హోలోసీన్
క్వాటర్నరీ వ్యవస్థలోని ఉపవిభాగాలు | ||||
---|---|---|---|---|
సిస్టమ్/ పీరియడ్ |
సీరీస్/ ఇపోక్ |
స్టేజ్/ ఏజ్ |
వయసు (Ma) | |
క్వాటర్నరీ | హోలోసీన్ | మేఘాలయన్ | 0 | 0.0042 |
నార్త్‌గ్రిప్పియన్ | 0.0042 | 0.0082 | ||
గ్రీన్‌లాండియన్ | 0.0082 | 0.0117 | ||
ప్లైస్టోసీన్ | 'టారంటియన్' | 0.0117 | 0.126 | |
'చిబానియన్' | 0.126 | 0.773 | ||
కాలబ్రియన్ | 0.773 | 1.80 | ||
గెలాసియన్ | 1.80 | 2.58 | ||
నియోజీన్ | ప్లయోసీన్ | పయాసెంజియన్ | 2.58 | 3.60 |
2019 నాటికి, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ స్ట్రాటిగ్రాఫీ ప్రకారం క్వాటర్నరీ పీరియడ్ లోని ఉపవిభాగం.[1]
హోలోసీన్‌లోని తేదీలు 2000 నాటి నుండి వెనక్కు లెక్కించినవి. (ఉదా.. గ్రీన్‌లాండియన్ 2000 నాటికి 11,700 స్ంవత్సరాల ముందు మొదలైంది). నార్త్‌గ్రిప్పియన్ ప్రారంభాన్ని2000 కు 8,236 సంవత్సరాల ముందు అని విధించారు.[2] మేఘాలయన్ 2000 కు 4,250 సంవత్సరాల ముందు మొదలౌతుంది.[1] 'చిబానియన్', 'టారంటియన్' లు అనధికారికమైనవి. వీటిని మరో అనధికారిక విభజనలైన 'మధ్య ప్లైస్టోసీన్', 'ఎగువ ప్లైస్టోసీన్' ఉప ఇపోక్‌ల స్థానాల్లో వాడారు. ఐరోపా, ఉత్తర అమెరికాల్లో, హోలోసీన్‌ను బ్లిట్-సెర్నాండర్ కాలమానానికి చెందిన ప్రిబొరియల్, సబ్‌బొరియల్, సబ్‌అట్లాంటిక్ అనే స్టేజ్‌లుగా విభజించారు. ప్రాంతీయంగా అగువ ప్లైస్టోసీన్‌కు అనేక ఉపవిభాగాలున్నాయి; సాధారణంగా ఇవి స్థానికంగా గుర్తించిన శీత గ్లేసియల్, వెచ్చని గ్లేసియల్ పీరియడ్లను బట్టి జరిగాయి. చివరి గ్లేసియల్ పీరియడ్, చల్లని యంగర్ డ్రయాస్ సబ్‌స్టేజ్‌తో ముగుస్తుంది. | ||||
భూవైజ్ఞానిక కాలమానంలో ప్రస్తుతం నడుస్తున్న ఇపోక్ పేరు హోలోసీన్. ఇది సుమారు 11,650 సంవత్సరాల క్రితం, చివరి గ్లేసియల్ కాలం ముగిసాక మొదలైంది.[3] హోలోసీన్‌ను, దీనికి ముందరి ప్లైస్టోసీన్‌నూ [4] కలిపి క్వాటర్నరీ పీరియడ్ అంటారు. ప్రస్తుతం గడుస్తున్న వెచ్చని కాలం (దీన్ని MIS 1 అని అంటారు) హోలోసీన్‌కు ఒక ప్రముఖమైన గుర్తు. ఇది ప్లైస్టోసీన్ ఇపోక్ లోని అంతర గ్లేసియల్ కాలమేనని కొందరు భావిస్తారు.[5]
ప్రపంచవ్యాప్తంగా మానవ జాతి వేగవంతమైన విస్తరణ, పెరుగుదల, అది చూపించిన ప్రభావం హోలోసీన్‌కు గుర్తులు. యావత్తు లిఖిత చరిత్ర, సాంకేతిక విప్లవాలు, ప్రధాన నాగరికతల అభివృద్ధి, ప్రస్తుతం పట్టణ జీవనం అన్నీ ఈ కాలంలోని భాగాలే. ఆధునిక కాలంలో భూమిపైన దాని జీవావరణవ్యవస్థలపైనా మానవుడు చూపిన, చూపిస్తున్న ప్రభావం, భవిష్యత్తులో రాబోయే జీవజాతుల పరిణామాన్ని ప్రభావితం చేస్తాయి. 2018 జూలైలో, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్ వారు హోలోసీన్ ఇపోక్‌ను మూడు ఉపభాగాలుగా విభజించారు. దీన్ని ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ స్ట్రాటిగ్రాఫీ ప్రతిపాదించింది. అవి: గ్రీన్‌లాండియన్ (11,700 సంవత్సరాల క్రితం నుండి 8,326 సంవత్సరాల క్రితం వరకు), నార్త్‌గ్రిప్పియన్ (8,326 సంవత్సరాల క్రితం నుండి 4,200 సంవత్సరాల క్రితం వరకు), మేఘాలయన్ (4,200 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకూ).[6] భారతదేశపు మేఘాలయ రాష్ట్రం లోని మామ్‌లూ గుహలోని స్పీలియోథెర్మ్ ఉద్భవించిన సమయాన హోలోసీన్ మూడవ విభాగం మొదలైనట్లు గుర్తిస్తూ ఈ సమయాన్ని విభాజక హద్దుగా గుర్తించి, ఈ మూడవ విభాగానికి మేఘాలయ పేరు మీదుగా మేఘాలయన్ అని పేరు పెట్టారు.
