగింది.[26]
  • ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సాధించిన అతిపెద్ద విజయం 2002 ఫిబ్రవరి 24 న వచ్చింది. జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 360 పరుగుల తేడాతో విజయం సాధించింది.[27]
  • వరుసగా 16 విజయాలతో ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. ఇది రెండుసార్లు సాధించింది; 1999 అక్టోబరు నుండి 2001 ఫిబ్రవరి వరకు మొదటిసారి, 2005 డిసెంబరు నుండి 2008 జనవరి వరకు రెండవసారి.[28]
  • 2005 అక్టోబరు నుండి 2008 జూన్ వరకు 9 సిరీస్‌లను గెలుచుకున్న ఆస్ట్రేలియా, అత్యధిక వరుస సిరీస్ విజయాల రికార్డును ఇంగ్లండ్‌తో కలిసి పంచుకుంది.[29]
  • 1955 జూన్ లో వెస్టిండీస్‌పై జమైకాలోని కింగ్‌స్టన్‌లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్‌ స్కోరు నమోదు చేసింది. ఐదుగురు ఆటగాళ్లు సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 758/8 పరుగులు చేసింది.[30]
  • 1902 మేలో ఇంగ్లాండ్‌పై బర్మింగ్‌హామ్‌లో టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఆస్ట్రేలియా 36 పరుగులకే ఆలౌట్ అయింది [31]
  • ఫాలో-ఆన్‌ని అమలు చేసిన తర్వాత టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయిన రెండు జట్లలో ఆస్ట్రేలియా ఒకటి. అలాంటి నాలుగు మ్యాచ్‌లలో మొదటి మూడింటిలో ఓడిపోయిన జట్టు ఆస్ట్రేలియాయే. 2023లో ఇంగ్లండ్ న్యూజీలాండ్ జట్టుతో ఓడి, ఇలాంటి విధిని అనుసరించిన రెండవ జట్టుగా అవతరించింది:[32]
    • 1894-95 యాషెస్‌లో మొదటి టెస్ట్.
    • 1981 యాషెస్‌లో మూడో టెస్టు .
    • భారత్‌తో 2000–01 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో రెండో టెస్టు
    • 2023 ఇంగ్లీష్ టూర్ ఆఫ్ న్యూజిలాండ్‌లో రెండో టెస్టు
  • 2013 మార్చిలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా టెస్టు చరిత్రలో తమ తొలి ఇన్నింగ్స్‌లో డిక్లేర్ చేసి, ఆపై ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన తొలి జట్టుగా నిలిచింది.[33]
  • 2013-14 యాషెస్ సిరీస్‌లో, ఇంగ్లండ్‌పై 5-0 తో గెలిచినపుడు ఆస్ట్రేలియా, మొత్తం 100 ప్రత్యర్థి వికెట్లనూ కైవసం చేసుకుంది.[34]

