క్వాటర్నరీ

25.8 లక్షల సంవత్సరాల నాడు మొదలైన సెనోజోయిక్ ఎరా లోని మూడవ, చివరి, వర్తమానంలో నడుస్తున్న పీరియడ్

క్వాటర్నరీ[4] అనేది అంతర్జాతీయ కమిషన్ ఆన్ స్ట్రాటిగ్రాఫీ (ICS) వారి భూవైజ్ఞానిక కాల ప్రమాణంలో సెనోజోయిక్ ఎరాకు చెందిన మూడు పీరియడ్‌లలో మూడోది, వర్తమానంలో జరుగుతున్నదీ.[5] ఇది నియోజీన్ పీరియడ్ తరువాతిది. 25.88 ± 0.05 లక్షల సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకూ విస్తరించి ఉంది. క్వాటర్నరీ పీరియడ్‌ను రెండు ఇపోక్‌లుగా విభజించారు.: ప్లైస్టోసీన్ (25.88 లక్షల సంవత్సరాల క్రితం నుండి 11,700 సంవత్సరాల క్రితం వరకు), హోలోసీన్ (11,700 సంవత్సరాల క్రితం నుండి నేటి వరకు). "అంత్య క్వాటర్నరీ" అనే అనధికారిక పదం గత 5 – 10 లక్షల సంవత్సరాల కాలాన్ని సూచిస్తుంది.[6]

క్వాటర్నరీ
2.58 – 0 Ma
A map of the world as it appeared during the Pleistocene epoch, c. 1 Ma
కాలక్రమణిక
Quaternary graphical timeline
view • discuss • edit
సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.
Subdivision of the Quaternary according to the ICS, as of 2021.[1][2]
Vertical axis scale: millions of years ago.
Etymology
Name formalityFormal
Usage information
Celestial bodyEarth
Regional usageGlobal (ICS)
Time scale(s) usedICS Time Scale
Definition
Chronological unitPeriod
Stratigraphic unitSystem
Time span formalityFormal
Lower boundary definition
Lower boundary GSSPMonte San Nicola Section, Gela, Sicily, Italy
37°08′49″N 14°12′13″E / 37.1469°N 14.2035°E / 37.1469; 14.2035
Lower GSSP ratified2009 (as base of Quaternary and Pleistocene)[3]
Upper boundary definitionPresent day
Upper boundary GSSPN/A
Upper GSSP ratifiedN/A
Atmospheric and climatic data
Mean atmospheric O2 contentc. 20.8 vol %
(104 % of modern)
Mean atmospheric CO2 contentc. 250 ppm
(1 times pre-industrial)
Mean surface temperaturec. 14 °C
(0 °C above modern)

మిలాన్కోవిచ్ చక్రాలతో సంబంధమున్న ఖండాంతర మంచు పలకల చక్రీయ పెరుగుదల తగ్గుదలలు, తత్సంబంధిత శీతోష్ణస్థితి, పర్యావరణ మార్పులు క్వాటర్నరీ కాలాన్ని నిర్వచిస్తాయి.[7][8]

పరిశోధన చరిత్ర

మార్చు

ఉత్తర ఇటలీ భూపొరలను వరుసగా నాలుగు భాగాలుగా లేదా "ఆర్డర్లు" గా విభజించవచ్చని 1759 లో జియోవన్నీ ఆర్డునో ప్రతిపాదించాడు.[9] "క్వాటర్నరీ" అనే పదాన్ని 1829 లో జూల్స్ డెస్నోయర్స్ ఫ్రాన్స్ లోని సీన్ నది బేసిన్ లోని అవక్షేపాల కోసం వాడాడు. ఇవి తృతీయ కాలపు శిలల కంటే వయసులో చిన్నవి.[10]

క్వాటర్నరీ పీరియడ్ నియోజీన్ పీరియడ్ తరువాత వస్తుంది. వర్తమాన కాలం క్వాటర్నరీ పీరియడ్ లోనిదే. ప్లైస్టోసీన్ గా వర్గీకరించిన హిమానీనదాల కాలం క్వాటర్నరీ లోనే ఉంది. ప్రస్తుత ఇంటర్‌గ్లేసియల్ కాలమైన హోలోసీన్‌ కూడా క్వాటర్నరీలో భాగమే.

