నల్ల సముద్రం

ఐరోపా, ఆసియా ఖండాల మధ్యనున్న సముద్రం

నల్ల సముద్రం అట్లాంటిక్ మహాసముద్రంలో భాగమైన ఉపాంత మధ్యధరా సముద్రం. ఇది ఐరోపా, ఆసియా లకు మధ్య ఉంది. ఆగ్నేయ ఐరోపాలోని బాల్కన్‌లకు తూర్పున, తూర్పు ఐరోపా మైదానానికి, తూర్పు ఐరోపాలోని ఉత్తర కాకసస్‌కూ దక్షిణాన ఉంది. పశ్చిమాసియాలోని అనటోలియాకు, దక్షిణ కాకసస్‌కూ ఉత్తర పశ్చిమాన ఉంది. నల్ల సముద్రంలో కలిసే ప్రధానమైన నదులు డాన్యూబ్, ద్నీపర్, డాన్. ఆరు దేశాలు ఈ సముద్ర తీరాన ఉండగా, దాని పరీవాహక ప్రాంతంలో ఐరోపాలోని 24 దేశాల భాగాలు ఉన్నాయి. [2]

నల్ల సముద్రం
Black Sea map.png
ప్రపంచ పటంలో నల్ల సముద్రం
Map of the Black Sea with bathymetry and surrounding relief.svg
నల్ల సముద్రం మ్యాపు, పరిసరాల రిలీఫ్‌తో
ప్రదేశంఐరోపా, పశ్చిమాసియా
అక్షాంశ,రేఖాంశాలు44°N 35°E / 44°N 35°E / 44; 35Coordinates: 44°N 35°E / 44°N 35°E / 44; 35
రకంసముద్రం
సరస్సులోకి ప్రవాహండాన్యుబ్, ద్నీపర్, డాన్, ద్నీస్టర్, కుబన్, బాస్పోరస్ (లోతైన ప్రవాహం)
వెలుపలికి ప్రవాహంBosporus
ప్రవహించే దేశాలుబల్గేరియా, జార్జియా, రొమేనియా, రష్యా, టర్కీ, ఉక్రెయిన్
పరీవాహక ప్రాంతంలో ఇంకా అనేక దేశాలున్నాయి
గరిష్ట పొడవు1,175 కి.మీ. (730 మై.)
ఉపరితల వైశాల్యం436,402 కి.మీ2 (168,500 చ. మై.)[1]
సరాసరి లోతు1,253 మీ. (4,111 అ.)
గరిష్ట లోతు2,212 మీ. (7,257 అ.)
547,000 కి.మీ3 (131,200 cu mi)

నల్ల సముద్రం విస్తీర్ణం 436,400 కి.మీ2 (4.697×1012 sq ft) (అజోవ్ సముద్రాన్ని కలపకుండా), [3] గరిష్ట లోతు 2,212 మీ. (7,257 అ.), [4] ఘనపరిమాణం 547,000 కి.మీ3 (1.93×1016 ఘ.అ.). దాని తీరప్రాంతాలు చాలా ఏటవాలుగా మెరకకు వెళ్తాయి. దక్షిణాన ఉన్న పాంటిక్ పర్వతాలు, తూర్పున కాకసస్ పర్వతాలు, మధ్య ఉత్తరాన క్రిమియన్ పర్వతాలు ఈ మెరక స్థలాల్లో ఉన్నాయి. పశ్చిమాన తీరం వెంట సాధారణంగా చిన్న వరద మైదానాలుంటాయి. అత్యంత పొడవైన తూర్పు-పశ్చిమ తీరం నిడివి దాదాపు 1,175 కి.మీ. (3,855,000 అ.) ఉంటుంది. ఒడెస్సా, వర్నా, సంసున్, సోచి, సెవాస్టోపోల్, కాన్స్టాన్టా, ట్రాబ్జోన్, నోవోరోసిస్క్, బుర్గాస్, బటుమి వంటి ముఖ్యమైన నగరాలు నల్ల సముద్ర తీరం వెంబడి ఉన్నాయి.

