గంగుల శాయిరెడ్డి
తెలంగాణ కవి
గంగుల శాయిరెడ్డి (1890 - 1975) తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి. తెలంగాణ రైతుల జీవితాన్ని సాహిత్యంగా మలిచాడు.[1]
జననం - విద్యాభ్యాసం
మార్చుశాయిరెడ్డి 1890లో వాస్తవ్యులు శివారెడ్డి, రామక్క దంపతులకు జనగామ జిల్లా జీడికల్ గ్రామంలో జన్మించాడు. జీడికల్ గ్రామంలోని సంప్రదాయ వీధి బడిలో అక్షరాలు నేర్చుకున్న శాయిరెడ్డి, చిన్నతనంలోనే మహా భారతము, భాగవత రామాయణములను బట్టించుకున్నాడు. రామదాసు, అన్నమయ్య, రాకమచర్ల వేంకటదాసులు రాసిన కీర్తనలను ఆలపించేవాడు.
రచించినవి
మార్చు- కాపుబిడ్డ (వ్యవసాయ పద్యకావ్యం): గ్రామీణ నేపథ్యంలో నిసర్గమైన వాతావరణంలో శ్రమైక జీవనంలో వున్న అత్యధిక కష్టాలు, అత్యల్పసుఖాల చిత్రణ[2]
- బాలశిక్ష: వయోజన విద్య కొరకు నాలుగు బాలశిక్షలలు రచించాడు
ఇతర వివరాలు
మార్చు- రచనలను కొనసాగిస్తూనే మరోవైపు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపాడు.
- ఈయన ‘కాపుబిడ్డ’ కావ్యంకు సురవరం ప్రతాపరెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమరావుల నుండి ప్రశంసలు లభించాయి.[3]
- 1916 నుంచి 1926 వరకు ఆలేరు, పెంబర్తి, కొలనుపాకలతోసహా స్వగ్రామంలోనూ వీధి బడులు నడిపి, చిన్నారులను తీర్చిదిద్దాడు.
- నెలసరి ఐదు రూపాయల జీవనభృతిని పొందిన శాయిరెడ్డి 1936-39ల మధ్య భువనగిరి, నెల్లుట్ల, గుమ్మడవెల్లి మొదలైన గ్రామాల్లో వసతిగృహం ఏర్పాటు చేశాడు.
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ మ్యాగజైన్ (2 November 2017). "గంగుల శాయిరెడ్డి". magazine.telangana.gov.in. డా. దహగాం సాంబమూర్తి. Retrieved 5 January 2018.
- ↑ మనతెలంగాణ (12 December 2016). "కాల స్థలాల కతీతం 'కాపుబిడ్డ' కావ్యం". అమ్మంగి వేణుగోపాల్. Retrieved 5 January 2018.[permanent dead link]
- ↑ రైట్ ఛాయిస్ అకాడమీ. "తెలంగాణా ఆధునిక కవులు…". Retrieved 5 January 2018.[permanent dead link]