గంటి ప్రసాదం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గంటి ప్రసాదం గా పిలువబడే గంటి ప్రసాదరావు నక్సలైటు నాయకుడుగా మరిన కవి. 1947, ఏప్రిల్ 28న విజయనగరం జిల్లా, బొబ్బిలిలో జన్మించాడు. 2011 సంవత్సరంలో మావోయిస్టులు ఒడిషా రాష్ట్రం లోని మల్కాన్‌గిరి జిల్లా కలెక్టరును బంధించినపుడు ప్రభుత్వం విడుదల చేసిన ఖైదీలలో గంటి ప్రసాదం ఒకరు.
గంటి ప్రసాదరావు / గంటి ప్రసాదం | |
---|---|
జననం | గంటి ప్రసాదరావు 1947 ఏప్రిల్ 28 బొబ్బిలి , విజయనగరం జిల్లా , ఆంధ్రప్రదేశ్ |
నివాస ప్రాంతం | బొబ్బిలి ,ఆంధ్రప్రదేశ్ , ఇండియా |
ఇతర పేర్లు | గంటి ప్రసాదం |
వృత్తి | నక్సలైట్ |
మతం | హిందూ |
మరణం
మార్చుజూలై 4, 2013 న, నెల్లూరులో 65 సంవత్సరాల వయస్సులో ఇతను హత్యకు గురయ్యాడు.[1] దుండగులు అతి పాశవికంగా ఇతడిని కాల్చి ఆపైన కత్తితో మెడపై నరకడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
అమరవీరుల స్మారక దినం సందర్భంగా నెల్లూరు నగరంలోని టౌన్‌హాల్లో జూలై 4, 2013 న గురువారం సంస్మరణ సభను బంధుమిత్రుల కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.ఈ సభకు గంటి ప్రసాద్‌తోపాటు ఆ కమిటీ అధ్యక్షురాలు బి.అంజనమ్మ, కమిటీ సభ్యులు నరసన్న తదితరులు హాజరయ్యారు. అయితే ఆరవింద్ నగర్ లోని ఆసుప్రతిలో చికిత్స పొందుతోన్న దివంగత మావోయిస్ట్ నేత సోదరిని పరామర్శించారు. అనంతరం ఆయన తిరిగి వెళ్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాంతో ఆయన్ని నెల్లూరులోని నారాయణ సూపర్ స్పెషాలటీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అక్కడ చికిత్స పొందుతూ జూలై 5 అర్థరాత్రి 1:30 నిమిషాలకు మృతి చెందాడు.