సుమారు 26 లక్షల సంవత్సరాల క్రితం ఉత్తరార్ధగోళంలో హిమానీనదం మొదలైనపుడు క్వాటర్నరీ ప్రారంభమైంది. 2009 కి ముందు, ప్లైస్టోసీన్ 18.05 లక్షల సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు అని నిర్వచించారు. ప్లైస్టోసీన్ ప్రస్తుత నిర్వచనం ప్రకారం, 2009 కి ముందు, ప్లియోసిన్‌గా నిర్వచించిన దానిలో కొంత భాగం ఇప్పుడూ ప్లైస్టోసీన్‌లో చేరింది.

క్వాటర్నరీ వ్యవస్థలోని ఉపవిభాగాలు
సిస్టమ్/
పీరియడ్
సీరీస్/
ఇపోక్
స్టేజ్/
ఏజ్
వయసు (Ma)
క్వాటర్నరీ హోలోసీన్ మేఘాలయన్ 0 0.0042
నార్త్‌గ్రిప్పియన్ 0.0042 0.0082
గ్రీన్‌లాండియన్ 0.0082 0.0117
ప్లైస్టోసీన్ 'టారంటియన్' 0.0117 0.126
'చిబానియన్' 0.126 0.773
కాలబ్రియన్ 0.773 1.80
గెలాసియన్ 1.80 2.58
నియోజీన్ ప్లయోసీన్ పయాసెంజియన్ 2.58 3.60
Notes and references[1][2]
2019 నాటికి, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ స్ట్రాటిగ్రాఫీ ప్రకారం క్వాటర్నరీ పీరియడ్ లోని ఉపవిభాగం.[1]

హోలోసీన్‌లోని తేదీలు 2000 నాటి నుండి వెనక్కు లెక్కించినవి. (ఉదా.. గ్రీన్‌లాండియన్ 2000 నాటికి 11,700 స్ంవత్సరాల ముందు మొదలైంది). నార్త్‌గ్రిప్పియన్ ప్రారంభాన్ని2000 కు 8,236 సంవత్సరాల ముందు అని విధించారు.[2] మేఘాలయన్ 2000 కు 4,250 సంవత్సరాల ముందు మొదలౌతుంది.[1]

'చిబానియన్', 'టారంటియన్' లు అనధికారికమైనవి. వీటిని మరో అనధికారిక విభజనలైన 'మధ్య ప్లైస్టోసీన్', 'ఎగువ ప్లైస్టోసీన్' ఉప ఇపోక్‌ల స్థానాల్లో వాడారు.

ఐరోపా, ఉత్తర అమెరికాల్లో, హోలోసీన్‌ను బ్లిట్-సెర్నాండర్ కాలమానానికి చెందిన ప్రిబొరియల్, సబ్‌బొరియల్, సబ్‌అట్లాంటిక్ అనే స్టేజ్‌లుగా విభజించారు. ప్రాంతీయంగా అగువ ప్లైస్టోసీన్‌కు అనేక ఉపవిభాగాలున్నాయి; సాధారణంగా ఇవి స్థానికంగా గుర్తించిన శీత గ్లేసియల్, వెచ్చని గ్లేసియల్ పీరియడ్లను బట్టి జరిగాయి. చివరి గ్లేసియల్ పీరియడ్, చల్లని యంగర్ డ్రయాస్ సబ్‌స్టేజ్‌తో ముగుస్తుంది.

క్వాటర్నరీ స్ట్రాటిగ్రాఫర్లు ప్రాంతీయ ఉపవిభాగాలపై పనిచేశారు. 1970 ల నుండి, ఇంటర్నేషనల్ కమీషన్ ఆన్ స్ట్రాటిగ్రఫీ (ఐసిఎస్) జిఎస్ఎస్పి ఆధారంగా ఒకే భౌగోళిక కాలమానాన్ని చేయడానికి ప్రయత్నించింది. దీనిని అంతర్జాతీయంగా ఉపయోగించవచ్చు. పురాతన శీతోష్ణస్థితికి బదులుగా బయోస్ట్రాటిగ్రాఫీపై ఆధరపడి క్వాటర్నరీ ఉపవిభాగాలను నిర్వచించారు.

