గజపతి జిల్లా

ఒడిశా లోని జిల్లా

గజపతి (ఆంగ్లం: Gajapati) ఒడిషా రాష్ట్రంలోని జిల్లా. ఇది గంజాం జిల్లా నుండి 1992 అక్టోబరులో ఏర్పడింది. ఈ జిల్లా పేరు పర్లాకిమిడి మహారాజా, ఒడిషా మొదటి ముఖ్యమంత్రి అయిన శ్రీ కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ పేరున ఇవ్వబడింది. ఈ జిల్లా ముఖ్యపట్టణం పర్లాకిమిడి (Paralakhemundi). ఇది ప్రస్తుతం రెడ్ కారిడార్ (en:Red Corridorలో భాగంగా ఉంది.[1]

గజపతి జిల్లా
జిల్లా
ఎగువ ఎడమ నుండి సవ్యదిశలో: గండహతి జలపాతం, మహేంద్రగిరి ఆలయం, మహేంద్రగిరి కొండలు, పద్మసంభవ మహావిహార మఠం, బి.ఎన్. ప్యాలెస్, గజపతి కింగ్ ప్యాలెస్
ఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంఒడిషా
స్థాపితం1992 అక్టోబరు
ముఖ్యపట్టణంపర్లాకిమిడి
Government
 • కలక్టరుశ్రీ ప్రకాష్ చంద్ర దాస్, OAS (SG)
 • పార్లమెంటు సభ్యుడుసిద్ధాంత మహాపాత్రా
విస్తీర్ణం
 • Total3,850 కి.మీ2 (1,490 చ. మై)
జనాభా
 (2011)
 • Total5,75,880
 • Rank28th
 • జనసాంద్రత133/కి.మీ2 (340/చ. మై.)
భాషలు
 • అధికారికఒరియా, ఇంగ్లీషు
 • ఇతర ముఖ్య భాషలుతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
761 xxx
Vehicle registrationOD-20
సమీప పట్టణంభువనేశ్వర్
లింగ నిష్పత్తి1042 /
అక్షరాస్యత54.29%
లోక్ సభ నియోజకవర్గంBerhampur
Vidhan Sabha constituency2, 136-Mohana (ST), 137-Paralakhemundi
వాతావరణంAw (Köppen)
అవపాతం1,403.3 మిల్లీమీటర్లు (55.25 అం.)
సగటు వేసవి ఉష్ణోగ్రత45 °C (113 °F)
సగటు శీతాకాల ఉష్ణోగ్రత16 °C (61 °F)

2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా ఒడిషాలో మూడవ అతి తక్కువ జనాభా కలిగిన జిల్లాగా గుర్తించబడింది.[2]

భౌగోళిక స్వరూపం

మార్చు

ఈ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు ఉత్తర సరిహద్దుగా ఉంది. రెండు జిల్లాల మధ్య మహేంద్రతనయ నది ప్రవహిస్తుంది.పర్లాకిమిడి ఈ జిల్లా ముఖ్యపట్టణం, అది పెద్ద నగరం. కాశీనగర ఈ జిల్లాలోని రెండవ పెద్ద నగరం.

ఆర్ధికం

మార్చు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గజపతి జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

2011 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 575,880,[2]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
సోలోమన్ ద్వీపాలు అమెరికాలోని.[4]
అమెరికాలోని వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 533 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 133 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి. 1042:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 54.29%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

2011 జనాభా లెక్కల ప్రకారం గజపతి జిల్లా జనాభా of 575,880,[2] ఇది భారతదేశంలో 533వ స్థానం (మొత్తం జిల్లాలు-640]]).[2] ఇక్కడి జనసాంధ్రత 133/చ.కి.మీ.[2] ఇది క్రితం దశాబ్ది (2001-2011) కంటే 10.99% ఎక్కువ.[2] గజపతి జిల్లాలో లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 1042 స్త్రీలు,[2], అక్షరాస్యత 54.29%.[2]