హోలోసీన్ అంటే పూర్తిగా కొత్తది అని అర్థం. ప్రాచీన గ్రీక్ పదాలు హోలోస్ (ὅλος ) అంటే మొత్తం లేదా పూర్తిగా అని, కైనోస్ (καινός) అంటే క్రొత్తది అనీ అర్థం.
అవలోకనం
మార్చుహోలోసీన్ సుమారు 11.650 సంవత్సరాల క్రితం మొదలైందని స్ట్రాటీగ్రఫీ అంతర్జాతీయ కమిషన్ ఆమోదించింది.[3]
వాతావరణ హెచ్చుతగ్గుల ఆధారంగా హోలోసీన్‌ను ఐదు కాలావధులుగా లేదా క్రోనోజోన్‌లుగా విభజించవచ్చు:[7]
- ప్రీబోరియల్ (10 వేసం -9 వేసం క్రితం),
- బోరియల్ (9 వేసం –8 వేసం క్రితం),
- అట్లాంటిక్ (8 వేసం -5 వేసం క్రితం),
- సబ్‌బోరియల్ (5 వేసం - 2.5 వేసం క్రితం)
- సబ్ అట్లాంటిక్ (2.5 వేసం క్రితం - ప్రస్తుతం).
- గమనిక: "వేసం" అంటే "వేలసంవత్సరాలు'' (క్రితం అంటే 1950 మి ముందు అని అర్థం)
శీతోష్ణస్థితి పరంగా, హోలోసీన్‌ను హైప్సిథర్మల్, నియోగ్లేసియల్ కాలాలుగా సమానంగా విభజించవచ్చు; ఐరోపాలో కాంస్య యుగం ప్రారంభ సమయం వీటి మధ్య సరిహద్దు. కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం, మూడవ విభాగం, ఆంత్రోపోసిన్ ఇప్పుడు ప్రారంభమైంది.[9] క్వాటర్నరీ స్ట్రాటిగ్రాఫీపై అంతర్జాతీయ కమిషన్ ఆన్ స్ట్రాటిగ్రాఫీ వేసిన సబ్‌కమిషను, 'ఆంత్రోపోసీన్' (2000 లో పాల్ క్రుట్జెన్, యూజీన్ స్టోర్మర్‌లు ఈ పదాన్ని కాయించారు) పదం గురించి ఇలా చెప్పింది: మానవ కార్యకలాపాల వలన భౌగోళిక పరిస్థితులు, ప్రక్రియలు తీవ్రమైన మార్పులకు లోనైన కాలాన్ని సూచించడానికి ఈ పదాన్ని వాడారు. 'ఆంత్రోపోసీన్' అధికారికంగా నిర్వచించిన భౌగోళిక కాల ప్రమాణం కాదు.