దీంతో, ఉత్తరార్ధగోళంలోని ప్రధాన హిమానీనదాలు ప్రారంభమైన చాలా కాలం తరువాత ప్లైస్టోసీన్ ప్రారంభం ఉందనే (18.05 లక్షల సవత్సరాల క్రితం) సమస్య ఎదురైంది. క్వాటర్నరీ అనే పేరును పూర్తిగా రద్దు చేయాలని ఐసిఎస్ ప్రతిపాదించింది. అయితే, ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ క్వాటర్నరీ రీసెర్చ్ (INQUA) కు ఆమోదయోగ్యం కాలేదు.

2009 లో, క్వాటర్నరీని సెనోజోయిక్ ఎరా లోని అత్యంత ఇటీవలి పీరియడ్‌గా 25.88 లక్షల సంవత్సరాల క్రితం వద్ద మొదలయ్యేలా ఉంచాలని నిర్ణయించారు. గతంలో నియోజీన్ పీరియడ్‌లో, ప్లయోసీన్ ఇపోక్‌లో భాగంగా ఉన్న గెలాసియన్ దశను కూడా ఇందులో చేర్చారు.[11]

ప్రపంచ పర్యావరణాన్ని మానవచర్యలు ప్రభావితం చేస్తున్న గత 200 సంవత్సరాల కాలాన్ని ఆంథ్రోపోసీన్ పేరుతో పిలవాలని ప్రతిపాదనలు వచ్చాయి.[12] ఐసిఎస్ దీన్ని అధికారికంగా గుర్తించలేదు గానీ, దీన్ని ఒక ఇపోక్ లేదా ఉప-పీరియడ్‌గా గుర్తించాలనే ప్రతిపాదనపై ఒక వర్కింగ్ గ్రూప్ పనిచేస్తోంది.

జియాలజీ

మార్చు

క్వాటర్నరీలో 26 లక్షల సంవత్సరాల పాటు మానవుల ఉనికి ఉంది. ఈ స్వల్ప కాల వ్యవధిలో, ప్లేట్ టెక్టోనిక్స్ కారణంగా ఖండాల స్థానాల్లో చాలా తక్కువ మార్పులు జరిగాయి.

క్వాటర్నరీ కాలపు భౌగోళిక విశేషాలు మునుపటి కాలాల కంటే చాలా వివరంగా లభ్యమౌతున్నాయి.

ఈ కాలంలో ప్రధానమైన భౌగోళిక మార్పుల్లో హిమనదీయ యుగాలలో బోస్ఫరస్ జలసంధి, స్కాగెరాక్ జలసంధి ఆవిర్భావం ఉన్నాయి. ఈ రెండింటి కారణంగా నల్ల సముద్రం, బాల్టిక్ సముద్రాలు మంచినీటిగా మారాయి. తరువాత, సముద్ర మట్టాలు పెరగడంతో వాటిని వరదలు ముంచెత్తి తిరిగి ఉప్పు నీటితో నిండాయి. ఇంగ్లీష్ ఛానల్ ఆవర్తనాల్లో (పీరియాడిక్‌గా) నిండడం, తద్వారా బ్రిటన్‌కు, యూరోపియన్ ప్రధాన భూభాగానికీ మధ్య భూ వంతెనను ఏర్పడడం; బేరింగ్ జలసంధి ఆవర్తనాల్లో మూసుకు పోవడం, తద్వారా ఆసియా, ఉత్తర అమెరికాల మధ్య భూవంతెన ఏర్పడడం; హిమనదీయ నీరు ముంచెత్తడంతో వాయవ్య అమెరికాలోని స్కాబ్లాండ్స్‌లో ఆవర్తనాల్లో మెరుపు వరదలు రావడం ఇతర ముఖ్యమైన భౌగోళిక మార్పులు.