ఎక్కువ గేమ్‌లు

మార్చు

బ్యాటింగ్

మార్చు
  • చార్లెస్ బ్యానర్‌మాన్ టెస్ట్ క్రికెట్‌లో మొదటి బంతిని ఎదుర్కొన్నాడు, టెస్ట్ క్రికెట్‌లో మొదటి పరుగులు చేశాడు, మొదటి టెస్ట్ సెంచరీని కూడా చేశాడు.[35]
  • చార్లెస్ బానర్‌మాన్ మ్యాచ్ 1 లో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ మొత్తంలో 67.34% తానొక్కడే సాధించాడు. ఈ రికార్డు ఈనాటికీ, పూర్తయిన ఇన్నింగ్స్ మొత్తంలో ఒక బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక శాతంగా నిలిచి ఉంది.[36]
  • రికీ పాంటింగ్ 13,378 పరుగులతో టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేశాడు. 265 ఇన్నింగ్స్‌ల్లో 11,174 పరుగులతో అలన్ బోర్డర్ రెండో స్థానంలో ఉన్నాడు, ఆస్ట్రేలియాపై 226 పరుగుల ఇన్నింగ్స్‌తో బ్రియాన్ లారా ఈ రికార్డును బద్దలు కొట్టాడు, అయితే స్టీవ్ వా 260 ఇన్నింగ్స్‌లలో 10,927 పరుగులు చేశాడు.[37]
  • అలన్ బోర్డర్ 10,000 దాటిన మొదటి ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్, 11,000 టెస్ట్ పరుగులు దాటిన మొట్టమొదటి బ్యాట్స్‌మన్.
  • రికీ పాంటింగ్, 12,000, 13,000 టెస్ట్ పరుగులను దాటిన మొదటి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్.
  • 2003 అక్టోబరులో పెర్త్‌లో జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో 380 పరుగులతో మాథ్యూ హేడెన్ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
  • డోనాల్డ్ బ్రాడ్‌మాన్కు 99.94 పరుగుల అత్యధిక సగటు రికార్డు ఉన్నాడు. బ్రాడ్‌మాన్ 52 టెస్టులు ఆడాడు, 29 సెంచరీలు, మరో 13 అర్ధ సెంచరీలు చేశాడు.[38]
  • రికీ పాంటింగ్ 41 సెంచరీలతో అత్యధిక సెంచరీలు బాదిన ఆస్ట్రేలియా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా 260 ఇన్నింగ్స్‌ల్లో 32 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.[39]
  • అలన్ బోర్డర్ 265 ఇన్నింగ్స్‌ల్లో 63 పరుగులతో అత్యధిక అర్ధశతకాలు బాదిన ఆస్ట్రేలియా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.[39]
  • ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఆస్ట్రేలియాకు చెందిన అత్యంత వేగవంతమైన శతకం రికార్డును సొంతం చేసుకున్నాడు.
  • గ్లెన్ మెక్‌గ్రాత్ 138 ఇన్నింగ్స్‌లలో 35 పరుగులతో అత్యధికంగా డకౌట్ అయిన ఆస్ట్రేలియా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.[40]

బౌలింగ్

మార్చు
  • బిల్లీ మిడ్‌వింటర్ మొట్టమొదటి సారి ఒక టెస్ట్ మ్యాచ్ [41] ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసుకున్న రికార్డు కైవసం చేసుకున్నాడు.
  • వెర్నాన్ రాయ్ల్, ఫ్రాన్సిస్ మెక్‌కిన్నన్, టామ్ ఎమ్మెట్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి ఫ్రెడ్ స్పోఫోర్త్, టెస్ట్ క్రికెట్‌లో మొట్టమొదటి హ్యాట్రిక్ సాధించాడు.[42]
  • ఫ్రెడ్ స్పోఫోర్త్ టెస్ట్ క్రికెట్‌లో మొట్టమొదటి సారిగా ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు సాధించిన రికార్డు సాధించాడు.
  • 145 టెస్టుల్లో 708 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన ఆస్ట్రేలియా క్రికెటర్‌గా షేన్ వార్న్ రికార్డు సృష్టించాడు.[43]
  • ఆర్థర్ మైలీ 1921 ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌పై 9/121 గణాంకాలతో ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు సాధించిన ఆస్ట్రేలియన్ క్రికెటరు [44]
  • 1972 జూన్లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 16/137తో బాబ్ మాస్సీ ఆస్ట్రేలియన్ క్రికెటర్లలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు సాధించాడు. ఆస్ట్రేలియా తరఫున అతనికి అదే తొలి టెస్టు మ్యాచ్ కూడా.[45]
  • JJ ఫెర్రిస్ తన కెరీర్‌లో 12.70 సగటుతో 61 వికెట్లు తీసి ఆస్ట్రేలియన్ బౌలర్లలో అత్యుత్తమ బౌలింగ్ సగటు రికార్డు సాధించాడు.[45][46]
  • 1935-36లో దక్షిణాఫ్రికాపై 44 పరుగులతో ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా క్లారీ గ్రిమ్మెట్ రికార్డు సృష్టించాడు.[47]

ఫీల్డింగ్, వికెట్ కీపింగ్

మార్చు
  • రికీ పాంటింగ్ 168 మ్యాచ్‌ల్లో 196 క్యాచ్‌లతో కెరీర్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆస్ట్రేలియా ఫీల్డర్‌గా రికార్డు సృష్టించాడు.[48]
  • జాక్ బ్లాక్‌హామ్ టెస్ట్ క్రికెట్‌లో మొదటి స్టంపింగ్ మ్యాచ్ [41]లో చేశాడు.
  • ఆడమ్ గిల్‌క్రిస్ట్ 96 మ్యాచ్‌ల్లో 416 పరుగులతో కెరీర్‌లో అత్యధికంగా అవుట్లు చేసిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు.

