గంగ మంగ

1973 సినిమా

గంగ మంగ 1973లో విడుదలైన చిత్రం. ఇది హిందీలో విజయవంతమైన సీత ఔర్ గీత అనే సినిమా కి పునర్నిర్మాణం. ఇందులో శోభన్ బాబు, కృష్ణ, వాణిశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసింది.

గంగ మంగ
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం వి. రామచంద్రరావు
చాణక్య
తారాగణం కృష్ణ,
శోభన్ బాబు,
వాణిశ్రీ
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • గంగ/మంగ పాత్రల్లో వాణిశ్రీ
  • రవి పాత్రలో శోభన్ బాబు
  • కోటి పాత్రలో కృష్ణ
  • రేలంగి
  • దుర్గ పాత్రలో సూర్యకాంతం
  • బుజ్జి పాత్రలో చంద్రమోహన్
  • వై. విజయ
  • పద్మనాభం
  • ఛాయాదేవి
  • రమాప్రభ

పాటలు మార్చు

  1. అలా అలా అలా అలా గాలిలో పైరగాలిలో సాగిపోదామా - పి.సుశీల, వి.రామకృష్ణ
  2. గడసాన్ని దొరసాని ఒడుపు చూడండి ఓ బాబు ఒడుపు చూడండి - ఎస్.పి. బాలు, సుశీల
  3. తొలివలపులలో ఏ చెలికైనా అలక ఉండునని విన్నాను అది కవుల - ఘంటసాల, సుశీల . రచన: దాశరథి.
  4. హుషారు కావాలంటే బేజారు పోవాలంటే మందు ఒక్కటే మందురా - ఎస్.పి.బాలు

వనరులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=గంగ_మంగ&oldid=3957657" నుండి వెలికితీశారు