నల్ల సముద్రం సరిహద్దుల్లో బల్గేరియా, జార్జియా, రొమేనియా, రష్యా, టర్కీ, ఉక్రెయిన్ దేశాలున్నాయి. ఈ సముద్త్రంలో నీటి సమతుల్యత పాజిటివుగా ఉంటుంది. బాస్పోరస్, డార్డనెల్లెస్ ల ద్వారా ఏజియన్ సముద్రం లోకి వచ్చే వార్షిక నికర ప్రవాహం 300 కి.మీ3 (1.1×1013 ఘ.అ.). బాస్పోరస్, డార్డనెల్లెస్ లకు నల్ల సముద్రానికీ మధ్య నీటి ప్రవాహం ఇరు దిశల్లోనూ ఉంటుంది. సాంద్రంగా ఉండే ఉప్పునీరు ఏజియన్ నుండి నల్ల సముద్రం లోకి ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం పైన తక్కువ సాంద్రత ఉండే తక్కువ ఉప్పగా ఉండే నీరు నల్ల సముద్రం నుండి ఏజియన్ లోకి ప్రవహిస్తుంది. దీని వలన లోతుల్లో నీరు నిలవ ఉండి పోయి మిగతా నీళ్ళతో కలవకుండా ఉండిపోయి, ఒక శాశ్వతమైన నీటి అరను సృష్టిస్తుంది. దాంతో దీనిలో ఆక్సిజన్ తగ్గిపోయి అనాక్సిక్‌గా (ఆక్సిజన్ లేమి) అవుతుంది. ఈ అనాక్సిక్ పొర వలన, నల్ల సముద్రంలో మునిగిపోయిన పురాతన నౌకలు కృశించి పోకుండా భద్రంగా ఉంటాయి.

నల్ల సముద్రం లోని నీరు టర్కిష్ జలసంధి, ఏజియన్ సముద్రం గుండా మధ్యధరా సముద్రంలోకి ప్రవహిస్తుంది. బాస్పోరస్ జలసంధి, నల్ల సముద్రాన్ని మర్మారా సముద్రానికి కలుపుతుంది. అక్కడి నుండి ఇది డార్డనెల్లెస్ జలసంధి ద్వారా ఏజియన్ సముద్రానికి కలుస్తుంది. ఉత్తరాన, నల్ల సముద్రం కెర్చ్ జలసంధి ద్వారా అజోవ్ సముద్రంతో కలుస్తుంది.

భౌగోళిక కాలావధుల్లో నల్ల సముద్రం లోని నీటి స్థాయి గణనీయంగా మారుతూ ఉంటుంది. బేసిన్‌లోని నీటి మట్టంలో ఈ వైవిధ్యాల కారణంగా, చుట్టుపక్కల ఉన్న షెల్ఫ్, అనుబంధిత అప్రాన్‌లు కొన్నిసార్లు నీరు తగ్గిపోయి పొడిగా ఉండేవి. కొన్ని క్లిష్టమైన నీటి మట్టాల వద్ద, చుట్టుపక్కల నీటి వనరులతో కనెక్షన్లు ఏర్పడతాయి. ఇలాంటి అనుసంధాన మార్గాలలో అత్యంత చురుకైన టర్కిష్ జలసంధి ద్వారానే నల్ల సముద్రం ప్రపంచ మహాసముద్రంలో కలుస్తుంది. ఈ నీటి లింకు లేని భౌగోళిక కాలాలలో, నల్ల సముద్రం ఒక భూపరివేష్ఠిత బేసిన్‌గా ఉండేది. ఆ సమయాల్లో ఇది, ఇప్పుడు కాస్పియన్ సముద్రం ఉన్నట్లుగా, ప్రపంచ సముద్ర వ్యవస్థతో సంబంధం లేకుండా విడిపోయి ఉండేది. ప్రస్తుతం, నల్ల సముద్రం నీటి మట్టం సాపేక్షంగా ఎక్కువగా ఉండడంతో, మధ్యధరా సముద్రంతో నీరు మార్పిడి జరుగుతోంది. నల్ల సముద్రపు సముద్రాంతర్భాగ నది అనేది, బాస్పోరస్ జలసంధి గుండా నల్ల సముద్రపు సముద్రగర్భం వెంబడి ప్రవహించే ఉప్పునీటి ప్రవాహం. ఇలాంటి ప్రవాహాల్లో మొదటిసారిగా కనుగొన్నది దీనినే.

