విజాగపటం కొండ ప్రాంతాల ఏజెన్సీ

బ్రిటిషు భారతదేశంలో, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం లోని ఒక ఏజెన్సీ

విజాగపటం కొండ ప్రాంతాల ఏజెన్సీ (విజాగపటం హిల్ ట్రాక్ట్స్ ఏజెన్సీ), బ్రిటిష్ ఇండియా లోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక ఏజెన్సీ. దీనికి స్వయంప్రతిపత్తి ఉండేది. అప్పటి విశాఖపట్నం జిల్లా కలెక్టరు అధీనంలో ఉన్న ఏజెంట్ ద్వారా దీన్ని పర్యవేక్షించేవారు.

చరిత్ర

మార్చు

1834 నవంబరు 18 నాటి రస్సెల్ నివేదిక సిఫార్సుల ఆధారంగా 1835 ఘుముసార్ తిరుగుబాటు తర్వాత ఈ ఏజెన్సీని సృష్టించారు. ఆ సిఫార్సుల ప్రకారం, మద్రాసు ప్రెసిడెన్సీ ఈశాన్య భాగంలోని కొండ ప్రాంతాల జమీందార్లకు ఇతర జిల్లాల కంటే ఎక్కువ స్వయంప్రతిపత్తి ఇచ్చారు. అయితే, దేశంలోని సాధారణ పరిపాలనను విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌కు లోబడి ఉన్న కమిషనర్ లేదా ఏజెంట్ పర్యవేక్షించాలి. ప్రతిపాదనలను మద్రాసు ప్రభుత్వం ఆమోదించి, చివరికి 1839 చట్టం XXIV ద్వారా ఏజెన్సీలు సృష్టించారు.

పరిధి

మార్చు

ఈ ఏజెన్సీ విజయనగరం, బొబ్బిలి, పాలకొండ, గోల్గొండ, జైపూర్, కురుపాం, సంగంవలస, చెముడు, పాచిపెంట, సాలూరు, మాడుగుల, బెల్గాం, సర్వపిల్లి, మేరంగి జిల్లాలలోని జమీందారీ ఎస్టేట్‌ల వ్యవహారాలను నియంత్రించేది.

ప్రస్తుత ఉమ్మడి విశాఖపట్నం జిల్లా లోని అరకులోయ, గొలుగొండ, చింతపల్లి, డుంబ్రిగుడ, గంగరాజు మాడుగుల, గూడెం కొత్త వీధి, హుకుంపేట, కొయ్యూరు, పెద బయలు, ముంచింగిపుట్టు మండలాలు, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సీతానగరం, పార్వతీపురం, కురుపాం, బాడంగి, గరుగుబిల్లి, మెంటాడ, పాచిపెంట, మక్కువ, బలిజిపేట, బొబ్బిలి మండలాలు, ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్, రాయగడ, నబరంగాపూర్ జిల్లాలు కొండ ప్రాంతాల ఏజెన్సీలో భాగంగా ఉండేవి

ఇవి కూడా చూడండి

మార్చు
  • గంజాం హిల్ ట్రాక్ట్స్ ఏజెన్సీ

మూలాలు

మార్చు
  • D. F. Carmichael (1869). A manual of the district of Vizagapatam, in the presidency of Madras. The Asylum Press. pp. 234–235.
  • MaClean, C. D. (1877). Standing Information regarding the Official Administration of Madras Presidency. Government of Madras. p. 69.