జియాలజీ
మార్చు10,000 సంవత్సరాల వ్యవధిలో ప్లేట్ టెక్టోనిక్స్ వల్ల ఖండాలు ఒక కిలోమీటర్ కంటే తక్కువగానే కదిలాయి. అయితే, హోలోసీన్ ప్రారంభకాలంలో మంచు కరగడం వల్ల ప్రపంచ సముద్ర మట్టాలు 35 మీ. పెరిగాయి. పైగా, 40 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి పైన ఉన్న అనేక ప్రాంతాలు ప్లైస్టోసీన్ కాలపు హిమానీనదాల బరువుతో కుంగిపోయి ఉండేవి. చివరి ప్లైస్టోసీన్, హోలోసీన్ కాలాల్లో హిమానీ నదాలు కరగడంతో ఈ భూభాగాలు తిరిగి ఉప్పొంగి, 180 మీ. పైకి లేచాయి. నేటికీ పెరుగుతూనే ఉన్నాయి.[10]
సముద్ర మట్టం పెరుగుదల, తాత్కాలిక భూకుంగుబాటు, ప్రస్తుతం సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలలోకి సముద్ర జీవులు చొరబడ్డానికి దోహదపడ్డాయి. ఉదాహరణకు, వెర్మోంట్, మిచిగాన్‌లలో హోలోసీన్ కాలపు సముద్ర శిలాజాలు లభించాయి. హోలోసీన్ శిలాజాలు ప్రధానంగా సరస్సు, వరద ముంపుకు గురైన మైదాన ప్రాంతాలు, గుహ నిక్షేపాలలో కనిపిస్తాయి. తక్కువ-అక్షాంశ తీరప్రాంతాల్లో హోలోసీన్ సముద్ర నిక్షేపాలు చాలా అరుదు, ఎందుకంటే ఈ కాలంలో సముద్ర మట్టాల పెరుగుదల హిమనదీయేతర ప్రాంతాల్లోని టెక్టోనిక్ ఉద్ధృతిని మించిపోయింది.
స్కాండినేవియా ప్రాంతంలో గ్లేసియలనంతర కాలంలో భూమి పుంజుకోవడం వలన బాల్టిక్ సముద్రం ఏర్పడింది. భూకంపాలు అవక్షేప వైకల్యానికి ఒక ప్రధాన కారణం. ఇవి కొత్త జలాశయాల సృష్టికి, ఉన్న జలాశయాల ధ్వంసానికీ దారితీస్తాయి.[11] ఉత్తర ఐరోపా అంతటా బలహీనమైన భూకంపాలకు కారణమౌతూ ఈ ప్రాంతం ఇంకా పైకి ఉబ్బుతూనే ఉంది. ఉత్తర అమెరికాలో దీనికి సమానమైన సంఘటన హడ్సన్ బే యొక్క పుంజుకోవడం.
శీతోష్ణస్థితి
మార్చుహోలోసీన్లో శీతోష్ణస్థితి నిలకడగా ఉంది. గత మంచు యుగం ముగిసిన తరువాత గ్లోబల్ వార్మింగ్ జరిగిందని ఐస్ కోర్ రికార్డులు చూపిస్తున్నాయి. అయితే యంగర్ డ్రయాస్ ప్రారంభంలో శీతోష్ణస్థితిలో మార్పులు మరింత ప్రాంతీయ మయ్యాయి. చివరి గ్లేసియల్ నుండి హోలోసీన్‌కు పరివర్తన సమయంలో, దక్షిణ అర్ధగోళంలో హ్యూల్మో-మాస్కార్డి కోల్డ్ రివర్సల్ యంగర్ డ్రైయస్ కంటే ముందు మొదలైంది. 11,000 నుండి 7,000 సంవత్సరాల క్రితం వరకు వేడి గరిష్ఠంగా దక్షిణంనుండి ఉత్తరం వైపు ప్రవహించింది. ఉత్తరార్ధగోళంలో మిగిలి ఉన్న హిమనదీయ మంచు దీన్ని ప్రభావితం చేసిందని తెలుస్తోంది.
హోలోసీన్ క్లైమాటిక్ ఆప్టిమం (HCO) అనేది వేడెక్కే కాలం. ఈ కాలంలో ప్రపంచ వాతావరణం వేడెక్కింది. అయితే, ఈ వేడెక్కడం బహుశా ప్రపంచవ్యాప్తంగా ఏకరీతిగా లేదు. ఈ వెచ్చదనపు కాలం 5,500 సంవత్సరాల క్రితం నియోగ్లాసియల్, నియోప్లూవియల్ లు ఒకేసారి వచ్చినపుడూ ముగిసింది. ఆ సమయంలో, వాతావరణం ఇప్పటి కంటే భిన్నంగా ఏమీ లేదు. కాకపోతే, 10 - 14 శతాబ్దాల మధ్య కొంత వెచ్చని కాలం ఏర్పడింది. దాన్ని మధ్యయుగపు వెచ్చని కాలం (మెడీవల్ వార్మ్ పీరియడ్) అని పిలుస్తారు. దీని తరువాత 13 లేదా 14 వ శతాబ్దంలో చిరు మంచుయుగం ఏర్పడి 19 వ శతాబ్దం మధ్యకాలం వరకు కొనసాగింది.
