క్లోరిక్ ఆమ్లం
క్లోరిక్ ఆమ్లం అనునది క్లోరిన్ యొక్క ఆక్సోఆమ్లం.ఇది క్లోరేట్ లవణాల ఉత్పత్తికి పూర్వగామి (precursor).క్లోరిక్ ఆమ్లం బలమైన ఆమ్లం (pKa ≈ −1).క్లోరిక్ ఆమ్లం ఆక్సీకరణ కారకం.క్లోరిక్ ఆమ్లం రసాయానిక ఫార్ములా HClO3.క్లోరిన్,హైడ్రోజన్, ఆక్సిజన్ మూలక పరమాణు సంయోగం వలన క్లోరిక్ ఆమ్లం ఏర్పడినది.
పేర్లు | |
---|---|
ఇతర పేర్లు
Chloric(V) acid
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7790-93-4] |
SMILES | O=Cl(=O)O |
| |
ధర్మములు | |
HClO3 | |
మోలార్ ద్రవ్యరాశి | 84.45914 g mol−1 |
స్వరూపం | colourless solution |
సాంద్రత | 1 g/mL, solution (approximate) |
>40 g/100 ml (20 °C) | |
ఆమ్లత్వం (pKa) | ca. −1 |
నిర్మాణం | |
pyramidal | |
ప్రమాదాలు | |
ప్రధానమైన ప్రమాదాలు | Oxidant, Corrosive |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు
|
ammonium chlorate sodium chlorate potassium chlorate |
సంబంధిత సమ్మేళనాలు
|
hydrochloric acid hypochlorous acid chlorous acid perchloric acid |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
Infobox references | |
భౌతిక ధర్మాలు
మార్చుభౌతిక స్థితి
మార్చుక్లోరిక్ ఆమ్లం రంగులేని ద్రావణం[1]. క్లోరిక్ ఆమ్లం యొక్క అణుభారం 84.45914 గ్రాములు/మోల్−1.[2]
సాంద్రత
మార్చు25°Cసాధారణ ఉష్ణోగ్రత వద్ద సాంద్రత 1.2గ్రాం/మి.లీ.[3] ఒక మి.లీ ద్రావణం బరువు ఒక గ్రాము,అందాజుగా.
ద్రావణీయత
మార్చునీటిలో ద్రావణీయత >40గ్రాములు/100 మి.లీలో,20 °C) వద్ద.
అణుసౌష్టవం
మార్చుక్లోరిక్ ఆమ్లం అణువు పిరమిడ్ ఆకృతి అణుసౌష్టవం పొంది ఉంది.
రసాయన చర్యలు
మార్చుక్లోరిక్ ఆమ్లం తాపగతి శాస్త్రీయముగా (thermodynamically) అస్థిరమైనది. క్లోరిక్ ఆమ్లం 30% గాఢత వరకు చల్లని జలసంబంధమైన ద్రావణంలలో స్థిరత్వాన్ని కల్గి ఉంది. తగ్గించబడిన వత్తిడివద్ద, తగు జాగ్రత్తలు తీసుకొని, ద్రావణాన్నిబాష్పీకరణ (evaporation) కావించడం వలన 40% గాఢత ఉన్న క్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పతి చేయవచ్చును.40% గాఢత మించినచో,ఉష్ణోగ్రత 40 °C దాటినచో క్లోరిక్ ఆమ్లం ద్రావణం వియోగం చెంది,పలురకాల ఉత్పాదికలు ఏర్పడును.[1] ఉదాహరణకు:
- 8HClO3 → 4HClO4 + 2H2O + 2Cl2 + 3 O2
- 3HClO3 → HClO4 + H2O + 2 ClO2
ఉత్పత్తి
మార్చుసల్ఫ్యూరిక్ ఆమ్లంతో బేరియం క్లోరేట్ రసాయన చర్య వలన క్లోరిక్ ఆమ్లం, బేరియం సల్ఫేట్ ఏర్పడును. ఏర్పడిన ఉత్పాదిత మిశ్రమం నుండి అద్రావణ బేరియం సల్ఫేట్ ను తొలగించి, క్లోరిక్ ఆమ్లాన్ని వేరు చేయుదురు.
- Ba(ClO3)2 + H2SO4 → 2HClO3 + BaSO4
మరొక ఉత్పత్తి ప్రక్రియలో హైపోక్లోరస్ఆమ్లాన్ని వేడి చెయ్యడం వలన క్లోరిక్ ఆమ్లం, హైడ్రోజన్ క్లోరైడ్ ఏర్పడును.
- 3HClO → HClO3 + 2 HCl
ఇబ్బందులు
మార్చుక్లోరిక్ ఆమ్లం శక్తి వంతమైన ఆక్సీకరణ కారకం[1]. అందువల పలు సేంద్రియ పదార్థాలను,మండే స్వభావమున్న పదార్థాలతో సంపర్కంవలన, వాటిని మండించి కాల్చిబూడిదచేయును (deflagrate).
ఇవికూడా చూడండి
మార్చు- క్లోరిక్ ఆమ్లం
మూలాలు/ఆధారాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "chlorate". infoplease.com. Retrieved 2016-03-21.
- ↑ "CHLORIC ACID". chemspider.com. Retrieved 2016-03-21.
- ↑ "CHLORIC ACID". chemicalbook.com. Retrieved 2016-03-21.