ఖమ్మం రెవెన్యూ డివిజను
ఖమ్మం రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. ఖమ్మం జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 15 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం ఖమ్మం పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం, ఖమ్మం శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.
ఖమ్మం రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం |
వివరాలు
మార్చుఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3][4]
పరిపాలన
మార్చుఖమ్మం డివిజనులోని మండలాలు:[5]
క్ర.సం | ఖమ్మం రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | ఖమ్మం మండలం (అర్బన్) | 9 రెవెన్యూ గ్రామాలు |
2 | ఖమ్మం మండలం (రూరల్) | 19 రెవెన్యూ గ్రామాలు |
3 | తిరుమలాయపాలెం మండలం | 25 రెవెన్యూ గ్రామాలు |
4 | కూసుమంచి మండలం | 18 రెవెన్యూ గ్రామాలు |
5 | నేలకొండపల్లి మండలం | 22 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
6 | బోనకల్ మండలం | 18 రెవెన్యూ గ్రామాలు |
7 | చింతకాని మండలం | 16 రెవెన్యూ గ్రామాలు |
8 | ముదిగొండ మండలం | 23 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు) |
9 | కొణిజర్ల మండలం | 17 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
10 | సింగరేణి మండలం | 11 రెవెన్యూ గ్రామాలు |
11 | కామేపల్లి మండలం | 13 రెవెన్యూ గ్రామాలు |
12 | మధిర మండలం | 26 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
13 | ఎర్రుపాలెం మండలం | 24 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు) |
14 | వైరా మండలం | 22 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
15 | రఘునాథపాలెం మండలం | 12 రెవెన్యూ గ్రామాలు |
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-06-21.
- ↑ "Khammam Revenue Division". www.khammam.telangana.gov.in. Archived from the original on 2021-05-21. Retrieved 2022-06-21.
- ↑ "List of Revenue Divisions, Mandals in Khammam District". www.teachersbadi.in. Archived from the original on 2021-05-15. Retrieved 2022-06-21.
- ↑ "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-06-21.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2021-12-20 suggested (help)