గంగా శరణ్ సింగ్
గంగా శరణ్ సింగ్ (సిన్హా) (1905-1988) మూడు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడుగా (1956-62, 1962-68 లో బీహార్ నుండి, తర్వాత 1968-1974లో నామినేటెడ్ సభ్యుడుగా) పనిచేసాడు. [1] అతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుడు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సహ వ్యవస్థాపకుడు. [2] భారత తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌కు అతను సన్నిహితుడు. [3] తన స్నేహితుడు, జాతీయవాదీ అయిన జయప్రకాష్ నారాయణ్‌తో కలిసి పాట్నాలో ఒకే ఇంటిలో ఉండేవాడు. [4]
జీవితం
మార్చుగంగా శరణ్ బీహార్‌లో పాట్నా లోని బిహ్తాలో జన్మించాడు. అతన్ని గంగాబాబు అని పిలిచేవారు. సిన్హా స్వయంగా ఏమీ రాయనప్పటికీ చాలా మంది హిందీ రచయితలతో పరిచయం ఉండేది. అతడు మంచి వక్త. హిందీని జాతీయ భాషగా ప్రచారం చేసేందుకు కృషి చేశాడు. భారతీయ జ్ఞానపీఠ్ ట్రస్టీల బోర్డు వ్యవస్థాపక సభ్యులలో ఆయన కూడా ఉన్నాడు. [5] ఆగ్రా లోని కేంద్రీయ హిందీ సంస్థాన్ అతని గౌరవార్థం ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. [6] హిందీ సేవి సమ్మాన్ కింద భారత ప్రభుత్వం గంగా శరణ్ సింగ్ పురస్కారాలను ఏర్పాటు చేసింది. [7] బీహార్ ప్రభుత్వం ఆయన పేరు మీద సాహిత్యం కోసం ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేసింది.
గంగా శరణ్ సింగ్ 1966 నవంబరు 16 - 1969 డిసెంబరు 31 మధ్య భారత ప్రెస్ కౌన్సిల్‌లో సభ్యుడుగా పనిచేసాడు. [8]
అతను 1988లో గుండెపోటుతో మరణించాడు.
గంగా శరణ్ సిన్హా కమిటీ నివేదిక
మార్చు1969లో బాలల విద్యపై గంగా శరణ్ సిన్హా కమిటీ ఇచ్చిన సిఫార్సులను భారత ప్రభుత్వం ఆమోదించింది. 0- నుండి 6 సంవత్సరాల వయస్సు పిల్లలకు అన్ని సేవలను ఏకీకృతం చేయాలని నిర్ణయించింది. ప్రణాళిక జాగ్రత్తగా ముందుకు సాగింది. ICDS కాన్సెప్ట్ మోడల్‌తో మొదట ప్రయోగాత్మకంగా రూపొందించబడింది. [9]
మూలాలు
మార్చు- ↑ "Rajya Sabha members". Retrieved 2009-12-31.
- ↑ Surendra Mohan (21 March 2009). "Dr Lohia's Life and Thought: Some Notes". Mainstream. Retrieved 2009-03-23.
- ↑ Choudhary, Valmiki (1984). Dr. Rajendra Prasad, Correspondence and Select Documents: 1934-1937. Allied Publishers. p. 133. ISBN 978-81-7023-002-1.
- ↑ Ralhan, O.P. (2002). Encyclopaedia of Political Parties. Anmol Publications Pvt. Ltd. pp. 73–74. ISBN 978-81-7488-865-5.
- ↑ "Board Of Trustees, Bharatiya Jnanpith". Bharatiya Jnanpith. 2008-10-25. Retrieved 2008-10-25.
- ↑ "Kashmir varsity Prof awarded for Hindi language". merinews. 2008-08-02. Retrieved 2008-10-29.[permanent dead link]
- ↑ "TOP AWARD PROPOSED FOR INDIAN LITERATURE, PRESIDENT GIVES AWAY HINDI AWARDS". Government of India. 2001-06-15. Retrieved 2009-01-06.
- ↑ "Bihar journalist appointed member Press Council". Bihartimes.in. 2011-06-19. Archived from the original on 12 July 2011. Retrieved 2011-06-26.
- ↑ Parker, R. (2006). Early Years Education. Routledge. ISBN 978-0-415-32672-8.