అంతర్జాతీయ వన్డే రికార్డులు

మార్చు

జట్టు

మార్చు
  • 2006 మార్చి 12న జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై 50 ఓవర్లలో 434/4 స్కోర్ చేసి, వన్డే ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు రికార్డు సాధించింది. ఇదే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు దానిని అధిగమించారు. అది ప్రపంచ రికార్డు స్కోరు.[49]
  • వన్డే ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా అత్యల్ప స్కోరు 70. ఈ స్కోర్ రెండుసార్లు సంభవించింది; ఒకసారి 1977లో ఇంగ్లండ్‌పైన, ఒకసారి 1986లో న్యూజిలాండ్‌పైన [50]
  • అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 275 పరుగులతో ఆస్ట్రేలియా సాధించిన విజయం అతిపెద్దది. 2015లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఇది జరిగింది.[51]
  • ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా 3 టోర్నమెంట్లను గెలుచుకున్న ఏకైక జట్టు ఆస్ట్రేలియా; 1999, 2003, 2007 .
  • ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో వరుసగా 34 మ్యాచ్‌లలో అజేయంగా నిలిచింది. 1999 లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత, మళ్ళీ 2011 లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయే వరకు ఆస్ట్రేలియా అజేయంగా ఉంది .
  • ఆస్ట్రేలియా అత్యధిక ప్రపంచకప్‌లను గెలుచుకుంది - 5.

ఎక్కువ గేమ్‌లు

మార్చు
  • రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా తరపున అత్యధిక వన్డేలు ఆడాడు. 375 మ్యాచ్‌లు.

బ్యాటింగ్

మార్చు
  • రికీ పాంటింగ్ 13,291 పరుగులతో వన్‌డేలలో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్
  • రికీ పాంటింగ్ 30 సెంచరీలతో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌
  • రికీ పాంటింగ్ 82 పరుగులతో అత్యధిక వన్డే ఇంటర్నేషనల్ ఫిఫ్టీలు నమోదు చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్
  • అంతర్జాతీయ వన్డేల్లో 10,000 పరుగులు చేసిన తొలి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ రికీ పాంటింగ్.
  • షేన్ వాట్సన్ 185 * పరుగులతో ఒక ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ ద్వారా ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత నాటౌట్ స్కోరును కలిగి ఉన్నాడు.
  • షేన్ వాట్సన్ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆస్ట్రేలియా ఆటగాడు, 15 సిక్సర్లు.
  • అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఏకైక ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ .

బౌలింగ్

మార్చు
  • గ్లెన్ మెక్‌గ్రాత్ 381తో అత్యధిక వన్డే అంతర్జాతీయ వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌలర్.
  • గ్లెన్ మెక్‌గ్రాత్ 7/15తో ఆస్ట్రేలియన్ బౌలర్ ద్వారా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను కలిగి ఉన్నాడు.
  • బ్రెట్ లీ 9 వికెట్లతో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌలర్‌గా నిలిచాడు.

ఫీల్డింగ్, వికెట్ కీపింగ్

మార్చు
  • రికీ పాంటింగ్ 154 క్యాచ్‌లతో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆస్ట్రేలియా ఫీల్డర్‌గా నిలిచాడు.
  • ఆడమ్ గిల్‌క్రిస్ట్ 470 పరుగులతో ఆస్ట్రేలియా వికెట్‌కీపర్‌గా అత్యధికంగా అవుట్ చేశాడు.
  • ఆడమ్ గిల్‌క్రిస్ట్ 416 క్యాచ్‌లతో ఆస్ట్రేలియా వికెట్‌కీపర్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్నాడు.
  • ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కు 54 స్టంపింగ్‌లతో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ చేసిన అత్యధిక స్టంపింగ్‌ల రికార్డు ఉంది.