శీతోష్ణస్థితి

మార్చు

ఖండాంతర హిమానీనదాలు ధ్రువాల నుండి 40 డిగ్రీల అక్షాంశం వరకు వ్యాపించడంతో హిమానీనదాలు ఆవర్తనాల్లో ఏర్పడడం క్వాటర్నరీ కాలపు శీతోష్ణస్థితి లక్షణంగా ఉంది. ప్లైస్టోసీన్ ఇపోక్ చివర్లో ఉత్తర ప్రాంతాల లోని పెద్ద క్షీరదాలు అంతరించిపోయాయి. కోరపళ్ళ పిల్లులు, మామత్‌లు, మాస్టోడాన్స్, గ్లైప్టోడాంట్స్ మొదలైన అనేక జీవులు ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయాయి. గుర్రాలు, ఒంటెలు, అమెరికన్ చిరుతలతో సహా ఇతర జీవులు ఉత్తర అమెరికాలో అంతరించిపోయాయి.[13][14]

క్వాటర్నరీ గ్లేసియేషను

మార్చు

క్వాటర్నరీ మంచుయుగంలో గ్లేసియేషను పదేపదే జరిగింది. క్వాటర్నరీ మంచు యుగంలో అనే మాటను 1839 లో షింపర్ కాయించాడు. ఈ మంచుయుగం 25.8 లక్షల సంవత్సరాల క్రితం క్వార్టర్నరీ పీరియడ్‌తో మొదలై, నేటికీ కొనసాగుతోంది.

చివరి గ్లేసియల్ కాలం

మార్చు
 
చివరి హిమనదీయ గరిష్ఠం సమయంలో భూమి. చిత్రకారుడి ఊహ.

1821 లో, స్విస్ ఇంజనీర్ ఇగ్నాజ్ వెనెట్జ్ ఒక కథనాన్ని ప్రచురించాడు. దీనిలో ఆల్ప్స్ నుండి గణనీయమైన దూరంలో హిమానీనదం ఉన్న ఆనవాళ్ళు ఉండాలని ఆయన సూచించాడు. మొదట్లో ఈ ఆలోచనను మరొక స్విస్ శాస్త్రవేత్త లూయిస్ అగస్సిజ్ ఖండించాడు. అయితే, అది తప్పని అతడు నిరూపించబోతే, ఆ పరికల్పన సరైనదేనని తేలింది. ఒక సంవత్సరం తరువాత, అగస్సిజ్, దీర్ఘకాలిక ప్రభావాలను కలిగిన గొప్ప హిమనదీయ కాలపు పరికల్పనను లేవనెత్తాడు. ఈ ఆలోచనతో అతనికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. హిమనదీయ సిద్ధాంతాన్ని స్థాపనకూ దారితీసింది.

కాలక్రమేణా, భూశాస్త్రం అభివృద్ధి చెందడంతో, అనేకసార్లు హిమానీనదాల పురోగమన, తిరోగమనాలు జరిగాయని, భూమిపై గతకాలపు ఉష్ణోగ్రతలు నేటి కంటే చాలా భిన్నంగా ఉన్నాయని నిరూపితమైంది. ముఖ్యంగా, సౌర వికిరణంలోని వైవిధ్యాల వలన ఏర్పడే మిలాన్కోవిచ్ చక్రాలు భూమి వాతావరణాన్ని నియంత్రించే ప్రాథమిక కారకాలు అని తెలిసింది.

ఈ కాలంలో, ఉత్తర అమెరికా, ఐరోపాల్లో చాలావరకు, దక్షిణ అమెరికా, ఆసియాలోని కొన్ని భాగాల్లోను, అంటార్కిటికా అంతటా హిమానీనదాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి, క్షీణించాయి. గ్రేట్ లేక్స్ ఏర్పడ్డాయి. ఉత్తర అమెరికా, యురేషియాల్లో మంచు కప్పని ప్రాంతాల్లో పెద్ద క్షీరదాలు వర్ధిల్లాయి. సుమారు 11,700 సంవత్సరాల క్రితం హిమనదీయ కాలం ముగిసినప్పుడు ఈ క్షీరదాలు అంతరించిపోయాయి. ఆధునిక మానవులు సుమారు 3,15,000 సంవత్సరాల క్రితం పరిణామం చెందారు. క్వాటర్నరీ కాలంలో, క్షీరదాలు, పుష్పించే మొక్కలు, కీటకాలు భూమిపై ఆధిపత్యం వహించాయి.  

