కౌశంబి భట్

గుజరాత్‌కు చెందిన సినిమా నటి.

కౌశంబి భట్, గుజరాత్‌కు చెందిన సినిమా నటి. హెల్లారో (2019), ధుంకీ (2019), మోంటు నీ బిట్టు (2019) వంటి గుజరాతీ సినిమాలలో నటించింది.

కౌశంబి భట్
2019 జూలై 27న అహ్మదాబాద్లో మోంటు నీ బిట్టు సినిమా ట్రైలర్ లాంచ్‌లో కౌశంబి భట్
జననం (1991-10-01) 1991 అక్టోబరు 1 (వయసు 33)
రాజ్‌కోట్‌, గుజరాత్
వృత్తినటి

జీవిత చరిత్ర

మార్చు

కౌశంబి భట్, 1991 అక్టోబరు 1న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జన్మించింది. రాజ్‌కోట్‌లో పాఠశాల విద్యను, అహ్మదాబాద్‌లోని జిఎల్ఎస్ కళాశాలలో కళాశాల విద్యను పొందింది. అహ్మదాబాద్ లోని గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి డెవలప్‌మెంట్ కమ్యూనికేషన్‌లో మాస్టర్ డిగ్రీని పూర్తిచేసింది.[1]

సినిమారంగం

మార్చు

2019లో గుజరాతీ పీరియడ్ డ్రామా సినిమా హెల్లారోలో తొలిసారిగా నటించింది. ఈ సినిమా 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[2] కౌశంబి తన నటనకు ప్రత్యేక జ్యూరీ అవార్డును పొందింది.[3][4] విజయగిరి బావ తీసిన రొమాంటిక్ కామెడీ మోంటు నీ బిట్టు, అనీష్ షా తీసిన ధుంకీ సినిమాలో నటించింది.[5][6]

కాళు ఎట్లే అంధారు అనే గుజరాతీ నాటకంలో తన పాత్రకు గుర్తింపు కూడా పొందింది.[5]

అవార్డులు

మార్చు
సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం మూలాలు
2019 జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రత్యేక జ్యూరీ అవార్డు హెల్లారో గెలుపు [7]
2019 గుజరాతీ ఐకానిక్ ఫిల్మ్ అవార్డు ఉత్తమ సహాయ నటి ధుంకి గెలుపు [1][8]

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర
2019 హెల్లారో చంపా
2019 ధుంకి అంకిత
2019 మోంటు నీ బిట్టు సౌభాగ్యలక్ష్మి

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Upadhyay, Akshay (2020-06-02). "If there is a will, there is a way – Kaushambi Bhatt". The Story Behind Name. Archived from the original on March 27, 2022. Retrieved 2022-04-11.
  2. Scroll Staff (9 August 2019). "National Awards: Aditya Dhar gets best director for 'Uri', Gujarati movie 'Hellaro' wins Best Film". Scroll.in. Retrieved 2022-04-11.
  3. "Hellaro, a celluloid celebration of breaking free". timesofindia.indiatimes.com.
  4. "Hellaro, National Award-winning Gujarati film, is a beautiful ode to female desire and defiance". www.firstpost.com.
  5. 5.0 5.1 "Kaushambi Bhatt". Book My Show.
  6. "Celebration time for Anish Shah's 'Dhunki' as it turns one today". The Times of India. 2020-07-28. Retrieved 2022-04-11.
  7. "66th National Film Awards" (PDF). dff.gov.in. Archived from the original (PDF) on 2019-08-09. Retrieved 2022-04-11.
  8. "અમદાવાદમાં યોજાયો ગુજરાત આઇકોનિક ફિલ્મ એવાર્ડ, ગુજરાતી ફિલ્મ કલાકારો ચમક્યા!". Gujarat Inside. 2019-12-26. Retrieved 2022-04-11.[permanent dead link]

బయటి లింకులు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కౌశంబి భట్ పేజీ