వివిధ దేశాల్లో, వివిధ భాషల్లో ఈ సముద్రపు పేర్లు సాధారణంగా "బ్లాక్ సీ" అనే ఇంగ్లీషు పేరుకు సమానార్థకం లోనే ఉంటాయి.

ఓర్డు వద్ద నల్ల సముద్రం తీరం

తీరప్రాంతం, ప్రత్యేక ఆర్థిక మండలాలుసవరించు

తీరప్రాంత పొడవు, ప్రత్యేక ఆర్థిక మండలాల ప్రాంతం
దేశం తీరరేఖ పొడవు (కిమీ) ప్రత్యేక ఆర్థిక మండలాల ప్రాంతం (కిమీ 2 ) [5]
  Turkey 1,329 1,72,484
  Ukraine 2,782 1,32,414
  Russia 800 67,351
  Bulgaria 354 35,132
  Georgia 310 22,947
  Romania 225 29,756
మొత్తం 5,800 4,60,084

పరీవాహక ప్రాంతంసవరించు

నల్ల సముద్రంలోకి ప్రవహించే అతిపెద్ద నదులు :

 

  1. డాన్యూబ్
  2. ద్నీపర్
  3. డాన్
  4. డైనెస్టర్
  5. కిజిలిర్మాక్
  6. కుబన్
  7. సకార్య
  8. దక్షిణ బగ్
  9. కోరుహ్
  10. యెసిలిర్మాక్
  11. రియోని
  12. యేయా
  13. మియస్
  14. కామ్చియా
  15. ఎంగూరి
  16. కాల్మియస్
  17. మోలోచ్నా
  18. తైలిహుల్
  19. వెలికీ కుయల్నిక్
  20. వెలెకా
  21. రెజోవో
  22. కోడోరి
  23. జైబ్
  24. సుప్సా
  25. జిమ్టా

ఈ నదులు, వాటి ఉపనదుల పరీవాహక ప్రాంతం 2-మిలియన్ కి.మీ2 (0.77-మిలియన్ చ. మై.). ఈ ప్రాంతం కింది 24 దేశాల్లో ఉంది: [6] [7] [8] [9]

 

నల్ల సముద్రంలో బల్గేరియా, రొమేనియా, టర్కీ, ఉక్రెయిన్‌లకు చెందిన ద్వీపాలున్నాయి.

శీతోష్ణస్థితిసవరించు

 
ఒడెస్సా గల్ఫ్‌లో మంచు

ఉత్తర అట్లాంటిక్ డోలనం, ఉత్తర అట్లాంటిక్, మధ్య-అక్షాంశ వాయు ద్రవ్యరాశి మధ్య పరస్పర చర్య ఫలితంగా ఏర్పడే శీతోష్ణస్థితి మెకానిజాలు నల్ల సముద్రం ప్రాంతంలో స్వల్పకాలిక శీతోష్ణస్థితిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఉత్తర అట్లాంటిక్ ఆసిలేషనుకు కారణమయ్యే ఖచ్చితమైన యంత్రాంగాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ, పశ్చిమ ఐరోపాలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులు మధ్య ఐరోపా, యురేషియాకు చేరే వేడి, అవపాతాలను చేరవేస్తాయని, శీతాకాలపు తుఫానుల ఏర్పాటును నియంత్రిస్తాయని భావిస్తున్నారు. అవపాతం ఇన్‌పుట్‌లు మధ్యధరా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను (SSTలు) ఇవి ప్రభావితం చేస్తాయి.