ఇవి కూడా చూడండి

మార్చు
  • క్వాటర్నరీ అగ్నిపర్వత విస్ఫోటనాల జాబితా
  • క్వాటర్నరీ విలుప్త సంఘటన

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 Cohen, K. M.; Finney, S. C.; Gibbard, P. L.; Fan, J.-X. (January 2020). "International Chronostratigraphic Chart" (PDF). International Commission on Stratigraphy. Retrieved 23 February 2020. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "ICC" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. 2.0 2.1 2.2 Mike Walker; et al. (December 2018). "Formal ratification of the subdivision of the Holocene Series/Epoch (Quaternary System/Period)" (PDF). Episodes. 41 (4). Subcommission on Quaternary Stratigraphy (SQS): 213–223. doi:10.18814/epiiugs/2018/018016. Retrieved 11 November 2019. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "FRS" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. Gibbard, Philip; Head, Martin (September 2010). "The newly-ratified definition of the Quaternary System/Period and redefinition of the Pleistocene Series/Epoch, and comparison of proposals advanced prior to formal ratification" (PDF). Episodes. 33 (3): 152–158. doi:10.18814/epiiugs/2010/v33i3/002. Retrieved 8 December 2020.
  4. https://www.dictionary.com/browse/quaternary
  5. "International Chronostratigraphic Chart 2013" (PDF). ICS. Retrieved 15 June 2014.
  6. Earthquake Glossary - Late Quaternary U.S. Geological Survey
  7. Denton, G.H.; Anderson, R.F.; Toggweiler, J.R.; Edwards, R.L.; Schaefer, J.M.; Putnam, A.E. (2010). "The Last Glacial Termination". Science. 328 (5986): 1652–1656. CiteSeerX 10.1.1.1018.5454. doi:10.1126/science.1184119. PMID 20576882.
  8. Lowe, J.J.; Walker, M.J.C. (1997). Reconstructing Quaternary Environments. Routledge. ISBN 978-0582101661.
  9. See:
  10. Desnoyers, J. (1829). "Observations sur un ensemble de dépôts marins plus récents que les terrains tertiaires du bassin de la Seine, et constituant une formation géologique distincte; précédées d'un aperçu de la nonsimultanéité des bassins tertiares" [Observations on a set of marine deposits [that are] more recent than the tertiary terrains of the Seine basin and [that] constitute a distinct geological formation; preceded by an outline of the non-simultaneity of tertiary basins]. Annales des Sciences Naturelles (in French). 16: 171–214, 402–491.{{cite journal}}: CS1 maint: unrecognized language (link) From p. 193: "Ce que je désirerais … dont il faut également les distinguer." (What I would desire to prove above all is that the series of tertiary deposits continued – and even began in the more recent basins – for a long time, perhaps after that of the Seine had been completely filled, and that these later formations – Quaternary (1), so to say – should not retain the name of alluvial deposits any more than the true and ancient tertiary deposits, from which they must also be distinguished.) However, on the very same page, Desnoyers abandoned the use of the term "quaternary" because the distinction between quaternary and tertiary deposits wasn't clear. From p. 193: "La crainte de voir mal comprise … que ceux du bassin de la Seine." (The fear of seeing my opinion in this regard be misunderstood or exaggerated, has made me abandon the word "quaternary", which at first I had wanted to apply to all deposits more recent than those of the Seine basin.)
  11. See the 2009 version of the ICS geologic time scale
  12. Zalasiewicz, J.; Williams, M.; Haywood, A.; Ellis, M. (2011). "The Anthropocene: a new epoch of geological time?" (PDF). Philosophical Transactions of the Royal Society A. 369 (1938): 835–841. doi:10.1098/rsta.2010.0339. PMID 21282149.
  13. Haynes. "Stanford Camelops" (PDF). Archived from the original (PDF) on 2014-03-09. Retrieved 2019-12-03.
  14. "Extinct American Cheetah Fact Sheet". Archived from the original on 2016-03-04. Retrieved 2019-12-03.

బయటి లింకులు

మార్చు