పూనుకొల్లు నీరజ

పునుకొల్లు నీర‌జ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్‌గా 7 మే 2021న పదవి భాద్యతలు చేపట్టింది.[1][2]

పునుకొల్లు నీర‌జ

పదవీ కాలం
మే 2021 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 24 జనవరి 1967
ఆగిరిపల్లి, ఆగిరిపల్లి మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి రామబ్రహ్మం,
సంతానం పృథ్వీ, మౌని
నివాసం ఖమ్మం
మతం హిందూ

జననం, విద్యాభాస్యం మార్చు

నీర‌జ 24 జనవరి 1967లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, ఆగిరిపల్లి మండలం, ఆగిరిపల్లిలో జన్మించింది. ఆమె ఇంటర్మీడియట్ పూర్తి చేసి బీఏ పూర్తి చేయకుండానే చదువును ఆపేసింది. ఆమె పునుకొల్లు రామబ్రహ్మంను వివాహమాడిన తరువాత 1988లో కుటుంబంతో ఖమ్మం వచ్చి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు.

రాజకీయ జీవితం మార్చు

పునుకొల్లు నీర‌జ తన భర్త రామబ్రహ్మం అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చింది. ఆయన వ్యాపార రంగంలో ఉంటూనే రాజకీయల్లో కూడా ఉంటూ మూడు సార్లు ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్‌గా పని చేశాడు. నీర‌జ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2005లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ తరపున 23వ వార్డ్ నుండి కౌన్సెలర్‌గా ఎన్నికైంది. ఆమె 2016లో ఖమ్మం నగరపాలక సంస్థ కు జరిగిన ఎన్నికల్లో 17వ డివిజన్‌ కార్పోరేటర్‌గా ఎన్నికైంది.

పునుకొల్లు నీర‌జ 2021లో ఖమ్మం నగరపాలక సంస్థ కు జరిగిన ఎన్నికల్లో 26వ డివిజన్‌ నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండవసారి కార్పోరేటర్‌గా ఎన్నికైంది. ఆమె ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్‌గా 7 మే 2021న పదవి భాద్యతలు చేపట్టింది. ఆమె టీఆర్ఎస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో నీరజ అభ్యర్థిత్వాన్ని 58వ డివిజన్‌ తెరాస కార్పొరేటర్‌ దోరెపల్లి శ్వేత ప్రతిపాదించగా 24వ డివిజన్‌ కార్పొరేటర్‌ కమర్తపు మురళి మేయర్‌ అభ్యర్థిత్వాన్ని బలపరిచాడు. మేయర్ స్థానానికి ఇతర పార్టీల నుంచి ఎవరూ పోటీలో లేకపోవడంతో పునుకొల్లు నీరజ ఏకగ్రీవంగా ఎన్నికై ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్‌గా 7 మే 2021న పదవి భాద్యతలు చేపట్టింది.[3]

మూలాలు మార్చు

  1. Eenadu (7 May 2021). "నగర మేయర్‌గా నీరజ". Archived from the original on 16 December 2021. Retrieved 16 December 2021.
  2. TV5 News (7 May 2021). "ఖమ్మం మేయర్‌గా పునుకొల్లు నీరజ!" (in ఇంగ్లీష్). Archived from the original on 16 December 2021. Retrieved 16 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. News18 Telugu. "బల్దియా పీఠంపై ఆంధ్రా మహిళలు.. సెటిలర్లకు పెద్దపీట వేసిన ప్రజలు." Archived from the original on 16 December 2021. Retrieved 16 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)