గంగారం మండలం (మహబూబాబాద్ జిల్లా)

తెలంగాణ, మహబూబాబాదు జిల్లా లోని మండలం


గంగారం మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం మహబూబాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నర్సంఫేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో  22  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. మండల కేంద్రం గంగారం.

గంగారం
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, గంగారం స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, గంగారం స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, గంగారం స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబాబాదు జిల్లా
మండల కేంద్రం గంగారం (మహబూబాబాద్)
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 391 km² (151 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 10,780
 - పురుషులు 5,287
 - స్త్రీలు 5,493
పిన్‌కోడ్ 506135

గణాంకాలు మార్చు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 391 చ.కి.మీ. కాగా, జనాభా 10,780. జనాభాలో పురుషులు 5,287 కాగా, స్త్రీల సంఖ్య 5,493. మండలంలో 2,849 గృహాలున్నాయి.[4]

2016 లో ఏర్పడిన మండలం మార్చు

లోగడ గంగారం, వరంగల్ జిల్లా, నర్సంపేట రెవెన్యూ డివిజన్, పరిధిలోని కొత్తగూడ మండలానికి చెందిన గ్రామం. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా గంగారం గ్రామాన్ని నూతన మండల ప్రధాన కేంద్రంగా ప్రకటించి (1+21) ఇరవైరెండు గ్రామాలుతో, కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. పెద్ద యెల్లాపూర్
  2. జంగాలపల్లి
  3. చింతగూడ
  4. నర్సిగూడ
  5. కాట్రేనమ్
  6. కోమట్లగూడెం
  7. బావురుదగొండ
  8. కామారం
  9. మహాదేవునిగూడెం
  10. మర్రిగూడ
  11. పొనుగొండ్ల
  12. రామవరం
  13. మామిడిగూడెం
  14. దుబ్బగూడెం
  15. మడగూడ
  16. గంగారం
  17. కొడిశాలమిట్ట
  18. పందెం
  19. పుట్టభూపతి
  20. తిర్మలగండి

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు