క్వీన్ విక్టోరియా పెవిలియన్

విశాఖపట్నంలో ఉన్న విగ్రహం

క్వీన్ విక్టోరియా పెవిలియన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నంలోని వన్ టౌన్ ప్రాంతంలో ఈ విగ్రహం ఉంది.[1] పూర్తిగా కాంస్యంతో తయారు చేయబడిన పురాతన విగ్రహాలలో ఇదీ ఒకటి. రాణి విక్టోరియా ఆమె పాలనలో, విశాఖపట్నంలో ఓల్డ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఒక 'ఇల్లు' కూడా ఉంది. క్వీన్ విక్టోరియా పెవిలియన్ వైజాగ్ నగరంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది.[2]

క్వీన్ విక్టోరియా పెవిలియన్
అక్షాంశ,రేఖాంశాలు17°41′44″N 83°17′33″E / 17.695419°N 83.292637°E / 17.695419; 83.292637
ప్రదేశంవిశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రకంవిగ్రహం
నిర్మాన పదార్థంకాంస్యం
ప్రారంభ తేదీ4 మే 1904; 119 సంవత్సరాల క్రితం (1904-05-04)
అంకితం చేయబడినదిబ్రిటన్ రాణి విక్టోరియా

చరిత్ర మార్చు

1900లో షేర్ మహమ్మదుపురం జమిందారు రాజా జివి జగ్గారావు, యంబ్రం ఎస్టేట్స్ రాజా అకితం వెంకట జగ్గారావు బ్రిటన్ను సందర్శించారు. వారు తిరిగి వచ్చేటప్పుడు అక్కడి బ్రిటిష్ ప్రభుత్వం విక్టోరియా రాణి కాంస్య విగ్రహాన్ని బహుకరించింది. నగరానికి బహుమతిగా అందించిన ఈ విగ్రహాన్ని 1904, మే 4న విశాఖపట్నం వన్ టౌన్ ప్రాంతంలో ఏర్పాటుచేశారు.[3]

నిర్మాణం మార్చు

  • ఈ నిర్మాణం రాతి రాతితో నిర్మించబడింది.
  • నాలుగు గోడల మధ్యలో సారాసెనిక్ తోరణాలతో కూడిన ఎత్తైన వేదిక ఉంది.
  • అర్ధగోళ ఆకారంలో ఉండే రిబ్బెడ్ గోపురం చుట్టుపక్కల, పారాపెట్, కార్నర్ మినార్ల గోడలు ఉన్నాయి.
  • పారాపెట్ మీద, గ్రీకు శిలువలు రూపొందించబడ్డాయి.

ఇతర వివరాలు మార్చు

విశాఖపట్నంలో రాతితో చేసిన మొదటి పెవిలియన్ నిర్మాణం ఇది. ఈ పెవిలియన్ నిర్మాణం చాలామంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. దీని సమీపంలో కన్యక పరమేశ్వరి దేవాలయం, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం, డాల్ఫిన్ ఏరియా, వెంకటేశ్వర దేవాలయం, రాస్ హిల్ చర్చి మొదలైనవి ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "Iconic Queen Victoria statue loses its sheen, lies in utter neglect". New Indian Express. 18 April 2017. Retrieved 11 March 2018.
  2. "Queen Victoria Pavilion Vizag". vizagtourism.org.in. Retrieved 2021-07-17.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Victoria Pavilion needs a facelift". Times of India. 29 February 2016. Retrieved 24 April 2018.