హుస్నాబాదు రెవెన్యూ డివిజను

తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం.

హుస్నాబాదు రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. సిద్ధిపేట జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం హుస్నాబాద్ పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలోని హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.

హుస్నాబాదు రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాసిద్ధిపేట

వివరాలు

మార్చు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3][4]

పరిపాలన

మార్చు

హుస్నాబాదు డివిజనులోని మండలాలు:[5]

క్ర.సం హుస్నాబాద్ రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 హుస్నాబాద్ మండలం 11 రెవెన్యూ గ్రామాలు
2 అక్కన్నపేట మండలం 14 రెవెన్యూ గ్రామాలు
3 కోహెడ మండలం 16 రెవెన్యూ గ్రామాలు
4 బెజ్జంకి మండలం 14 రెవెన్యూ గ్రామాలు
5 మద్దూరు మండలం 11 రెవెన్యూ గ్రామాలు
6 నారాయణరావుపేట మండలం 5 రెవెన్యూ గ్రామాలు
7 దూళిమిట్ట మండలం 8 రెవెన్యూ గ్రామాలు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-08-08.
  3. "Subdivision & Blocks | GOVERNMENT OF TELANGANA, SIDDIPET DISTRICT | India". siddipet.telangana.gov.in. Archived from the original on 2021-02-26. Retrieved 2022-08-08.
  4. Vemula, Prakash (2022-03-15). "List of Revenue Divisions, Mandals in Siddipet District". TeachersBadi. Archived from the original on 2020-09-25. Retrieved 2022-08-08.
  5. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2022-08-08.