ఈ వ్యవస్థల సాపేక్ష బలం వలన శీతాకాలంలో ఉత్తర ప్రాంతాల నుండి వచ్చే చల్లని గాలి పరిమాణాన్ని కూడా పరిమితులు ఏర్పడతాయి. ఇతర ప్రభావితం చేసే కారకాలు ప్రాంతీయ స్థలాకృతిని కలిగి ఉంటాయి, ఎందుకంటే మధ్యధరా సముద్రం నుండి వచ్చే డిప్రెషన్‌లు, తుఫాను వ్యవస్థలు బాస్పోరస్ చుట్టూ ఉన్న లోతట్టు ప్రాంతాల గుండా వెళతాయి. పోంటిక్, కాకసస్ పర్వత శ్రేణులు వేవ్‌గైడ్‌లుగా పనిచేసి, ఈ ప్రాంతం గుండా వచ్చే తుఫానుల వేగాన్ని, మార్గాలనూ పరిమితం చేస్తాయి. [10]

చరిత్రసవరించు

హోలోసీన్ సమయంలో మధ్యధరా కనెక్షన్సవరించు

 
బాస్పోరస్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి తీసిన చిత్రం
 
డార్డనెల్లెస్ మ్యాపు

నల్ల సముద్రం డార్డనెల్లెస్, బాస్పోరస్ అనే రెండు లోతులేని జలసంధుల గొలుసు ద్వారా ప్రపంచ మహాసముద్రంతో అనుసంధానించబడి ఉంది. డార్డనెల్లెస్ 55 మీ. (180 అ.) లోతు ఉండగా, బాస్పోరస్ 36 మీ. (118 అ.) మాత్రమే లోతు ఉంటుంది. చివరి మంచు యుగం మధ్యలో, సముద్ర మట్టాలు ఇప్పటి కంటే 100 మీ. (330 అ.) కంటే తక్కువగా ఉండేవి అనే నేపథ్యంలో ఈ జలసంధుల లోతులను పరిశీలిస్తే ఇవి ఎంత తక్కువ లోతులో ఉండేవో, ఆ మంచుయుగ కాలంలో ఈ జలసంధులు పూర్తిగా ఎండిపోయి నీటి లింకు తెగిపోయి ఉండేదని అర్థమౌతుంది.

హిమనదీయ అనంతర కాలంలో ఏదో ఒక సమయంలో నల్ల సముద్రంలో నీటి మట్టాలు గణనీయంగా తక్కువగా ఉండేవని చెప్పే ఆధారాలు ఉన్నాయి. చివరి హిమానీనదం సమయంలోను, ఆ తరువాత కొంత కాలం పాటూ నల్ల సముద్రం భూపరివేష్టిత మంచినీటి సరస్సుగా (కనీసం పై పొరలలో) ఉండేదని కొంతమంది పరిశోధకులు సిద్ధాంతీకరించారు.

చివరి హిమనదీయ కాలం తర్వాత, నల్ల సముద్రం, ఏజియన్ సముద్రం లలో నీటి స్థాయిలు విడివిడిగా పెరిగాయి. అవి నీటిని మార్పిడి చేసుకునేంత ఎత్తుకు చేరేవరకు అలాగే పెరిగాయి. ఇది ఎప్పడు జరిగిందని చెప్పే ఖచ్చితమైన కాలక్రమం ఇప్పటికీ చర్చనీయాంశం గానే ఉంది. ఒక సంభావ్యత ఏమిటంటే, నల్ల సముద్రం మొదట నిండాక, పొర్లిన మంచినీరు బాస్పోరస్ గుండా ప్రవహించి చివరికి మధ్యధరా సముద్రంలోకి కలిసి ఉంటుంది. విలియం ర్యాన్, వాల్టర్ పిట్‌మాన్, పెట్కో డిమిత్రోవ్‌లు ముందుకు తెచ్చిన "నల్ల సముద్రం వరద పరికల్పన " వంటి విపత్తు పరికల్పనలు కూడా ఉన్నాయి.

