ఖాకీ 2017లో విడుదలైన తెలుగు సినిమా. డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రభు ఎస్ ఆర్, ప్రకాష్ బాబు ఎస్ ఆర్ నిర్మించిన ఈ చిత్రం తమిళంలో '‘ధీరన్‌ అదిగారమ్‌ ఒండ్రు' గా, తెలుగులో 'ఖాకీ' పేరుతో 2017 నవంబరు 17లో విడుదలైంది. కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు.[1]

ఖాకీ
దర్శకత్వంహెచ్. వినోద్
రచనహెచ్. వినోత్
దీనిపై ఆధారితంఆపరేషన్ బావారై
నిర్మాతప్రభు ఎస్ ఆర్
ప్రకాష్ బాబు
ఉమేశ్‌ గుప్తా
సుభాష్‌ గుప్తా
తారాగణంకార్తీ
రకుల్ ప్రీత్ సింగ్
అభిమన్యు సింగ్
ఛాయాగ్రహణంసత్యన్‌ సూరన్
కూర్పుటి.శివానందీశ్వరన్
సంగీతంగిబ్రాన్
నిర్మాణ
సంస్థ
డ్రీం వారియర్ పిక్చర్స్
పంపిణీదార్లురిలయన్స్ ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ
17 నవంబరు 2017 (2017-11-17)
సినిమా నిడివి
163 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

ధీరజ్ (కార్తీ) పోలీస్ కావటంకోసం చాలా కష్టపడతాడు. ఈ క్రమంలో ప్రియ (రకుల్ ప్రీత్ సింగ్) ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పోలీస్ ట్రైనింగ్ ముగించుకొని డి.ఎస్.పిగా చార్జ్ తీసుకొన్నాక ధీరజ్ (కార్తీ) చూసిన మొదటి ఫైల్ ఓ హత్యలకు సంబంధించింది. ఈ పరిస్థితుల్లో ధీరజ్ ఏం చేస్తాడు? ఆ గ్యాంగ్ నేత ఓమాను ఎలా ట్రాప్ చేస్తాడు? చివరకు ధీరజ్ ఎలా విజయం సాధిస్తాడు అన్నదే మిగతా కథ.[2]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: డ్రీం వారియర్ పిక్చర్స్
 • నిర్మాతలు: ప్రభు ఎస్ ఆర్, ప్రకాష్ బాబు, ఉమేశ్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా[3]
 • దర్శకత్వం: హెచ్. వినోత్ [4]
 • సంగీతం : గిబ్రాన్
 • పాటలు: వెన్నెలకంటి
 • కెమెరా: సత్యన్‌ సూరన్
 • మాటలు: శశాంక్ వెన్నెలకంటి
 • ఆర్ట్: కె.ఖాదిర్
 • ఎడిటింగ్: టి.శివానందీశ్వరన్
 • ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్

మూలాలు

మార్చు
 1. The Hindu, Y. Sunita (30 October 2017). "Delving into cop's psyche". The Hindu (in Indian English). Archived from the original on 16 జూలై 2018. Retrieved 28 June 2021.
 2. Sakshi (17 November 2017). "'ఖాకీ' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
 3. Sakshi (25 September 2017). ".7...7...7 వస్తున్నాడీ ఖాకి!". Sakshi. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
 4. Deccan Chronicle (14 September 2017). "Karthi is a complete actor: Vinoth". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 16 జూలై 2018. Retrieved 28 June 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=ఖాకీ&oldid=4091035" నుండి వెలికితీశారు