విద్య

మార్చు
  • శ్రీ కృష్ణ చంద్ర గజపతి కాలేజ్ (ఎస్.కె.సి.జి )
  • మహా రాజా బాయ్స్ హై స్కూల్ (ఎం.ఆర్.బి.హెచ్. ఎస్)
  • మహా రాజా గర్ల్స్ హై స్కూల్ (ఎం.ఆర్.జి.హెచ్.ఎస్)
  • టెక్నాలజీ, నిర్వహణ జగన్నాథ్ ఇన్స్టిట్యూట్ (JITM)
  • ఎం.పి.ఎక్స్ టెక్నాలజీలు (MPX Archived 2013-08-19 at the Wayback Machine)
  • గ్రామీణ ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ కోసం సెంచూరియన్ స్కూల్ (CSREM)
  • జవహర్ నవోదయ విద్యాలయ (జె.ఎన్.వి)

రాజకీయాలు

మార్చు

అసెంబ్లీ నియోజకవర్గాలు

మార్చు

The following is the 2 Vidhan sabha constituencies[6][7] of Gajapati district and the elected members[8] of those area

క్ర.సం నియోజకవర్గం రిజర్వేషను పరిధి 14 వ శాసనసభ సభ్యులు పార్టీ
136 మోహనా షెడ్యూల్డ్ తెగలు మోహనా, ఆర్.ఉదయగిరి, నౌగడ, రాయగడ. చక్రధర్ పైక్ ఐ.ఎన్.సి
137 పర్లఖెముండి లేదు పర్లఖెముండి (ఎం), కాశీనగర్ (ఎన్.ఎ.సి), గుమ, కాశీనగర్, పర్లఖెముండి. కొడురు నారాయణ రావ్ బి.జె.డి

మాధ్యమం

మార్చు
  • ఎం.పి.ఎక్స్. టి.వి (వినోదం)
  • జి.టి.వి (వినోదం)
  • సి3 (వినోదం)

ఎం.పి.ఎక్స్. టీ.వి

మార్చు
  • ఎం.పి.ఎక్స్. టి.వి రాధా వరల్డ్ విజన్ సహకారంతో స్థాపినబడిన మొదటి వినోదం అందించే మీడియా ఇది. ప్రధానకార్యాలయం పర్లాకిమిడి వద్ద ఉంది. దీనిని 2003లో ప్రారంభించారు ఉంది.
  • జి.టి.వి ఇది రెండవ వినోదం అందించే మీడియా. ఇది 2011లో ప్రారంభమైంది.
  • సి3 ఇది మూడవ వినోదం అందించే వాధ్యమం. ఇది 2012లో ప్రారంభమైంది.

సంస్కృతి

మార్చు

ప్రముఖులు

మార్చు
  • Maharaja Captain Sri Krushna Chandra Gajapati Narayan Deb

పరలఖేముండి పాలకుడు మహారాజ కృష్ణచంద్ర చంద్ర గజపతి నారాయణదేవ్ ఒడిషాను దాదాపు 7శతాబ్ధాల కాలం పాలించిన గజపతి వంశానికి చెందిన వాడు. వీరి పాలనలో ఒడిషా ఉత్తరంలో గంగానది నుండి దక్షిణంలో నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి వరకు విస్తరించి ఉంది. 15వ శతాబ్దంలో గజపతి వంశానికి చెందిన కపిలేంద్రదేవ్ కుమారులలో ఒకడైన కొలహొమి ఈ ప్రాంతంలోని పరలఖేముండికి (ప్రస్తుత గంజాం) వచ్చిన సమయంలో పరలఖేముండి రాజ్యాన్ని స్థాపించాడు. గంజాం జిల్లా నైరుతీ ప్రాంతంలో పురాతన జమీందారి ఉండేది. జమిందారి పశ్చిమంలో విశాఖపట్నం ఉత్తర సరిహద్దులో జాజ్‌పూర్ సంస్థానం, తూర్పు కనుమలు (వీటిని మలియాస్ లేక గిరిజన గూడాలు) ఉండేవి.