హిమనదీయ పరిస్థితులతో పోల్చితే, నివాసయోగ్యమైన ప్రాంతాలు ఉత్తరం వైపుకు విస్తరించి, హెచ్‌సిఓ సమయంలో అత్యంత ఉత్తరాది స్థానానికి చేరుకున్నాయి. ధ్రువ ప్రాంతాల లోని అధిక తేమ కారణంగా అక్కడి స్టెప్పీ-టండ్రాలు అదృశ్య మయ్యాయి.
పర్యావరణ పరిణామాలు
మార్చుహోలోసీన్ మొదలై ఎక్కువ సమయం కాలేదు కాబట్టి ఈ కాలంలో జీవ పరిణామం పెద్దగా జరగలేదు. అయితే మొక్కలు, జంతువుల భౌగోళిక వ్యాప్తిలో పెద్ద మార్పులే జరిగాయి. ఒక పెద్ద జంతువుల సంఖ్య సహా మామత్‌లు, మాస్టోడాన్‌లు, స్మైలోడాన్, హోమోథెరియమ్, స్లోత్‌ల వంటి కోర పళ్ళ పిల్లులూ చివరి ప్లైస్టోసీన్ చివర్లో, హోలోసీన్ మొదట్లో అంతరించి పోయాయి, ముఖ్యంగా ఉత్తర అమెరికాలో. గుర్రాలు, ఒంటెలు వంటివి మిగతా చోట్ల నిలిచే ఉన్నప్పటికీ, ఉత్తర అమెరికాలో మాత్రం అంతరించి పోయాయి. అమెరికాలో పెద్ద జంతువుల ఈ విలుప్తతకు ప్రస్తుత అమెరిండియన్ల పూర్వీకులు రావడం వల్లనే అని భావించారు. వాతావరణ మార్పు కూడా దీనికి దోహదపడిందని చాలా మంది శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
8,200 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని శీతం కమ్మేసింది. ఇది 400 సంవత్సరాల పాటు కొనసాగింది. ఇది శీతోష్ణస్థితుల పరంగా హోలోసీన్ ఇపోక్‌లో జరిగిన అత్యంత ప్రముఖమైన ఘటన.
మానవ పరిణామాలు
మార్చుఐరోపాలో హోలోసీన్ చాలావరకు మధ్యరాతియుగం ప్రారంభంతోటే మొదలౌతుంది. మధ్య ప్రాచ్యం, అనటోలియా వంటి ప్రాంతాలలో చాలా మధ్యరాతియుగం స్థానంలో ఎగువపాతరాతియుగం ఉంటుంది. ఈ కాలపు సంస్కృతులలో హాంబర్గియన్, ఫెడర్‌మెస్సర్, నటూఫియన్ లున్నాయి.భూమిపై ఇప్పటికీ ఉన్న అత్యంత పురాతన నివాస స్థలాలైన, మధ్యప్రాచ్యంలోని టెల్ ఎస్-సుల్తాన్ (జెరికో) వంటి స్థలాల్లో తొలి నివాస స్థావరాలు ఏర్పడ్డాయి. గోబెక్లి టేపే వంటి ప్రదేశాలలో క్రీస్తుపూర్వం 9 వ సహస్రాబ్ది కాలం నాటికే తొలి మతం రూపు దిద్దుకున్నట్లు పురావస్తు ఆధారాలు ఉన్నాయి.[12]
ఈ రెండింటి తరువాత ఏసెరామిక్ కొత్తరాతియుగం, మట్టికుండల కొత్తరాతియుగం మొదలయ్యాయి. హోలోసీన్‌లో కొంత కాలం తరువాత విల్లంబుల వంటి పురోగతులు వచ్చాయి. ఇవి ఉత్తర అమెరికాలో యుద్ధరీతుల్లో కొత్త పద్ధతులు చోటు చేసుకున్నాయి. ఒరెగాన్, వాషింగ్టన్లలో పెద్ద ములుకులు కలిగిన బల్లేల స్థానంలో విల్లు, సన్నపాటి ములుకులు కలిగిన బాణాలనూ వాడారు. నిట్టనిలువు గట్లపై నిర్మించిన గ్రామాలు పెరిగిన యుద్ధ వాతావరణాన్ని సూచిస్తాయి. ఆహార సేకరణకు రక్షణ కోసం విడివిడిగా కాకుండా గుంపులుగా వెళ్ళడానికి దారితీసింది.[13] మధ్యఅమెరికాలో, హోలోసీన్ మధ్యకాలం నుండి ఎక్కువగా చెట్ల నరికివేత, పంటలు వేయడం ద్వారా సహజ పర్యావరణాలు మారిపోవడం ఒక సాధారణ లక్షణంగా కనిపిస్తుంది.[14]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Cohen, K. M.; Finney, S. C.; Gibbard, P. L.; Fan, J.-X. (May 2019). "International Chronostratigraphic Chart" (PDF). International Commission on Stratigraphy. Retrieved 13 November 2019.
