ఖమ్మం నగరపాలక సంస్థ,అనేది భారతదేశంలోని తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఖమ్మం నగరం పరిపాలనా నిర్వహణ అమలు జరిపే ఒక పౌర సంస్థ. ఇది 19 అక్టోబర్ 2012 న ఏర్పడింది. [1]

ఖమ్మం నగరపాలక సంస్థ
రకం
రకం
నాయకత్వం
నగర కమీషనర్
జోగినపల్లి శ్రీనివాసరావు
గోగులత్ పాపాలాల్, టిఆర్ఎస్
డిప్యూటి మేయర్
బత్తుల మురళీ ప్రసాద్, టిఆర్ఎస్
వెబ్‌సైటు
Khammam Municipal Corporation
ఖమ్మం రైల్వే స్ఠేషన్
ఖమ్మం ప్రభుత్వ హాస్పటల్

చరిత్రసవరించు

ఖమ్మం మొదట 3 వ గ్రేడు పురపాలక సంఘంగా 1952 సంవత్సరంలో ఏర్పడింది. తరువాత దీనిని 1959 లో 2 వ గ్రేడుగా, 1980 లో 1 వ గ్రేడుగా, 2001 మే 18 న న స్పెషల్ గ్రేడ్ గా అప్‌గ్రేడ్ చేశారు.[1]

అధికార పరిధిసవరించు

నగరపాలక సంస్థ 94.37 kమీ2 (1.0158×109 చ .అ) విస్తీర్ణంలో విస్తరించి ఉంది.నగర పాలక సంఘం 51 ఎన్నికల వార్డులతో ఉంది. పద్నాలుగు గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేశారు.నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాలలో బల్లేపల్లి, ద్వంసలపురం, ఎదులపురం, గొల్లగుడెం, గుడిమల్ల, గుర్రాలపాడు, కైకొండైగుడెం, ఖానాపురం. హవేలి, మల్లెమడుగు, పెద్దతండ, పోలేపల్లి, వెలుగుమట్ల,వెంకటగిరి ఉన్నాయి. [2]

అడ్మినిస్ట్రేషన్సవరించు

నగరపాలక సంస్థ మేయర్ నేతృత్వంలోని ఎన్నుకోబడిన సంస్థ నిర్వహిస్తుంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం నగరపాలక సంస్థ పరిధిలో జనాభా 153,756. కార్పొరేషన్ ప్రస్తుత కమిషనర్ జి. వేణుగోపాల్ రెడ్డి. [3]

ఎన్నికలుసవరించు

ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కోసం మొదటి ఎన్నికలు 2016 మార్చి 6 న జరిగాయి.[4]పౌరసంఘం యొక్క 50 డివిజన్లకు టిఆర్ఎస్, టిడిపి, కాంగ్రెస్-సిపిఐ కలయిక, సిపిఐ (ఎం), వైయస్ఆర్ కాంగ్రెస్,బిజెపి పార్టీలకు తోడు స్వతంత్రులు మొత్తం 291 మంది అభ్యర్థులు బరిలో నిలబడ్డారు[5]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 Khammam Municipal Corporation. URL accessed on 28 December 2019.
  2. "Khammam is a municipal corporation now". IBN Live. Khammam. 27 June 2011. Retrieved 28 December 2019.
  3. General Administration. URL accessed on 28 December 2019.
  4. 33 per cent voting in Khammam civic polls till 11 a.m.. URL accessed on 28 December 2019.
  5. 68 pc voting in Khammam civic poll in Telangana. URL accessed on 28 December 2019.

వెలుపలి లంకెలుసవరించు