ట్వంటీ20 అంతర్జాతీయ రికార్డులు

మార్చు

టోర్నమెంట్ల చరిత్ర

మార్చు

సంవత్సరం తరువాత ఉన్న ఎరుపు పెట్టె, ఆస్ట్రేలియాలో ఆడిన టోర్నమెంట్‌లను సూచిస్తుంది

ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్

మార్చు
ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రికార్డు
సంవత్సరం లీగ్ వేదిక ఫైనల్ హోస్ట్ ఫైనల్ తుది స్థానం
స్థా మ్యాచ్‌లు Ded PC Pts PCT
గె డ్రా టై
2019–21 [52] 3/9 14 8 4 2 0 4 480 332 69.2 రోజ్ బౌల్, ఇంగ్లాండ్ DNQ 3వ
2021–23 [53] 1/9 19 11 3 5 0 0 228 152 66.7  ది ఓవల్, ఇంగ్లాండ్ కొట్టండి  భారతదేశం 209 పరుగుల తేడాతో. W

ఐసిసి ప్రపంచ కప్

మార్చు
ప్రపంచకప్ రికార్డు
సంవత్సరం రౌండ్ స్థానం GP గె టై ఫ.తే
  1975 రన్నర్స్-అప్ 2/8 5 3 2 0 0
  1979 ఆప్ స్టేజ్ 6/8 3 1 2 0 0
  1983 6 2 4 0 0
  1987 ఛాంపియన్స్ 1/8 8 7 1 0 0
  1992 సమూహ దశ 5/9 8 4 4 0 0
   1996 రన్నర్స్-అప్ 2/12 7 5 2 0 0
  1999 ఛాంపియన్స్ 1/12 10 7 2 1 0
  2003 1/14 11 11 0 0 0
  2007 1/16 11 11 0 0 0
  మూస:Country data BGD2011 క్వార్టర్ ఫైనల్స్ 6/14 7 4 2 0 1
  2015 ఛాంపియన్స్ 1/14 9 7 1 0 1
  2019 సెమీ ఫైనల్స్ 4/10 10 7 3 0 0
  2023 అర్హత సాధించారు
మొత్తం 5 శీర్షికలు 12/12 85 62 20 1 2

ఐసిసి T20 ప్రపంచ కప్

మార్చు
టీ20 ప్రపంచకప్‌లో రికార్డు
సంవత్సరం రౌండ్ స్థానం గె టై ఫ.తే
  2007 సెమీ ఫైనల్స్ 3/12 6 3 3 0 0
  2009 సమూహ దశ 11/12 2 0 2 0 0
  2010 రన్నర్స్-అప్ 2/12 7 6 1 0 0
  2012 సెమీ ఫైనల్స్ 3/12 6 4 2 0 0
  2014 సూపర్ 10 8/16 4 1 3 0 0
  2016 6/16 4 2 2 0 0
  2021 ఛాంపియన్స్ 1/16 7 6 1 0 0
  2022 సూపర్ 12 5/16 5 3 1 1
మొత్తం 1 శీర్షికలు 6/6 29 16 13 0 0

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ

మార్చు
ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డు
సంవత్సరం రౌండ్ స్థానం గె టై ఫ.తే
  1998 క్వార్టర్ ఫైనల్స్ 8/9 1 0 1 0 0
  2000 5/11 1 0 1 0 0
  2002 సెమీ ఫైనల్స్ 4/12 3 2 1 0 0
  2004 3/12 3 2 1 0 0
  2006 ఛాంపియన్స్ 1/10 5 4 1 0 0
  2009 1/8 5 4 0 0 1
  2013 ఆప్ స్టేజ్ 7/8 3 0 2 0 1
  2017 3 0 1 0 2
మొత్తం 2 శీర్షికలు 6/6 24 12 8 0 4

