గంగంపల్లె (రాచర్ల)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
(గంగంపల్లె(రాచర్ల)) నుండి దారిమార్పు చెందింది)

గంగంపల్లె ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గంగంపల్లె (రాచర్ల)
గ్రామం
పటం
గంగంపల్లె (రాచర్ల) is located in ఆంధ్రప్రదేశ్
గంగంపల్లె (రాచర్ల)
గంగంపల్లె (రాచర్ల)
అక్షాంశ రేఖాంశాలు: 15°27′11.95″N 78°58′58.33″E / 15.4533194°N 78.9828694°E / 15.4533194; 78.9828694
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంరాచర్ల
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం

మార్చు

గంగంపల్లె గ్రామంలో వెలసిన శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో 2014,మే నెల 4, ఆదివారం నాడు, పోలేరమ్మకు విశేషపూజలు నిర్వహించారు. భక్తులు రంగురంగుల చీరలతో ఎడ్లబండ్లను అలంకరించి ఉత్సవం నిర్వహించారు. ఆలయం వద్ద బోనాలు వండి, అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు . అర్చకులు భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేసినారు.

శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం

మార్చు

ఈ ఆలయంలో 2017,మే-20వతేదీ శనివారంనాడు, నూతన శ్రీ సీతారామచంద్రస్వామివారల ఉత్సస విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమం సందర్భంగా, ప్రత్యేక అర్చనలు, హోమాలు నిర్వహించినారు. 21వతేదీ ఆదివారం ఉదయం ఉత్సస విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించినారు. అనంతరం అభిషేకం, శ్రీ సీతారామచంద్రస్వామివారల కళ్యాణం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినారు. మద్యాహ్నం భక్తులకు కల్యాణ భోజనాలు వడ్డించినారు. ఈ సందర్భంగా గ్రామములో కోడెల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన కోడెల యజమానులకు బహుమతులు అందజేసినారు. [2]

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు