గంజాం కొండ ప్రాంతాల ఏజెన్సీ

గంజాం హిల్ ట్రాక్ట్స్ ఏజెన్సీ బ్రిటిషు భారతదేశంలో పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాలో ఏజెన్సీ. ఇది 1839 చట్టం XXIV ద్వారా ఖోండులు, సవరలు నివసించే గిరిజన భూములైన 'మలియాలు' లేదా హైలాండ్స్‌తో రూపొందించారు. ఈ భూభాగంలో గంజాం జిల్లా పశ్చిమ భాగం భాగంగా ఉంది. వైశాల్యం 3,500 చదరపు మైళ్లతో, ఇది మొత్తం జిల్లాలో పన్నెండింట ఐదు వంతులు ఉండేది.[1]

1936 ఏప్రిల్ 1 న ఒరిస్సా ప్రావిన్స్ ఏర్పడినప్పుడు, గంజాం హిల్ ట్రాక్ట్స్ ఏజెన్సీని రెండుగా విభజించారు. పర్లాకిమిండి సంస్థానం లోని దక్షిణ భాగాన్ని మద్రాసులోను, మిగిలిన ఏజెన్సీని ఒరిస్సా ప్రావిన్స్‌లోను కలిపారు. పూర్వపు గంజాం కొండ ప్రాంతాల ఏజెన్సీ చాలావరకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోను, ఒడిశాలోని గజపతి, గంజాం జిల్లాలలోనూ ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. MaClean, C. D. (1877). Standing Information regarding the Official Administration of Madras Presidency. Government of Madras. pp. 66–69.