ఖ్వాజా అహ్మదుద్దీన్

ఖ్వాజా అహ్మదుద్దీన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాగ్గేయకారుడు.[1]

ఖ్వాజా అహ్మదుద్దీన్
ఖ్వాజా అహ్మదుద్దీన్
జననం1905
వసంతాపురం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ
మరణంఅక్టోబరు 20, 1970
తండ్రిషేక్ బాలె సాహెబ్
తల్లిఫఖ్రున్నిసాబేగం

జీవిత విశేషాలు మార్చు

అహ్మదుద్దీన్ 1905వ సంవత్సరంలో షేక్ బాలె సాహెబ్, ఫఖ్రున్నిసాబేగం దంపతులకు నాగర్‌కర్నూల్ జిల్లాలో వసంతాపురం గ్రామంలో జన్మించాడు. పదకొండేళ్ళ వయసులో అల్లాజీ అవదూత దర్శనం, పన్నెండేళ్ళ వయసులో అల్లాజీ అనుగ్రహం లభించాయి.

రచనా ప్రస్థానం మార్చు

ఈయన రాసిన కృతులు అహ్మదుద్దీన్ ఆత్మతత్త్వములు పేరుతో ఐదు భాగాల గ్రంథంగా మొదటి ప్రచురణ 1952లో, రెండవ ప్రచురణ 1997లో వెలువడింది. ఈ తత్త్వాలన్ని పాడుకునేందుకు వీలుగా ఉండడమేకాకుండా, వినడానికి శ్రావ్యంగా ఉంటాయి. ఉర్దూలో దాదాపు 32 గజల్స్ రాశాడు.[2]

మరణం మార్చు

ఈయన 1970, అక్టోబరు 20న మరణించాడు.

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (15 September 2019). "వాగ్గేయ వైభవం". www.ntnews.com. మామిడి హరికృష్ణ. Archived from the original on 16 సెప్టెంబరు 2019. Retrieved 4 December 2019.
  2. ఖ్వాజా అహ్మదుద్దీన్, తెలంగాణ వాగ్గేయ వైభవం (పుస్తకం), తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, అక్టోబరు 2017, పుట.44