ఖమ్మం మండలం (అర్బన్)

తెలంగాణ, ఖమ్మం జిల్లా లోని మండలం

ఖమ్మం మండలం (అర్బన్), తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం.[1].

ఖమ్మం అర్బన్
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°14′19″N 80°08′14″E / 17.238531°N 80.13731°E / 17.238531; 80.13731
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండల కేంద్రం ఖమ్మం
గ్రామాలు 9
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 93 km² (35.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 3,13,504
 - పురుషులు 1,55,461
 - స్త్రీలు 1,58,043
అక్షరాస్యత (2011)
 - మొత్తం 74.40%
 - పురుషులు 82.18%
 - స్త్రీలు 66.39%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  9  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం ఖమ్మం.

గణాంకాలు

మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం ఖమ్మం పట్టణ మండలం మొత్తం జనాభా 313,504. వీరిలో 155,461 మంది పురుషులు, 158,043 మంది స్త్రీలు. మండలంలో మొత్తం 82,743 కుటుంబాలు ఉన్నాయి. ఖమ్మం మండలం సగటు లింగ నిష్పత్తి 1,017. మొత్తం జనాభాలో 79.8% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 20.2% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 84.2% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 60.1%గా ఉంది. అలాగే మండలంలోని పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి 1,021 కాగా గ్రామీణ ప్రాంతాల్లో 999గా ఉంది. మండలంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 32172, ఇది మొత్తం జనాభాలో 10%. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల మగ పిల్లలు 16725, ఆడ పిల్లలు 15447 మంది ఉన్నారు. మండలం లోని బాలల లింగ నిష్పత్తి 924, ఇది మండల సగటు లింగ నిష్పత్తి (1,017) కంటే తక్కువ.మండలం మొత్తం అక్షరాస్యత రేటు 79.4%. ఖమ్మం మండలంలో పురుషుల అక్షరాస్యత రేటు 76.31%, స్త్రీల అక్షరాస్యత రేటు 66.28%.[3]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 93 చ.కి.మీ. కాగా, జనాభా 280,500. జనాభాలో పురుషులు 138,909 కాగా, స్త్రీల సంఖ్య 141,591. మండలంలో 73,772 గృహాలున్నాయి.[4]

ప్రముఖులు

మార్చు

మండలం లోని పట్టణాలు

మార్చు

మండలం లోని గ్రామాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. బల్లేపల్లి
  2. ఖానాపురం హవేలీ
  3. వెలుగుమట్ల
  4. ధంసలాపురం
  5. ఖమ్మం
  6. బుర్హాన్‌పురం
  7. దానవాయిగూడెం
  8. మల్లెమడుగు

ఎటువంటి డేటా లేని గ్రామాలు

మార్చు

ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ఇది రెవెన్యూ గ్రామం, కానీ దీనికి ఎటువంటి డేటా లేనందున పేజీలు సృష్టించలేదు.

  • పాపకబంద

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2017-12-07.
  2. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "Khammam Mandal Population, Religion, Caste Khammam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-07-23. Retrieved 2022-07-23.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

మార్చు