ఖమఖా హైదరాబాదీ

తెలంగాణకు చెందిన ఉర్దూ కవి

ఖమఖా హైదరాబాదీ (1929 – 3 మే 2017) తెలంగాణకు చెందిన ఉర్దూ కవి. ఇతని అసలు పేరు గౌస్ మొయియుద్దీన్ అహ్మద్ కాగా ఖమఖా అనేది ఇతని కలంపేరు.[2] కవితలతో పేరొందిన మొయియుద్దీన్, మజాహియా ముషైరాస్‌లో రెగ్యులర్‌గా ఉండేవాడు.[3][4] తన స్థానిక దక్కనీ మాండలికంలో కవితలు రాశాడు. హాస్యం, వ్యంగ్యంలో రాయడం ఇతని ప్రత్యేకత.

ఖమఖా హైదరాబాదీ
పుట్టిన తేదీ, స్థలంగౌస్ మొయియుద్దీన్ అహ్మద్
1929
హైదరాబాదు, తెలంగాణ
మరణం3 మే 2017[1]
వృత్తిఉర్దూ కవి
జాతీయతభారతీయుడు
రచనా రంగంగజల్, నాజ్మ్
విషయంహాస్యం, వ్యగ్యం
జీవిత భాగస్వామిబదర్ హౌస్ ఖమాఖా

జీవిత విషయాలు

మార్చు

మొయియుద్దీన్ 1929న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. ఇతనికి బదర్ హౌస్ ఖమాఖాతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మహారాష్ట్రలోని నీటిపారుదల శాఖలో పనిచేశాడు.[5] జిందా దిలాన్-ఇ-హైదరాబాద్‌లో సభ్యుడిగా పనిచేశాడు.

గ్రంథాలు

మార్చు

మొయియుద్దీన్ మూడు పుస్తకాలను రాశాడు.

  • హర్ఫ్-ఇ-ముకారార్ (ఒక స్టోరీ రీటోల్డ్)
  • బా-ఫర్డ్-ఇ-ముహల్
  • కాగజ్ కే తిషే

ఇతర వివరాలు

మార్చు

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రయిన్, కువైట్, ఒమన్ వంటి దేశాలలో స్టేజ్ షోలలో ప్రదర్శనలు ఇచ్చాడు.[6]

అస్వస్థతతో, పక్షవాతంతో బాధపడుతున్న మొయియుద్దీన్ 2017, మే 3న హైదరాబాదులో మరణించాడు.[2]

మూలాలు

మార్చు
  1. "Videos: Renowned Dakhni poet Ghouse Khamakha passes away". archive.siasat.com. 3 May 2017. Retrieved 2021-08-13.
  2. 2.0 2.1 May 4, Syed Mohammed / TNN /; 2017; Ist, 12:08. "department of irrigation: Celebrated Dakhni poet `Khamakha' passes away | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-13. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  3. "Dakhni poetry rocks YouTube". The Hindu. 2011-12-09. Retrieved 2021-08-13.
  4. "India News, Latest Sports, Bollywood, World, Business & Politics News". The Times of India. Archived from the original on 2013-11-04. Retrieved 2021-08-13.
  5. media, news and. "'King of laughter' poet Ghouse Khamakha passes away". www.en.etemaaddaily.com (in english). Retrieved 2021-08-13.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  6. HYDERABADI, KHAMAKHA. "KHAMAKHA HYDERABADI on about.me". about.me. Retrieved 2021-08-13.

బయటి లింకులు

మార్చు