వరద పరికల్పనసవరించు

క్రీ.పూ. 5600 లో మధ్యధరా సముద్రం నుండి నీరు బాస్పోరస్ జలసంధిలో ఒక కట్టను చీల్చుకుని నల్ల సముద్రం లోకి ప్రవహించి నల్ల సముద్రాన్ని వరదలు ముంచెత్తాయి అనే ఊహయే నల్ల సముద్ర వరదల పరికల్పన. దీన్ని అకడెమిక్ జర్నల్‌లో ప్రచురించటానికి కొంత కాలం ముందే, 1996 డిసెంబరులో, ది న్యూ యార్క్ టైమ్స్ దీనిని ప్రచురించినప్పుడు, ఈ పరికల్పనకు ప్రాచుర్యం లభించింది. [11] వివరించిన సంఘటనల క్రమం జరిగిందని అంగీకరించినప్పటికీ, సంఘటనల ఆకస్మికత, జరిగిన సమయం, పరిమాణం వగైరాలు చర్చనీయాంశంగా ఉన్నాయి. ఈ పరికల్పన ప్రాచుర్యం లోకి వచ్చాక కొంతమంది, చరిత్రపూర్వం జరిగాయని చెప్పే కొన్ని పౌరాణిక వరద కథలకు ఈ విపత్తును అనుసంధానించడానికి దారితీసింది. [12]

నమోదైన చరిత్రసవరించు

నల్ల సముద్రం పురాతన ప్రపంచపు కూడలిలో రద్దీగా ఉండే జలమార్గం: పశ్చిమాన బాల్కన్లు, ఉత్తరాన ఐరోపా స్టెప్పీలు, తూర్పున కాకసస్, మధ్య ఆసియా, దక్షిణాన ఆసియా మైనర్, మెసొపొటేమియా, నైరుతిలో గ్రీస్ లకు కూడలి ఇది.

నల్ల సముద్రానికి తూర్పు చివరన ఉన్న భూమి అయిన కొల్చిస్‌ను (ప్రస్తుత జార్జియాలో ఉంది), పురాతన గ్రీకులు ప్రపంచానికి అంచు అని భావించేవారు.

నల్ల సముద్రానికి ఉత్తరాన ఉన్న స్టెప్పీలు, ప్రోటో-ఇండో-యూరోపియన్ భాష (PIE) మాట్లాడేవారికి అసలు మాతృభూమి (Urheimat) అని మరిజా గింబుటాస్ వంటి పండితులు భావించారు. మరికొందరు, మరింత తూర్పున, కాస్పియన్ సముద్రం వైపున ఆ మాతృభూమి ఉందని ప్రతిపాదించారు. మరికొందరు అనటోలియా అని అన్నారు.

నల్ల సముద్రంలో గ్రీకుల ఉనికి కనీసం సా.పూ. 9వ శతాబ్దం నాటికి దాని దక్షిణ తీరం వెంబడి చెల్లాచెదురుగా ఉన్న వలసలతో ప్రారంభమైంది. నల్ల సముద్రం లోతట్టు ప్రాంతాలలో పండే ధాన్యం వ్యాపారులను వలసవాదులనూ ఆకర్షించింది.   సా.పూ. 500 నాటికి, నల్ల సముద్రం చుట్టూ శాశ్వత గ్రీకు సమాజాలు ఏర్పడ్డాయి. వారి లాభదాయకమైన వాణిజ్య-నెట్‌వర్కు నల్ల సముద్రాన్ని విస్తృతమైన మధ్యధరాకి అనుసంధానించింది. గ్రీకు కాలనీలు సాధారణంగా వారి వ్యవస్థాపక పోలిస్‌తో చాలా సన్నిహిత సాంస్కృతిక సంబంధాలను కొనసాగిస్తున్నప్పటికీ, వారి స్వంత నల్ల సముద్రపు గ్రీకు సంస్కృతిని అభివృద్ధి చేయడం ప్రారంభించాయి. దీనినే నేడు పోంటిక్ అని పిలుస్తారు. నల్ల సముద్రపు గ్రీకుల తీరప్రాంత సమాజాలు శతాబ్దాలుగా గ్రీకు ప్రపంచంలో ప్రముఖ భాగంగా ఉంటూ వచ్చాయి. మిత్రిడేట్స్ ఆఫ్ పొంటస్, రోమ్, కాన్స్టాంటినోపుల్ రాజ్యాలు క్రిమియన్ భూభాగాలను చేర్చుకుని నల్ల సముద్రం వరకు విస్తరించాయి.