  • కబిచంద్ర గోపాల్ కృష్ణ 1975లో పరలఖేముండిలో జన్మించాడు. ఆయన కవిసూర్య బలదేవ్ రాథ్ సమకాలీనుడు. బలదేవ్ రాథ్ బ్రజకు చోర అసిచ్చి, ఉథిలు ఇదే బెగి కహింకిరె, మొకృష్ణ చంద్రమ, దుఖిందన చంద్రానన మొదలైన ప్రేమను వెలువరించే వచన కవితలను రచించాడు. ఆయన 1962లో మరణించాడు.
  • సత్యనారాయణ రాజ్గురు ఒక చరిత్రకారుడు. ఆయన జగన్నాథుడు, జగన్నథ ఆలయం గురించిన ఆశ్చర్యకరమైన విశేషాలను కనిపెట్టాడు. ఒడిషా రాష్ట్రంలో పురాతన శిలాక్షరాలు, పాలి లిపిని అర్ధంచేసుకుని వివరించగలిగిన ఒకేఒక చరిత్రకారునిగా సత్యనారాయణ రాజ్గురు గుర్తించబడ్డాడు. ఆయన వ్రాసిన " మొ జీవన సంగ్రామ " (ఆత్మకథ) కొరకు సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నాడు. సత్యనారాయణ రాజ్గురు 2001లో మరణించాడు.
  • కృష్ణ శ్రీచంద్ర (1590) ఖేముండి మహారాజ్ పద్మనాభ్ దేవ్ సభలో కృష్ణ శ్రీచంద్ర మంత్రిగా ఉండేవాడు. ఆయన గొప్ప కవి, నాటక రచయిత.
  • హరి కృష్ణ మహారాణా (మహాపాత్ర) (1662-1734) : ఈయన ఒక గొప్ప కళాకారుడు, చిత్రకారుడు.
  • చైతన్య రాజగురు (1758-1702) గజపతి జగన్నాథ నారాయణ దేవ్ ఆస్థానంలో కవి. ఈయన ఒక గొప్ప జ్యోతిష్కుడు. ఈయన మొగల్ చక్రవర్తి ఔరంగజేబు యొక్క జాతకం సిద్ధం చేసాడు.
  • అపర్ణ పాండా (1860-1927) పర్లాకిమిడి వృత్తిరీత్యా ఈయన మహారాజు యొక్క గురువు, మహారాజా శ్రీ కృష్ణ చంద్ర గజపతి నారాయణ దేవ్, గజపతి ప్రెస్ కార్యదర్శి, ప్రఖ్యాత జ్యోతిష్కుడు ప్రైవేటు గురువును ఉన్నాడు..
  • అపనా పరిచా (1878-1938) 'పద్మనాభ రంగాలయ' పేరిట ఒక నాటక థియేటర్ స్థాపించాడు.
  • నీలమణి పాణిగ్రాహి (1869-1967) ఒక గొప్ప జ్యోతిష్కుడు. ఈయన తన అత్యుత్తమ ప్రదర్శనలకి నబరంగ్‌పూర్ యొక్క మహారాణి 'సిద్ధాంత' (నక్షత్ర నిర్ణయ) బిరుదు అందుకున్నాడు.
  • పద్మనాభ నారాయణ దేవ్ (1872 డిసెంబరు, 15 - నుండి 1904 ఫిబ్రవరి 10 ). ఈయన ఒరియా, హిందీ, బెంగాలీ & తెలుగు భాష పైగా నైపుణ్యం కలిగి ఉన్నాడు. అతను 'గజపతి ప్రెస్' స్థాపించాడు. అతను 'డ్రామా' లో తన వ్యత్యాసం పని కోసం గుర్తుండిపోయే.
  • అనంత చరణ్ పత్రం గొప్ప గుర్తింపు ఉన్న రేడియో కళాకారుడు. అతను సితార్ ప్లే ఒక మాస్టర్. ఈయన ఒడిషా సంగీత్ నాటక్ అకాడెమీ అవార్డును (సితార్ వాయుస్తున్న జరగనున్న అర్ధ చంద్ర, తాలా, సుర, & లయ) సంవత్సరం 1989 లో అందుకున్నాడు.
  • డాక్టర్ బేనిమాధబ్ పతి (1919-2008) గొప్ప గుర్తింపు ఉన్న ప్రముఖ పండితుడు. ఈయన ఒడిషా తన 'జగన్నాథుని సంస్కృతి' లో పరిశోధన, ఒరియా & సంస్కృతం భాష .అతను రచనలు క్లిష్టమైన విశ్లేషణ కోసం ఒడిషా సంగీత్ నాటక్ అకాడెమ అవార్డును, 'రైటర్స్ ఫోరం', 'జగన్నాథలో ప్రసిద్ధి చెందింది. రీసెర్చ్ ఫౌండేషన్, 'కేదార్నాథ్ రీసెర్చ్ ఫౌండేషన్, భారత సంస్కృత ఫౌండేషన్' మొదలైన వాటి నుండి కూడా అవార్డును అందుకున్నాడు.

