క్రిస్ డ్రమ్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

క్రిస్టోఫర్ జేమ్స్ డ్రమ్ (జననం 1974, జూలై 10) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1999 నుండి 2002 వరకు ఐదు టెస్ట్ మ్యాచ్‌లు, ఐదు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1]

క్రిస్ డ్రమ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
క్రిస్టోఫర్ జేమ్స్ డ్రమ్
పుట్టిన తేదీ (1974-07-10) 1974 జూలై 10 (వయసు 49)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 215)2001 మార్చి 15 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2002 మార్చి 30 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 109)1999 జనవరి 14 - ఇండియా తో
చివరి వన్‌డే1999 నవంబరు 17 - ఇండియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 5 5 50 53
చేసిన పరుగులు 10 9 377 96
బ్యాటింగు సగటు 3.33 9.92 6.40
100లు/50లు 0/0 0/0 0/1 0/0
అత్యుత్తమ స్కోరు 4 7* 60* 14*
వేసిన బంతులు 806 216 8,486 2,686
వికెట్లు 16 4 199 74
బౌలింగు సగటు 30.12 65.25 18.43 27.24
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 7 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 2 0
అత్యుత్తమ బౌలింగు 3/36 2/31 6/34 5/41
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 1/– 21/– 10/–
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 18

దేశీయ కెరీర్ మార్చు

1996 - 2002 మధ్యకాలంలో ఆక్లాండ్ క్రికెట్ జట్టుకు ఆడాడు. దేశీయ పోటీలలో 199 ఫస్ట్ క్లాస్ వికెట్లు, 74 పరిమిత ఓవర్ల వికెట్లతో తన కెరీర్‌ను ముగించాడు.

అంతర్జాతీయ కెరీర్ మార్చు

2001 మార్చిలో రెండవ టెస్ట్ మ్యాచ్‌లో న్యూజీలాండ్ తరపున పాకిస్థాన్‌పై అరంగేట్రం చేశాడు.[2] జేడ్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. 1999, జనవరి 14న, భారతదేశంపై తన వన్డే అరంగేట్రం చేసాడు.[3] సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేయడం ద్వారా తన మొదటి వన్డే అంతర్జాతీయ వికెట్‌ను తీసుకున్నాడు.[4]

1998 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న న్యూజీలాండ్ జట్టులో డ్రమ్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2002 ఏప్రిల్ లో ఆడాడు. 28 సంవత్సరాల వయస్సులో అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.

మూలాలు మార్చు

  1. "Chris Drum Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-15.
  2. "NZ vs PAK, Pakistan tour of New Zealand 2000/01, 2nd Test at Christchurch, March 15 - 19, 2001 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-15.
  3. "NZ vs IND, India tour of New Zealand 1998/99, 3rd ODI at Wellington, January 14, 1999 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-15.
  4. Chris Drum profile, espncricinfo.com; accessed 24 August 2014.