ఖిలా వరంగల్ మండలం

తెలంగాణ, వరంగల్ పట్టణ జిల్లా లోని మండలం

ఖిలా వరంగల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ పట్టణ జిల్లాకు చెందిన ఒక మండలం.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు.సవరించు

లోగడ ఖిలా వరంగల్ గ్రామం లోగడ వరంగల్ జిల్లా వరంగల్ రెవిన్యూ డివిజను, వరంగల్ మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఖిలా వరంగల్ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటైన వరంగల్ (పట్టణ) జిల్లా, వరంగల్ రెవిన్యూ డివిజను పరిధి క్రింద ఖిలా వరంగల్ గ్రామంతో కలుపుకొని (1+10) పదకొండు గ్రామాలతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

మండలలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. ఖిలా వరంగల్
 2. ఉరుసు
 3. రంగశాయిపేట
 4. అల్లీపూర్
 5. తిమ్మాపూర్
 6. మమ్నూర్
 7. నక్కలపల్లి
 8. వసంతపూర్
 9. స్తంబంపల్లి
 10. బొల్లికుంట
 11. గాదెపల్లి

మూలాలుసవరించు

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-22. Retrieved 2018-11-22.

వెలుపలి లంకెలుసవరించు