విలేఖరులు

మార్చు

21వ శతాబ్దం ఆరంభంలో ఒడిషా మాధ్యమంలో గణనీయమైన మార్పు సంభవించింది. పలు ప్రాంతీయ వార్తా చానళ్ళు, దినపత్రికలు ఉనికిలోకి వచ్చాయి. పలు పారిశ్రామిక వేత్తలు మాధ్యమ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 10 కంటే అధికమైన సంస్థలు, విద్యా సంస్థలు తమ పాఠ్య ప్రణాళికలో జర్నలిజం ప్రవేశపెట్టారు. ఎలెక్ట్రానిక్ మీడియా అందుబాటులోకిం అచ్చిన తరువాత పలు విద్యార్థులు జర్నలిజం అధ్యయనం చేయడానికి ముందుకు వచ్చారు. 21 వ శతాబ్ధానికి ముందు మాధ్యమరంగంలో జర్నలిజం డిగ్రీని కొంతమంది విద్యార్థులు మాత్రమే ఎంచుకునేవారు. మాధ్యమరంగం అభివృద్ధి చెందిన తరువాత కూడా జర్నలిజంలో పరిపూర్ణత సాధ్యం కాలేదు. వార్తా కథనాలు వాస్తవం ప్రతిబింబించడంలో సఫలత సాధించలేక పోయాయి. వార్తాపత్రికలలో సంఘటన నివేదిక లేక రాజకీయ నాయకుల వాణిగా మాత్రమే ఉండేది. పాతశైలికి స్వస్తి చెప్తూ పలువురు యువకులు ముందుకు వచ్చి పత్రికాసంపాదనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. 21వ శతాబ్దంలో కొందరు జర్నలిస్టులు తమ సహజ సరిహద్దులు దాటి బహుముఖ ప్రఙను సంపాదించారు. వీరిలో సత్యఖడ్గరాయ్, గణేశ్‌కుమార్ రాజు, సునీల్ పాట్నాయక్, దేబాసిష్ పాఢి, ద్విజన్ పాఢి, నభిననంద గంతయత్, కీ.శే శైలేష్ గంటాయత్, కీ.శే ప్రకాష్ పాఢి, లంబోదర్ ప్రసాద్ దాష్, రూపేష్ సాహూ, గోవింద ఆచార్య, అమూల్యసాహూ, రాజీవ్ లోచన్ రథన్ వంటి జర్నలిస్టులు ముఖులు. గజపతి జిల్లాలో మొదటిసారిగా ఏంటి కరెప్షన్, ప్రొ-పీపుల్స్ రిపోర్టింగ్ కొరకు ఖైదు చేయబడ్డాడు.

మహేంద్రగిరి

మార్చు

పురాణాలలో ప్రస్తావించబడిన మహేంద్రగిరి పరలఖేముండి ప్రాంతంలోని తూర్పుకనుమలో ఉంది. పురాణకథనం అనుసరించి చిరంజీవి అయిన పరశురాముడు మహేంద్రగిరిలో తపమాచరించాడని చెప్పబడింది. ఇక్కడ పాండవులు నిర్మించిన ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా శివరాత్రి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. శివుడు పరశురాముని గురువు, హితైషిగా పురాణ కథనాలు వివరిస్తున్నాయి.

ప్రముఖ వ్యక్తులు

మార్చు
  • మహారాజా శ్రీకృష్ణ చంద్ర గజపతి నారాయణ దేవ్ (1892-1974)
  • కవిచంద్ర గోపాలకృష్ణ (1785-1862)
  • సత్యనారాయణ్ రాజ్‌గురు
  • హరికృష్ణ మహాపాత్రా (1662-1734)
  • చైతన్య రాజ్‌గురు (1758-1702)
  • అపర్ణా పాండా (1860–1927)
  • అపన్న పరిచ్చా (1878–1938)
  • నీలమణి పాణిగ్రాహి (1869–1967)
  • పద్మనాభ నారాయణ దేవ్ (1872 - 1904)
  • అనంత చరణ పాత్రా
  • వేణిమాధవ్ పధి (1919–2008)

మూలాలు

మార్చు
  1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 2.11 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Solomon Islands 571,890 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Wyoming 563,626
  6. Assembly Constituencies and their EXtent
  7. Seats of Odisha
  8. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.