కోహెడ మండలం

తెలంగాణ, సిద్దిపేట జిల్లా లోని మండలం

కోహెడ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] కోహెడ ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన కరీంనగర్ నుండి 37 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం హుస్నాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. కోహెడ, ఈ మండలానికి కేంద్రం.

కోహెడ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°08′N 79°20′E / 18.13°N 79.33°E / 18.13; 79.33
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట జిల్లా
మండల కేంద్రం కోహెడ (సిద్ధిపేట జిల్లా)
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 44,645
 - పురుషులు 22,334
 - స్త్రీలు 22,311
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.56%
 - పురుషులు 66.59%
 - స్త్రీలు 38.48%
పిన్‌కోడ్ 505473

గణాంకాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 44,645 - పురుషులు 22,334 - స్త్రీలు 22,311. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో తేడా ఏమీ లేదు. మండల వైశాల్యం 205 చ.కి.మీ. కాగా, జనాభా 44,645. జనాభాలో పురుషులు 22,334 కాగా, స్త్రీల సంఖ్య 22,311. మండలంలో 11,563 గృహాలున్నాయి.[3]

కరీంనగర్ జిల్లా నుండి సిద్ధిపేట జిల్లాకు మార్పు. మార్చు

లోగడ కోహెడ్ గ్రామం/ మండలం కరీనగర్ జిల్లా, కరీంనగర్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కోహెడ్ మండలాన్ని (1+15) పదిహేను గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లా, హుస్నాబాద్ పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. కోహెడ
  2. బస్వాపూర్
  3. కూరెళ్ళ
  4. వింజపల్లి
  5. రామచంద్రాపూర్
  6. వరికోలు
  7. గొట్లమిట్ట
  8. నారాయణపూర్
  9. శ్రీరాములపల్లి
  10. నక్కిరకొమ్ముల
  11. పరివేద
  12. సముద్రాల
  13. కచ్చాపూర్
  14. శనిగరం
  15. తంగళ్ళపల్లి
  16. గుండారెడ్డిపల్లి

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-04-11.
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు మార్చు