1479లో రిపబ్లిక్ ఆఫ్ జెనోవా క్రిమియన్ ద్వీపకల్పంపై నియంత్రణను కోల్పోయిన తరువాత ఐదేళ్లలో, నల్ల సముద్రం పూర్తిగా ఒట్టోమన్ నావికాదళపు సరస్సుగా మారిపోయింది. ఆ తర్వాత నల్ల సముద్ర జలాల్లో ప్రయాణించినవి వెనిస్ పాత ప్రత్యర్థి రగుసాకు చెందిన నౌకలు మాత్రమే. నల్ల సముద్రం క్రిమియా, ఒట్టోమన్ అనటోలియా మధ్య బానిసల వాణిజ్య మార్గంగా మారింది. 1783 నుండి ఫ్రెంచ్ విప్లవం కారణంగా 1789లో ఎగుమతి నియంత్రణలను సడలించే వరకూ రష్యా నావికాదళం ఈ పరిమితిని సవాలు చేసింది. [13] [14] [15]

మొదటి ప్రపంచ యుద్ధంలో (1914-1918) నల్ల సముద్రం ముఖ్యమైన నౌకా యుద్ధ రంగం. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1941 - 1945 మధ్య నావికా, భూ యుద్ధాలను చూసింది. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయడంతో ఇది మరోసారి పెద్ద యుద్ధభూమిగా మారింది. రష్యన్ నేవీకి చెందిన మోస్క్వా, మజోర్వా అనే రెండు పెద్ద నౌకలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. [16] ఇతర దేశాలకు చెందిన కార్గో షిప్‌లను రష్యన్లు ధ్వంసం చేశారు. [17]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Black Sea NGO Network | Our Black Sea". www.bsnn.org.
  2. ""Black Sea Geography, Oceanography, Ecology, History"". Archived from the original on 2018-02-22. Retrieved 2022-05-31.
  3. Surface area—"Black Sea Geography". University of Delaware College of Marine Studies. 2003. Retrieved April 3, 2014.
  4. Maximum depth—"Europa – Gateway of the European Union website". Environment and Enlargement – The Black Sea: Facts and Figures. Archived from the original on November 14, 2008.
  5. "Sea Around Us | Fisheries, Ecosystems and Biodiversity". University of British Columbia.
  6. "Marine Litter Report". www.blacksea-commission.org.
  7. "Black Sea". Archived from the original on 2020-09-07. Retrieved 2022-05-31.
  8. "UN Atlas of the Oceans: Subtopic". www.oceansatlas.org.
  9. "The Black Sea Basin".
  10. Brody, L. R., Nestor, M.J.R. (1980).
  11. Wilford, John Noble (December 17, 1996). "Geologists Link Black Sea Deluge to Farming's Rise". The New York Times. Retrieved June 17, 2013.
  12. Dimitrov P., D. Dimitrov. 2004.
  13. David Nicolle (1989). The Venetian Empire 1200–1670. Osprey Publishing. p. 17. ISBN 978-0-85045-899-2.
  14. Bruce McGowan. Economic Life in Ottoman Europe: Taxation, Trade and the Struggle for Land, 1600–1800, Studies in Modern Capitalism. p. 134. ISBN 978-0-521-13536-8.
  15. Compare: Bruce William McGowan. Economic Life in Ottoman Europe: Taxation, Trade and the Struggle for Land, 1600–1800. Cambridge University Press. p. 23. ISBN 9780521242080.
  16. "Another Russian Warship is Burning in the Black Sea". Forbes.
  17. "Ukraine: Estonian cargo ship sinks after blast in Black Sea". BBC News. March 3, 2022.