- ↑ 2.0 2.1 Mike Walker; et al. (December 2018). "Formal ratification of the subdivision of the Holocene Series/Epoch (Quaternary System/Period)" (PDF). Episodes. 41 (4). Subcommission on Quaternary Stratigraphy (SQS): 213–223. doi:10.18814/epiiugs/2018/018016. Retrieved 11 November 2019. This proposal on behalf of the SQS has been approved by the International Commission on Stratigraphy (ICS) and formally ratified by the Executive Committee of the International Union of Geological Sciences (IUGS).
- ↑ 3.0 3.1 Walker, Mike; Johnsen, Sigfus; Rasmussen, Sune Olander; Popp, Trevor; Steffensen, Jorgen-Peder; Gibrard, Phil; Hoek, Wim; Lowe, John; Andrews, John (2009). "Formal definition and dating of the GSSP (Global Stratotype Section and Point) for the base of the Holocene using the Greenland NGRIP ice core, and selected auxiliary records" (PDF). Journal of Quaternary Science. 24 (1): 3–17. Bibcode:2009JQS....24....3W. doi:10.1002/jqs.1227. S2CID 40380068.
- ↑ Fan, Junxuan. "International Chronostratigraphic Chart". International Commission on Stratigraphy.
- ↑ Oxford University Press - Why Geography Matters: More Than Ever (book) - "Holocene Humanity" section https://books.google.com/books?id=7P0_sWIcBNsC
- ↑ Amos, Jonathan (2018-07-18). "Welcome to the Meghalayan Age a new phase in history". BBC News.
- ↑ Mangerud, Jan; Anderson, Svend T.; Berglund, Bjorn E.; Donner, Joakim J. (October 1, 1974). "Quaternary stratigraphy of Norden: a proposal for terminology and classification" (PDF). Boreas. 3 (3): 109–128. Bibcode:1974Borea...3..109M. doi:10.1111/j.1502-3885.1974.tb00669.x. Archived from the original (PDF) on 2020-02-16. Retrieved 2019-12-01.
- ↑ Zalloua, Pierre A.; Matisoo-Smith, Elizabeth (6 January 2017). "Mapping Post-Glacial expansions: The Peopling of Southwest Asia". Scientific Reports (in ఇంగ్లీష్). 7: 40338. Bibcode:2017NatSR...740338P. doi:10.1038/srep40338. ISSN 2045-2322. PMC 5216412. PMID 28059138.
- ↑ Pearce, Fred (March 15, 2007). With Speed and Violence. Beacon Press. p. 21. ISBN 978-0-8070-8576-9.
- ↑ Gray, Louise (October 7, 2009). "England is sinking while Scotland rises above sea levels, according to new study". The Daily Telegraph. Retrieved June 10, 2014.
- ↑ Holocene : perspectives, environmental dynamics, and impact events. Kotlia, Bahadur Singh. Hauppauge, N.Y.: Nova Science Publishers. 2013. ISBN 978-1622577255. OCLC 846551611.
{{cite book}}
: CS1 maint: others (link) - ↑ Curry, Andrew (November 2008). "Göbekli Tepe: The World's First Temple?". Smithsonian Magazine. Retrieved March 14, 2009.
- ↑ Snow, Dean R. (2010). Archaeology of Native North America. Upper Saddle River NJ: Prentice Hall. p. 384. ISBN 9780136156864.
- ↑ Franco-Gaviria, Felipe. (2018). "The human impact imprint on modern pollen spectra of the Mayan lands" (PDF). Boletín de la Sociedad Geológica Mexicana. 70: 61–78. doi:10.18268/BSGM2018v70n1a4.
మరింత చదవడానికి
మార్చు- Hunt, C.O.; Rabett, R.J. (2014). "Holocene landscape intervention and plant food production strategies in island and mainland Southeast Asia". Journal of Archaeological Science. 51: 22–33. Bibcode:2014JArSc..51...22H. doi:10.1016/j.jas.2013.12.011. S2CID 55813385.
- Mackay, A. W.; Battarbee, R.W.; Birks, H.J.B.; et al., eds. (2003). Global change in the Holocene. London: Arnold. ISBN 978-0-340-76223-3.
- Roberts, Neil (2014). The Holocene: an environmental history (3rd ed.). Malden, MA: Wiley-Blackwell. ISBN 978-1-4051-5521-2.