ప్రధాన మెనూను తెరువు

గంగుల ప్రతాపరెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయనాయకులు. ఈయన 1991 ఎన్నికలలో నంద్యాల లోకసభ నియోజకవర్గం నుంచి, మరియు 2004 ఎన్నికలలో ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఈయన 1967లో ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన గంగుల తిమ్మారెడ్డి కుమారుడు.

తాను గెలుపొందిన 1991లోనే పి.వి.నరసింహారావుకి ప్రధాని అయ్యే అవకాశం రావడంతో తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ స్థానాన్ని ఖాళీ చేశాడు.