బొజ్జా వెంకటరెడ్డి
బొజ్జా వెంకటరెడ్డి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న రాజకీయ నాయకుడు. ఇతడు నంద్యాల నుండి 9వ లోకసభకు ఎన్నికైనాడు[1].
బొజ్జా వెంకటరెడ్డి | |||
![]()
| |||
పదవీ కాలం 1989-1991 | |||
ముందు | మద్దూరు సుబ్బారెడ్డి | ||
---|---|---|---|
తరువాత | గంగుల ప్రతాపరెడ్డి | ||
నియోజకవర్గం | నంద్యాల | ||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1967-1972 1972-1977 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పులిమద్ది, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1932 జూలై 1||
జీవిత భాగస్వామి | శివశంకరమ్మ | ||
సంతానం | 5కుమారులు, 1 కుమార్తె | ||
మతం | హిందూ | ||
మూలం | [1] |
జీవిత విశేషాలు సవరించు
బొజ్జా వెంకటరెడ్డి కర్నూలు జిల్లా, నంద్యాల మండలానికి చెందిన పులిమద్ది గ్రామంలో 1932 జూలై 1వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి బొజ్జా గోవిందరెడ్డి. ఇతడు మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో బి.ఎ., మద్రాసు న్యాయకళాశాలలో బి.ఎల్. చదివాడు. ఇతనికి 1952లో శివశంకరమ్మతో వివాహం జరిగింది. ఈ దంపతులకు 5గురు కుమారులు 1 కుమార్తె ఉన్నారు. వెంకటరెడ్డి వ్యవసాయదారుడు, న్యాయవాది, క్రీడాకారుడిగా కూడా రాణించాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. ఇతడు నిరక్షరాస్యతా నిర్మూలన, కార్మిక సంక్షేమం, వ్యవసాయ, త్రాగు నీటి సౌకర్యాల అభివృద్ధి, ఉద్యోగ కల్పన రంగాలలో కృషి చేశాడు.
రాజకీయ రంగం సవరించు
ఇతడు 1962లో గ్రామ పంచాయతి సర్పంచుగా రాజకీయ ప్రవేశం చేశాడు. 1967, 1972లలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైయ్యాడు. 1978లో గ్రంథాలయ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు. 1966 నుండి 1979 సహకార భూ తనఖా బ్యాంకుకు అధ్యక్షుడిగా ఉన్నాడు. 1984 నుండి కర్నూలు జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇతడు 1989లో లోకసభ ఎన్నికలలో నంద్యాల నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దూరు సుబ్బారెడ్డిపై 56వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందాడు.
మూలాలు సవరించు
- ↑ వెబ్ మాస్టర్. "Tenth Lok Sabha Members Bioprofile REDDY, SHRI BOJJA VENKATA,". పార్లమెంట్ ఆఫ్ ఇండియా లోకసభ. National Informatics Centre (NIC). Retrieved 16 May 2020.[permanent dead link]