సెర్ఛిప్ జిల్లా

మిజోరాం లోని జిల్లా

మిజోరాం రాష్ట్రంలోని 8 జిల్లాలలో సెర్చిప్ జిల్లా ఒకటి. జిల్లా వాయవ్య, ఉత్తర సరిహద్దులలో ఐజ్‌వాల్జిల్లా, పడమర, దక్షిణ సరిహద్దులో లంగ్‌లెయి జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో మయన్మార్, తూర్పు సరిహద్దులో చంపై జిల్లా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 1421.6 చ.కి.మీ ఉంది.1998 సెప్టెంబరు 15 న రూపుదిద్దుకున్న ఈ జిల్లాకు సెర్చిప్ పట్టణం కేంద్రంగా ఉంది. 2011 గణాంకాలు అనుసరించి దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లాగానూ మిజోరాంలో జనసాంధ్రత అల్పంగా ఉన్న జిల్లాలలో సైహ తరువాతగా రెండవ జిల్లాగానూ గుర్తింపు తెచ్చుకున్నది. .[1]

సెర్ఛిప్ జిల్లా
మిజోరాం పటంలో సెర్ఛిప్ జిల్లా స్థానం
మిజోరాం పటంలో సెర్ఛిప్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమిజోరాం
ముఖ్య పట్టణంసెర్ఛిప్
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుమిజోరాం లోకసభ నియోజకవర్గం
 • శాసనసభ నియోజకవర్గాలు3
విస్తీర్ణం
 • మొత్తం1,422 km2 (549 sq mi)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం64,937
 • సాంద్రత46/km2 (120/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత97.91%
 • లింగ నిష్పత్తి977
జాలస్థలిఅధికారిక జాలస్థలి

భౌగోళికంసవరించు

వెంటవాంగ్ జలపాతం తెంజ్వాల్‌కు దక్షిణంగా ఉంది.[2]

విభాగాలుసవరించు

జిల్లా ఉత్తర సెర్చీప్, వనలైఫై, తెన్‌జావి 3 ఉపవిభాగాలుగా విభజించబడింది. జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు (తుయికం, హ్రంగ్‌తుర్జో, సెర్చిప్ ) ఉన్నాయి. జిల్లాలో ప్రధాన పట్టాణాలలో సెర్చిప్, తెంజ్వాల్, ఉత్తరవనలైఫై ముఖ్యమైనవి. ఇతర ఉపపట్టణాలలో చింగ్‌చిప్, తూర్పు లంగ్‌దర్ ముఖ్యమైనవి. గుర్తించతగిన గ్రామాలలో ముఖ్యమైనవి హ్రింగ్త్లాంగ్, లంఫో ముఖ్యమైనవి.

గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .. 64,937
ఇది దాదాపు... దాదాపు మార్షల్ ద్వీప జనసంఖ్యతో సమానం [3]
అమెరికాలోని జనసంఖ్యకు
640 భారతదేశ జిల్లాలలో 626
1చ.కి.మీ జనసాంద్రత 46
2001-11 కుటుంబనియంత్రణ శాతం 20.56%
స్త్రీ పురుష నిష్పత్తి 977:1000
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 97.91%.[4]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

వృక్షజాలం, జంతుజాలంసవరించు

1991 సెర్చిప్ జిల్లా సెర్చిప్‌లో ఖాంగ్‌లంగ్ 41 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో వన్యమృగ అభయారణ్యం స్థాపించబడింది. .[5]

మూలాలుసవరించు

  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. "Vantawng Falls". india9. Retrieved 2010-06-24.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Marshall Islands 67,182 July 2011 est.
  4. census2011. "Serchhip District : Census 2011 data". census2011.co.in. Retrieved 2013-06-15.
  5. Indian Ministry of Forests and Environment. "Protected areas: Mizoram". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.

వెలుపలి లింకులుసవరించు