క్వీన్ హరీష్
హరీష్ కుమార్ (1979 - 2019 జూన్ 2) భారతదేశంలోని రాజస్థాన్‌కు చెందిన జానపద నృత్యకారుడు. అతను రాజస్థానీ జానపద నృత్యాల పునరుద్ధరణకు కృషి చేసాడు.[1] అతని ప్రదర్శనలలో ప్రధానంగా ఘూమర్, కల్బెలియా, చాంగ్, భావాయి, చారి వంటి వివిధ జానపద నృత్య రూపాలు ఉన్నాయి.
క్వీన్ హరీష్ | |
---|---|
జననం | హరీష్ కుమార్ 1979 జైసల్మేర్, రాజస్థాన్, భారతదేశం |
మరణం | 2019 జూన్ 2 జోధ్‌పూర్, రాజస్థాన్ | (వయసు 39–40)
వృత్తి | నృత్యకారుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రాజస్థానీ జానపద నృత్యాలు |
పిల్లలు | 2 |
అతను క్వీన్ హరీష్ గా ప్రసిద్ధిచెందాడు. దీనికి కారణం అతను డ్రాగ్ డ్యాన్స్ ప్రదర్శించమే. డ్రాగ్ క్వీన్ అంటే పురుషుడు వినోద ప్రయోజనాల కోసం స్త్రీ వేషధారణలో అచ్చు ఆమె పాత్రలను అనుకరించడం అన్నమాట. క్వీన్ హరీష్ తన రాజస్థానీ జానపద నృత్యాలతో పాటు ముఖ్యంగా అతని విన్యాసాలు, బెల్లీ డ్యాన్స్ కి ప్రసిద్ది చెందాడు.
బాల్యం, కెరీర్
మార్చుహరీష్ కుమార్ 1979లో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని సుతార్ కమ్యూనిటీలో కార్పెంటర్ కుటుంబంలో జన్మించాడు.[2] తల్లిదండ్రులను కోల్పోయిన తను తన అక్కాచెల్లెళ్లను చూసుకునేందుకు డ్రాగ్ డ్యాన్స్ 13 ఏళ్ల వయసులోనే ప్రదర్శించడం ప్రారంభించాడు.[3] జైసల్మేర్ ప్రాంతంలో మొట్టమొదటి డ్రాగ్ పెర్ఫార్మర్ అన్నూ మాస్టర్ స్ఫూర్తితో ఆయన దగ్గర డ్రాగ్ డ్యాన్స్ నేర్చుకున్నాడు.[3] అతను తన శరీరాన్ని అన్ని స్త్రీల కదలికలను మరింత సామర్థ్యంగా చేయడానికి అమెరికన్ గిరిజన శైలిలో బెల్లీ డ్యాన్స్‌ని అభ్యసించాడు.[4]
ఆయన రాజస్థాన్ రాష్ట్రంలోని ఘూమర్, కల్బెలియా, చాంగ్, భావాయి, చారి వంటి ఇతర జానపద నృత్యాలను దాదాపు 60 దేశాల్లో ప్రదర్శించాడు. ఆయన ప్రతీ సంవత్సరం తప్పక జైపూర్ లిటరరీ ఫెస్ట్ లో పాల్గొనేవాడు.[5] ఆయన బ్రస్సెల్స్‌లోని రాక్స్ కాంగ్రెస్, సియోల్‌లోని బెల్లీ డ్యాన్సింగ్ ఛాంపియన్‌షిప్, న్యూయార్క్ నగరంలో డెసిలిషియస్‌లో పాల్గొన్నాడు.[6] ఆయన రియాలిటీ టెలివిజన్ షో ఇండియాస్ గాట్ టాలెంట్ లోనే కాక అప్పుడప్పుడు (2003), జై గంగాజల్ (2016), ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్‌తో సహా పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించాడు.[7][8] 2007లో ఆయన అమెరికన్ ఫిల్మ్ మేకర్ జాస్మిన్ డెల్లాల్ రచించిన వెన్ ది రోడ్ బెండ్స్: టేల్స్ ఆఫ్ ఎ జిప్సీ కారవాన్ అనే డాక్యుమెంటరీలో నటించాడు.[9][10] రాజస్థాన్ ప్రభుత్వం సహకారంతో ఆయన జైసల్మేర్‌లో ది క్వీన్ హరీష్ షో అనే పేరుతో రోజూ సాయంత్రం ప్రదర్శనను నిర్వహించాడు.[11] అతను జపాన్‌లో రెండు వేల మందికి పైగా విద్యార్థులకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుహరీష్ కుమార్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.[12]
మరణం
మార్చుఆయన 39 సంవత్సరాల వయస్సులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సమీపంలోని కపర్దా గ్రామంలోని హైవేలో 2019 జూన్ 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.[13]
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Farewell, Queen Harish – India's most famous drag queen". Times of India Blog. 21 June 2019.
- ↑ Asnani, Rajesh (6 June 2019). "Jaipur diary: Rajasthan mourns folk dancer Queen Harish". The New Indian Express. Retrieved 16 May 2022.
- ↑ 3.0 3.1 "Obituary | Queen Harish, India's 'Dancing Desert Drag Queen'". The Wire.
- ↑ "Blush.me". Blush (in ఇంగ్లీష్). Archived from the original on 7 February 2022. Retrieved 7 February 2022.
- ↑ Swaminathan, Chitra (6 June 2019). "Dance like Queen Harish". The Hindu (in Indian English).
- ↑ "Queen Harish of Jaisalmer, Traditional Dancers from Jaisalmer". www.jaisalmeronline.in (in ఇంగ్లీష్).
- ↑ "Who was Queen Harish Kumar?". DNA India (in ఇంగ్లీష్).
- ↑ "Harish". IMDb.
- ↑ Roy, Sandip (22 July 2008). "Queen Harish dances in drag". SFGATE.
- ↑ "Rajasthani folk dancer Queen Harish dies in road accident". The Indian Express (in ఇంగ్లీష్). 3 June 2019.
- ↑ "Queen Harish: The Man, The Woman, The Performer". eNewsroom India. 4 March 2018.
- ↑ Soparrkar, Sandip (10 June 2019). "Queen Harish: The man, the woman & the mystery will stay the same forever". The Asian Age.
- ↑ ഡെസ്ക്, വെബ് (2 June 2019). "നാടോടി നർത്തകൻ ക്വീൻ ഹാരിഷ് വാഹനാപകടത്തിൽ മരിച്ചു". www.madhyamam.com (in మలయాళం).