కామన్వెల్త్ గేమ్స్

మార్చు
కామన్వెల్త్ గేమ్స్ రికార్డు
సంవత్సరం రౌండ్ స్థానం గె టై ఫ.తే
  1998 రన్నర్స్-అప్ 2/16 5 4 1 0 0
మొత్తం 0 శీర్షికలు 1/1 5 4 1 0 0

సన్మానాలు

మార్చు

ఐసిసి

మార్చు
  • ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ :
    • ఛాంపియన్లు (1) : 2021–2023
  • ప్రపంచ కప్ :
    • ఛాంపియన్లు (5) : 1987, 1999, 2003, 2007, 2015
    • రన్నర్స్-అప్ (2) : 1975, 1996
  • T20 ప్రపంచ కప్ :
    • ఛాంపియన్లు (1) : 2021
    • రన్నరప్ (1) : 2010
  • ఛాంపియన్స్ ట్రోఫీ :
    • ఛాంపియన్లు (2) : 2006, 2009

ఇతర పోటీలు

మార్చు
  • కామన్వెల్త్ గేమ్స్ :
    • రజత పతకం (1) : 1998

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Australia advance to the top of men's Test and T20I rankings". ICC. Retrieved 1 May 2020.
  2. "ICC Rankings". International Cricket Council.
  3. "Test matches - Team records". ESPNcricinfo.
  4. "Test matches - 2023 Team records". ESPNcricinfo.
  5. "ODI matches - Team records". ESPNcricinfo.
  6. "ODI matches - 2023 Team records". ESPNcricinfo.
  7. "T20I matches - Team records". ESPNcricinfo.
  8. "T20I matches - 2023 Team records". ESPNcricinfo.
  9. "1st Test: Australia v England at Melbourne, Mar 15–19, 1877 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 27 November 2010. Retrieved 14 January 2011.
  10. "Only ODI: Australia v England at Melbourne, Jan 5, 1971 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 27 December 2010. Retrieved 14 January 2011.
  11. "Only T20I: New Zealand v Australia at Auckland, Feb 17, 2005 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 10 January 2011. Retrieved 14 January 2011.
  12. "Records / Test matches / Team records / Results summary". ESPNcricinfo. Archived from the original on 3 February 2019. Retrieved 19 January 2021.
  13. "ICC Test Rankings". ICC. 19 January 2021. Archived from the original on 24 September 2012. Retrieved 19 January 2021.
  14. 14.0 14.1 "Records | One-Day Internationals | ESPN Cricinfo". ESPNcricinfo. Archived from the original on 24 February 2013. Retrieved 1 January 2019.
  15. "ICC ODI Rankings". ICC. 10 March 2019. Archived from the original on 24 March 2019. Retrieved 10 March 2019.
  16. "World Cup day 29 as it happened". BBC News. 19 March 2011. Archived from the original on 20 March 2011. Retrieved 19 March 2011.
  17. "What do we know about the first Test cricketer?". ESPN CricInfo. Retrieved 10 March 2022.
  18. mohankaus (17 January 2009). "ICC's "Best Ever" batsmen and bowlers!". i3j3Cricket :: A blog for fans of Indian cricket... Archived from the original on 2 January 2011. Retrieved 14 January 2011.
  19. "The 10 Greatest Batsmen Ever". World Cricket Watch. 15 October 2009. Archived from the original on 11 February 2011. Retrieved 14 January 2011.
  20. "Murphy, Morris among new faces on Aussie contract list". cricket.com.au. 6 April 2023.
  21. "Aaron Finch announces retirement from T20Is, ends Australia career". ESPNcricinfo. Retrieved 2023-02-07.
  22. "Andrew McDonald appointed Australian men's head coach". International Cricket Council. Retrieved 13 April 2022.
  23. "Aussie men lock in two new assistant coaches". Cricket Australia. Retrieved 1 July 2021.
  24. "Test Results by Country". ESPNcricinfo. Archived from the original on 29 January 2007. Retrieved 10 March 2022.
  25. "1st Test: Australia v West Indies at Brisbane, Dec 9–14, 1960". ESPNcricinfo. Archived from the original on 14 May 2004. Retrieved 10 March 2022.
