ఖాజాల్ జిల్లా
ఖాజాల్ జిల్లా, మిజోరాం రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో ఒక జిల్లా. 2019, జూన్ 3న ఈ ఖాజాల్ జిల్లా ఏర్పాటు చేయబడింది.[1]
ఖాజాల్ జిల్లా | |
---|---|
మిజోరాం రాష్ట్ర జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మిజోరాం |
జిల్లా ఏర్పాటు | 2019, జూన్ 3 |
ముఖ్య పట్టణం | ఖాజాల్ |
Government | |
• లోక్‌సభ నియోజకవర్గం | మిజోరాం లోక్‌సభ నియోజకవర్గం |
జనాభా | |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
టోపోనిమి
మార్చుజిల్లా ప్రధాన కార్యాలయం ఖాజాల్ పేరును జిల్లాకు పెట్టారు.
విభాగాలు
మార్చుఈ జిల్లాలో ఉత్తర చంఫై, హ్రాంగ్టూర్జో, లెంగ్టెంగ్, తుయిచాంగ్ అనే 4 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాలో 28 పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి.[2] ఖాజాల్ పట్టణంలో సుమారు 3వేల కుటుంబాలు ఉన్నాయి, సుమారు 14,000 మంది నివసిస్తున్నారు.[3] ఖాజాల్ జిల్లాలో సుమారు 7,372 కుటుంబాలు ఉన్నాయి, ఇందులో 36,381 మంది నివసిస్తున్నారు.
పట్టణాలు, గ్రామాలు
మార్చుఖాజాల్ జిల్లాలోని ప్రధాన పట్టణాలు, గ్రామాలు:
- ఐడుజాల్
- బాణం
- చల్రాంగ్
- చాంగ్ట్లై
- చావర్తుయ్
- డెమ్డమ్
- దిల్కాన్
- దుల్టే
- హ్మున్‌చెంగ్
- కవ్ల్కుల్హ్
- కెల్కాంగ్
- ఖావ్‌పుతాన్
- ఖుయిలుయి
- ఖులేన్
- లుంగ్టాన్
- మెల్బుక్-ఖానువామ్
- మెల్హ్నిహ్ (చల్రాంగ్)
- మువల్కావి
- మువల్జెన్
- నీహ్డాన్
- కొత్త చల్రాంగ్
- న్గైజాల్
- పామ్‌చుంగ్
- ఫన్‌చాంగ్‌జాల్
- పుయిలో
- రబుంగ్
- త్లాంగ్మావి
- తువల్పుయి
- ట్యుల్టే
- తుయిపుయి
- వాంగ్ట్లాంగ్
- వంకల్
- జాపుయి
- జోఖవ్తర్
వాతావరణం
మార్చుఖాజాల్ జిల్లాలో మితమైన వాతావరణం ఉంటుంది. శీతాకాలంలో 0-20 డిగ్రీల ఉష్ణోగ్రత, వేసవికాంలో 15-30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.
రవాణా
మార్చుఖాజాల్ పట్టణం, ఐజాల్ నగరాల మధ్య 152 కి.మీ.ల దూరం ఉంది. ఖాజాల్ నుండి బస్సు, సుమో, హెలికాప్టర్ వంటి రవాణా సౌకర్యాలు ఉన్నాయి.[4]
భౌగోళికం
మార్చుఈ జిల్లాకు ఉత్తరం వైపు సెర్ఛిప్ జిల్లా, దక్షిణం వైపు లవంగ్‌త్లై జిల్లా, ఆగ్నేయం వైపు సైహ జిల్లా, తూర్పు వైపు మయన్మార్ రాష్ట్రం ఉన్నాయి. ఖాజాల్ పట్టణం, జిల్లా పరిపాలనా ప్రధాన కేంద్రంగా ఉంది.
మూలాలు
మార్చు- ↑ "Hnathial DISTRICT CELEBRATES FORMATION". DIPR Mizoram. Retrieved 28 December 2020.
- ↑ "District thar 3-ah mi 1,15,424 an awm Saitual district-ah mihring an tam ber". Vanglaini. Archived from the original on 6 ఆగస్టు 2020. Retrieved 28 December 2020.
- ↑ "Khawzawlah DC pisa thar hawn a ni". Vanglaini. Archived from the original on 13 సెప్టెంబరు 2019. Retrieved 28 December 2020.
- ↑ "Aizawl to Siaha". Mizoram NIC. Archived from the original on 1 ఏప్రిల్ 2012. Retrieved 28 December 2020.