  26. "1st Test: India v Australia at Chennai, Sep 18–22, 1986". ESPNcricinfo. Archived from the original on 19 November 2007. Retrieved 10 March 2022.
  27. "1st Test: South Africa v Australia at Johannesburg, Feb 22–24, 2002". ESPN Cricinfo. Archived from the original on 19 November 2007. Retrieved 10 March 2022.
  28. "Most Consecutive Wins". ESPNcricinfo. Archived from the original on 18 March 2009. Retrieved 10 March 2022.
  29. "Most Consecutive Series Wins". ESPNcricinfo. Archived from the original on 30 March 2010. Retrieved 10 March 2022.
  30. "5th Test: West Indies v Australia at Kingston, Jun 11–17, 1955". ESPN Cricinfo. Archived from the original on 7 July 2012. Retrieved 10 March 2022.
  31. "1st Test: England v Australia at Birmingham, May 29–31, 1902". ESPN Cricinfo. Archived from the original on 19 November 2007. Retrieved 10 March 2022.
  32. "Tests – Victory after Following-On". ESPNcricinfo. Archived from the original on 27 June 2004. Retrieved 10 March 2022.
  33. "BBC Sport – India v Australia: Collapse helps hosts take 2–0 lead". BBC. 5 March 2013. Archived from the original on 23 April 2013. Retrieved 22 July 2013.
  34. "Aussies raise the bat, with the ball". Youtube. Archived from the original on 16 May 2016. Retrieved 7 January 2017.
  35. Gideon Haigh (7 August 2016). "What do we know about the first Test cricketer?". ESPN Cricinfo. Archived from the original on 27 January 2018. Retrieved 10 March 2022.
  36. "Batsmen Scoring more than 50% of Innings Total (where side dismissed)". Howstat!. Archived from the original on 10 April 2010. Retrieved 30 December 2010.
  37. "Most Runs". ESPN Cricinfo. Retrieved 10 March 2022.
  38. "Highest Averages". ESPN Cricinfo. Retrieved 10 March 2022.
  39. 39.0 39.1 "Most Fifties (and Over)". ESPN Cricinfo. Retrieved 10 March 2022.
  40. "Most Ducks". ESPN Cricinfo. Retrieved 10 March 2022.
  41. 41.0 41.1 "1st Test: Australia v England at Melbourne, Mar 15–19, 1877". ESPN Cricinfo. Archived from the original on 19 January 2013. Retrieved 22 July 2013.
  42. "Hat-tricks". ESPNcricinfo. Archived from the original on 21 March 2009. Retrieved 10 March 2022.
  43. "Most Wickets". ESPN Cricinfo. Retrieved 10 March 2022.
  44. "4th Test: Australia v England at Melbourne, Feb 11–16, 1921". ESPN Cricinfo. Archived from the original on 14 October 2012. Retrieved 10 March 2022.
  45. 45.0 45.1 "Best Career Bowling Average". ESPN Cricinfo. Retrieved 10 March 2022.
  46. "J.J. Ferris". ESPN Cricinfo. Archived from the original on 23 March 2007. Retrieved 10 March 2022.
  47. "Most Wickets in a Series". ESPN Cricinfo. Retrieved 10 March 2022.
  48. "Most Catches". ESPN Cricinfo. Retrieved 10 March 2022.
  49. "5th ODI: South Africa v Australia at Johannesburg, Mar 12, 2006". ESPN Cricinfo. Archived from the original on 10 February 2009. Retrieved 10 March 2022.
  50. "One-Day Internationals". ESPN Cricinfo. Retrieved 10 March 2022.
  51. "31st Match: Australia v Namibia at Potchefstroom, Feb 27, 2003". ESPN Cricinfo. 4 March 2015. Archived from the original on 6 March 2015. Retrieved 10 March 2022.
  52. "ICC World Test Championship 2019–2021 Table". ESPN Cricinfo. Retrieved 29 August 2021.
  53. "ICC World Test Championship 2019–2021 Table". ESPN Cricinfo. Retrieved 29 August 2021.